
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ - 2018 షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సోమవారం ఎంసెట్ షెడ్యుల్‌ను విడుదల చేశారు. మే 2నుంచి ఐదు రోజులపాటు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 2, 3 న అగ్రికల్చరర్, ఫార్మాకు సంబంధించి, 4,5,7 తేదీల్లో ఇంజరీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంసెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 4 చివరి తేదీ. అపరాద రుసుముతో ఏప్రిల్ 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 6 నుంచి 9 వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే సవరణ చేసుకోవచ్చు. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలో 10, ఏపీలో నాలుగు సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment