
కేయూ క్యాంపస్: రాష్ట్రం లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్–2021 ఫలితాలను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి మంగళవారం వెల్లడించారు. ఈ ఏడాది అగస్టు 19, 20వ తేదీల్లో మూడు సెషన్‌లలో ఈ పరీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ, ఏపీ నుంచి 56,962 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల సెమినార్ హాల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment