టాప్‌ 27కే టిక్‌ | second phase is final options in engineering counselling | Sakshi
Sakshi News home page

టాప్‌ 27కే టిక్‌

Published Mon, Jul 29 2024 4:22 AM | Last Updated on Mon, Jul 29 2024 4:29 AM

second phase is final options in engineering counselling

రెండోదశ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో ముగిసిన ఆప్షన్ల ప్రక్రియ 

మొత్తం 58 వేల మంది.. 61 లక్షల ఆప్షన్లు 

ఎక్కువమంది టాప్‌ 27 కాలేజీలకే తొలి ఆప్షన్‌.. కంప్యూటర్‌ కోర్సులకు 45 వేల మంది ప్రాధాన్యం

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపునకు నిర్వ హించిన రెండోదశ కౌన్సెలింగ్‌లో ఆప్షన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. గడువు ముగిసే సమయానికి మొత్తం 58 వేల మంది 61 లక్షల వరకూ ఆప్షన్లు ఇచ్చారు. ఎక్కు వ మంది విద్యార్థులు టాప్‌ 27 కాలేజీలకే తొలి ఆప్షన్లు ఇచ్చారు.

45 వేల మంది కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఏఐఎంఎల్, సైబర్‌ సెక్యూరిటీ, డేటాసైన్స్‌ లాంటి కోర్సులను ఎక్కువగా కోరుకున్నారు. జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌ చుట్టుపక్కలున్న సాధారణ కాలేజీలకు తక్కువ ఆప్షన్లు వచ్చాయి. ఈ కాలేజీల్లో కంప్యూటర్‌ బ్రాంచీలున్నా మెజారిటీ విద్యార్థులు ప్రాధాన్యతనివ్వలేదు. ఫలితంగా టాప్‌ 50 కాలేజీల్లో కంప్యూటర్‌ కోర్సులకు పోటీ కని్పస్తోంది. మిగతా కాలేజీల్లో తేలికగా సీట్లు వచ్చే వీలుంది. 

ఈసారైనా ‘కంప్యూటర్‌’సీటు వచ్చేనా? 
రెండో దశ కౌన్సెలింగ్‌లో కనీ్వనర్‌ కోటా కింద 7,024 సీట్లు భర్తీ చేస్తారు. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 22,753 సీట్లు మిగిలిపోయాయి. పెరిగిన సీట్లతో కలుపుకొంటే 29,777 సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే తొలి దశలో సీట్లు వచి్చనా ఈసారి ఎక్కువ మంది టాప్‌ కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు. సివిల్, మెకానికల్‌ బ్రాంచీల్లో సీట్లు వచి్చన వాళ్ళూ కంప్యూటర్‌ కోర్సులకు రెండో దశలో ఆప్షన్లు ఇచ్చారు. ఈ సంవత్సరం 176 కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి.

మొత్తం 1,11,480 సీట్లు అందుబాటులోఉన్నాయి. అయితే గత ఏడాది 1,10,069 సీట్లు అందుబాటులో ఉండటాన్ని బట్టి చూస్తే మొత్తంగా 1,411 సీట్లు మాత్రమే పెరినట్టయ్యింది. కాగా మొత్తం సీట్లలో 70 శాతం కనీ్వనర్‌ కోటా కింద భర్తీ చేయాల్సి ఉండగా కనీ్వనర్‌ కోటా సీట్లలో 75 శాతం కంప్యూటర్‌ కోర్సుల్లోనే ఉన్నాయి. దీంతో విద్యార్థులు రెండో దశ కౌన్సెలింగ్‌లో కంప్యూటర్‌ బ్రాంచీ సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు. ఆశలు పెట్టుకున్నారు.  

ఆశలు పెంచుతున్న కటాఫ్‌ 
    రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించి కటాఫ్‌ ఈ సంవత్సరం పెరిగింది. సీట్లు పెరగడం, కొత్త ఇంజనీరింగ్‌ కాలేజీలు రావడమూ దీనికి కారణం. దీంతో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో సీట్లు పొందే ర్యాంకుల్లో తేడా కని్పస్తోంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో ఇది స్పష్టమైంది.

ఉస్మానియా యూనివర్సిటీలో గత ఏడాది బాలురకు 1,391 ర్యాంకుకు సీటు వస్తే, ఈ సంవత్సరం 1,850వ ర్యాంకరుకు కూడా సీటు వచి్చంది. బాలికల్లో గత ఏడాది 1,598గా ఉన్న ర్యాంకు ఇప్పుడు 1,850వ ర్యాంకుకు పెరిగింది. జేఎన్‌టీయూహెచ్‌ సుల్తాన్‌పూర్‌లో గత ఏడాది బాలురకు 8,471 ర్యాంకుకు సీటు వస్తే, ఈ సంవత్సరం 12,046కు కూడా సీటు వచి్చంది. రెండో దశ కౌన్సెలింగ్‌లో కొత్త సీట్లు రావడంతో ఎక్కువ ర్యాంకు వచ్చినా సీట్లు పొందే అవకాశం ఉందేని భావిస్తున్నారు. 

జాడలేని టాపర్లు 
    ఈఏపీసెట్‌లో వెయ్యిలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు మొదటి కౌన్సెలింగ్‌లో సీటు కోసం ముందుకు రాలేదు. ఓపెన్‌ కేటగిరీలో 200 ర్యాంకు వరకూ కేవలం ఒక్కరే సీటు పొందారు. 500 లోపు వాళ్ళు 10 మంది, వెయ్యిలోపు ర్యాంకు వాళ్ళు 74 మంది సీట్లు పొందారు. 10 వేల లోపు ర్యాంకు వాళ్ళు 1,786 మంది సీట్లు పొందారు. అయితే ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించిన జోసా కౌన్సెలింగ్‌ పూర్తయిన నేపథ్యంలో ఆయా సంస్థల్లో సీట్లు ఆశించినా రాని ఎక్కువ మంది రాష్ట్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయతి్నంచే వీలుంది. దీంతో రెండోదశ సీట్ల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement