ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘ఎంసెట్’ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘ఎంసెట్’ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 29న ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సేకరణ ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 21 వరకు ఆఖరు తేదీని నిర్ణయించినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 29వ తేదీన ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు.