Eamcet notification
-
నేడు ఎంసెట్ నోటిఫికేషన్
-
నేడు ఎంసెట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం ఎంసెట్ పూర్తిస్థాయి షెడ్యూల్ ఖరారైంది. దీనిపై మంగళవారం నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 2 నుంచి 7వ తేదీ వరకు (6వ తేదీ మినహా.. ఆరోజున నీట్ పరీక్ష ఉంది) ఆన్లైన్ విధానంలో పరీక్షలను నిర్వహిస్తారు. ఈ మేరకు సోమవారం జేఎన్టీయూలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నా రు. సమావేశం అనంతరం పాపిరెడ్డితోపాటు ఎంసెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ యాదయ్య వివరాలను వెల్లడించారు. తొలిసారిగా ఆన్లైన్లో.. బీఈ/బీటెక్, బయోటెక్, బీటెక్ డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, బీఫార్మసీ, బీఎస్సీ హానర్స్, అగ్రికల్చర్/బీఎస్సీ (హానర్స్), హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, ఫార్మ్–డి కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్–2018ను నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని.. రోజూ రెండు సెషన్లలో, ఒక్కో సెషన్లో 25 వేల మందికి పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక్కో సెషన్‌కు ఇచ్చే ప్రశ్నలు వేర్వేరుగా ఉం టాయి కనుక విద్యార్థుల మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ చేపడతామన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ నేతృత్వంలో దానిని ఖరారు చేశామని, అవగాహన కోసం దానిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈసారి తెలుగు, ఇంగ్లిషుతోపాటు ఉర్దూ మీడియంలోనూ ప్రశ్నలు ఇస్తామని, వారికి ఇచ్చే ప్రశ్నలు ఉర్దూ, ఇంగ్లిషు రెండు భాషల్లో ఉంటాయని చెప్పారు. మెయిల్ ఐడీ తప్పనిసరి ఆన్లైన్ పరీక్షల నిర్వహణలో సమస్యలు రాకుండా పక్కా చర్యలు చేపడుతున్నామని, పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. ఈసారి దరఖాస్తుకు మెయిల్ఐడీ తప్పనిసరి చేశామని, ఏ సమాచారమైనా మెయిల్‌కే పంపిస్తామని వెల్లడించారు. మే 9న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, అదేరోజున ఆన్లైన్ పరీక్ష జవాబు పత్రం (రెస్పాన్స్ షీట్) మెయిల్ ఐడీకే పంపుతామని చెప్పారు. ఆన్లైన్ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఐదు జోన్లతోపాటు కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, నిజమాబాద్, వరంగల్, ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులో ప్రాంతీయ కేంద్రాలు ఉంటాయని తెలిపారు. ఆన్లైన్ పరీక్షలకు ప్రాక్టీస్ కోసం ్ఛ్చఝఛ్ఛ్టి. ్టటఛిజ్ఛి.్చఛి.జీn వెబ్సైట్లో మాక్ టెస్టుల లింకులను అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా ఈసారి ఆన్లైన్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష ఫీజులు పెంచుతున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. గతేడాది ఎస్సీ, ఎస్టీలకు రూ.250గా ఉన్న ఫీజు ఈసారి రూ.400కు.. బీసీ, జనరల్ విద్యార్థులకు రూ.500 నుంచి రూ.800కు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇదీ షెడ్యూల్ 27–2–2018: ఎంసెట్ నోటిఫికేషన్ 4–3–2018 నుంచి 4–4–2018 వరకు: ఆన్లైన్లో దరఖాస్తులు 6–4–2018 నుంచి 9–4–2018 వరకు: దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం 11–4–2018 వరకు: రూ.500 ఆలస్య రుసుముతో; 18వ తేదీ వరకు రూ.1,000; 24వ తేదీ వరకు రూ.5 వేలు; 28వ తేదీ వరకు రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తులు 20–4–2018 నుంచి 1–5–2018 వరకు: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం 2–5–2018, 3–5–2018: అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు (ఉదయం సెషన్ 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి 6 గంటల వరకు) 4–5–2018, 5–5–2018, 7–5–2018: ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్ష -
తెలంగాణ ఎంసెట్ షెడ్యుల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ - 2018 షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సోమవారం ఎంసెట్ షెడ్యుల్‌ను విడుదల చేశారు. మే 2నుంచి ఐదు రోజులపాటు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 2, 3 న అగ్రికల్చరర్, ఫార్మాకు సంబంధించి, 4,5,7 తేదీల్లో ఇంజరీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంసెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 4 చివరి తేదీ. అపరాద రుసుముతో ఏప్రిల్ 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 6 నుంచి 9 వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే సవరణ చేసుకోవచ్చు. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలో 10, ఏపీలో నాలుగు సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. -
ఈ నెల 29న ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘ఎంసెట్’ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 29న ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల సేకరణ ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 21 వరకు ఆఖరు తేదీని నిర్ణయించినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 29వ తేదీన ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. -
నేడు ఎంసెట్ నోటిఫికేషన్
-
నేడు ఎంసెట్ నోటిఫికేషన్
28 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు.. మే 14న ప్రవేశ పరీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ బుధవారం జారీకానుంది. విద్యార్థులు ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆన్లైన్లో (http://www.tseamcet.in) దరఖాస్తు చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణతోపాటు ఏపీకి చెందిన విద్యార్థులు కూడా ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 14న నిర్వహించే ఈ పరీక్ష ఫీజును రూ. 250గా ఎంసెట్ కమిటీ నిర్ణయించింది. ఇంజనీరింగ్, మెడికల్ రెండూ రాయాలనుకునే వారు రూ. 500 చెల్లించాలి. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య తేదీల్లో సవరించుకోవచ్చు. రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 వరకు, రూ. 1,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ. 5 వేల ఆలస్య రుసుముతో మే 5వ తేదీ వరకు, రూ. 10 వేల ఆలస్య రుసుముతో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 8 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే నెల 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. 16న కీ వెల్లడిస్తారు. 28న తుది ర్యాంకులను ప్రకటిస్తారు. -
'ఎంసెట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి'
హైదరాబాద్: ఎంసెట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా విద్యార్ధులకు ఎంసెట్ మార్కుల ద్వారా కాకుండా ఇంటర్ మార్కుల ద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాల్లో సీట్లు భర్తీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఎంసెట్ లో మార్పులు చేయదల్చుకుంటే విద్యార్థి సంఘాలు, రాజకీయ పక్షాలు, విద్యావేత్తలతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని శైలజానాథ్ ప్రభుత్వానికి సూచించారు. -
తెలంగాణకు వేరుగా కౌన్సెలింగ్!
-
తెలంగాణకు వేరుగా కౌన్సెలింగ్!
* ఎంసెట్ ప్రవేశాలకు విడిగా నోటిఫికేషన్ జారీ యోచనలో టీ సర్కారు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాలకు సొంతంగానే కౌన్సెలింగ్ నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. సొంతంగా ప్రవేశాలు చేపట్టేందుకు వీలయ్యే అంశాలపై పరిశీలిస్తోంది. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై కోర్టు కాపీ ఇంకా రానందున, అధికారిక నిర్ణయం జరగనందున తమ తుది నిర్ణయాన్ని తేలనట్లు సమాచారం. 10వ తేదీ నాటికి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొందని ఏపీ ఉన్నత విద్యామండలి చెప్పినా... విడిగా ప్రవేశాలు చేపట్టేందుకు ఏం చేయాలనే అంశంపైనే తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇక్కడ 10వ తేదీ నాటికి సర్టిఫికెట్ల తనిఖీ ప్రారంభించినా... తెలంగాణకు ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ను జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.పదో తేదీన పండుగ కావడంతో.. వెరిఫికేషన్‌కు అవకాశం ఎలాగూ ఉండదు. 11న సుప్రీంలో తుది తీర్పు రానుండటంతో... ఆ రోజు తమ వాదనలు కోర్టు దృష్టికి తీసుకెళ్లవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం పకడ్బందీగా సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతోపాటు మండలి ఏర్పాటు, చైర్మన్ నియామకం, సర్టిఫికెట్ల తనిఖీ, కౌన్సెలింగ్ నిర్వహణ స్థితిగతులు వంటి అంశాలపై బుధవారం పొద్దంతా సీఎం, అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. బుధవారం ఉదయమే సీఎం కేసీఆర్‌తో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, తెలంగాణ మండలి చైర్మన్ పాపిరెడ్డి సమావేశమయ్యారు. ఆ తరువాత ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో కార్యదర్శి వికాస్‌రాజ్, సాంకేతిక విద్య కమిషనర్ శైలజారామయ్యర్ పాల్గొన్నారు. అనంతరం ఎంసెట్ వ్యవహరంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వద్ద జరిగిన సమావేశంలో వికాస్‌రాజ్ పాల్గొన్నారు. -
10వ తేదీ నాటికి వెరిఫికేషన్
* తెలంగాణలో ఎంసెట్‌పై ఏపీ ఉన్నత విద్యా మండలి * ఏపీలో నేటి నుంచి మొదలు * వెబ్ ఆప్షన్లపై రెండ్రోజుల్లో నిర్ణయం * 23 నాటికి ఇరు రాష్ట్రాల్లో ధ్రువపత్రాల తనిఖీ పూర్తి * 29కల్లా కౌన్సెలింగ్ పూర్తి * సెప్టెంబర్ తొలివారంలో తరగతులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌లో గురువారం (7వ తేదీ) నుంచి విద్యార్థుల ధ్రువపత్రాల తనిఖీ ప్రక్రియ ప్రారంభం కానుందని, తెలంగాణలో 10వ తేదీ నాటికి ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కమిటీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం వేణుగోపాలరెడ్డి విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ ఈనెల 23 నాటికి ధ్రువపత్రాల తనిఖీ పూర్తవుతుందని చెప్పారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రక్రియకు అంగీకరించిందన్నారు. అయితే తెలంగాణలో హెల్ప్‌లైన్ కేంద్రాలను తెరవబోమని పాలిటెక్నిక్ అధ్యాపక సంఘాలు ప్రకటించాయని, వాటితో సమావేశం ఏర్పాటు చేసి ఒప్పించేందుకు రెండు మూడు రోజులు పడుతుందని తెలంగాణ అధికారులు వివరించారని వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి 10వ తేదీ నాటికి తెలంగాణలో ధ్రువపత్రాల పరిశీలనను చేపడతామని చెప్పారని వివరించారు. ఇదివరకే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రక్రియ జరుగుతుందని, తెలంగాణలో కొంత ఆలస్యంగా ప్రారంభమైనా.. మొదటి రోజు 1వ ర్యాంకు నుంచి 10 వేల ర్యాంకు లేదా 20 వేల ర్యాంకు వరకు పరిశీలన చేపడతామన్నారు. వెబ్ ఆప్షన్లపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. శుక్ర లేదా శనివారాల్లో మరోసారి సమావేశమై వెబ్ ఆప్షన్లను ఏయే తేదీల నుంచి ప్రారంభించాలనే దానిపై నిర్ణయిస్తామని చెప్పారు. మొత్తానికి ఈనెల 29వ తేదీ నాటికి ప్రవేశాలు పూర్తి చేసి.. 30, 31 తేదీల్లో విద్యార్థులకు సీటు కేటాయింపు లేఖలు పంపిస్తామని పేర్కొన్నారు. వచ్చే నెల 1 లేదా 2వ తేదీన తరగతులను ప్రారంభిస్తామని వివరించారు. స్పష్టత ఇస్తుందనుకుంటా..! విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలుచేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందని వేణుగోపాలరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా స్పష్టత ఇస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. కాలేజీల్లో ఫీజులపై స్పష్టత లేదని, తెలంగాణలో విద్యార్థులకు నివాసం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేవని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘దానిపై నాకు క్లారిటీ లేదు. అవసరమైతే ప్రభుత్వాలను సంప్రదిస్తాం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రెండు ప్రభుత్వాలు కూడా అవసరమైన చర్యలు చేపడతాయని భావిస్తున్నాం. కళాశాలల అనుమతులు, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి ఉత్తర్వులు రావాల్సి ఉంది. వాటిని త్వరగా ఇవ్వాలని రెండు ప్రభుత్వాలను కోరుతాం..’’ అని చైర్మన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌన్సిల్ చైర్మన్‌ను భేటీకి పిలవలేదేమని ప్రశ్నించగా... పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తామే కాంపిటెంట్ అథారిటీ అని, కొత్త చైర్మన్ ప్రవేశాల కమిటీలో సభ్యుడు కానందున పిలవలేదని తెలిపారు. ‘టీ’ చైర్మన్‌కు అందని పిలుపు.. ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను ఆహ్వానించలేదు. టీ మండలి చైర్మన్‌ను పిలవకపోవడంతోపాటు కాంపిటెంట్ అథారిటీ ఎవరనే అంశంపైనా సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా కాంపిటెంట్ అథారిటీ ఎవరనే విషయంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, కౌన్సిల్ చట్టం ప్రకారం చైర్మన్‌గా తనకున్న అధికారాల పరిధిని వేణుగోపాలరెడ్డి వివరించినట్లు తెలిసింది. ఇక తెలంగాణ మండలికి చైర్మన్‌ను నియమించాక కూడా సమావేశానికి పిలవకపోవడం ఏమిటని, ఆయనను సమావేశానికి పిలవాలని లేఖ రాసిన తరువాత కూడా పట్టించుకోకపోవడం ఏమిటనే అంశంపై తెలంగాణ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.