సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వారం రోజుల్లోగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్‌ను (ఈసీ) నియమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండగా, అక్టోబరులో కాకతీయ యూనివర్సిటీకి ఈసీని నియమించింది. మిగతా వర్సిటీలకు ఈసీలు లేకపోవడంతో పాలన స్తంభించిపోయింది. దీంతో వర్సిటీల ఈసీల్లో ఉండే సభ్యుల పేర్లతో కూడిన ఫైలును ప్రభుత్వానికి గతంలోనే పంపించామని, వారం రోజుల్లోగా ఈసీల నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి గురువారం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment