హైదరాబాద్ : తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ గురువారం హైదరాబాద్లో ప్రారంభంకానుంది. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 20 హెల్ప్లైన్ సెంటర్లలో ధృవ పత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఎంసెట్ కౌన్సింగ్కు 90,556 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు.
కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు హాల్టికెట్లు, ర్యాంక్ కార్డు, ఆదాయ పత్రం, ఇంటర్ మార్క్ మెమో, కుల ధృవీకరణ పత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో ఈ కౌన్సెలింగ్కు హాజరుకావాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.