
'ఎంసెట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి'
ఎంసెట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఎంసెట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా విద్యార్ధులకు ఎంసెట్ మార్కుల ద్వారా కాకుండా ఇంటర్ మార్కుల ద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాల్లో సీట్లు భర్తీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఎంసెట్ లో మార్పులు చేయదల్చుకుంటే విద్యార్థి సంఘాలు, రాజకీయ పక్షాలు, విద్యావేత్తలతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని శైలజానాథ్ ప్రభుత్వానికి సూచించారు.