కేయూ క్యాంపస్: తెలంగాణలో ఈ విద్యాసంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్‌ను తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి తెలిపారు. కేయూలో బుధవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. టీఎస్ ఐసెట్–2018 నోటిఫికేషన్‌ను ఈ నెల 22న విడుదల చేయను న్నట్లు వెల్ల డించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకో వాలని, ఈ ప్రక్రియ మార్చి 6 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. అప రాధ రుసుము లేకుండా ఐసెట్ కు దర ఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు ఏప్రిల్ 30 వరకు ఉంటుందన్నారు. రూ.500 అపరాధ రసుముతో మే 5 వరకు, రూ.2,000 అపరాధ రుసుము తో మే 10 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మే 14 వరకు, రూ.1 వేలఅపరాధ రుసుముతో మే 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకో వచ్చన్నారు.
దరఖాస్తు ఫారం ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.450, ఇత రులకు రూ.650 చెల్లించాల్సి ఉంటుం దన్నారు. మే 7న అభ్యర్థులు హాల్ టికె ట్లు డౌన్‌లోడు చేసుకోవచ్చని.. ప్రవేశ పరీక్ష మే 23, 24 తేదీల్లో మూడు సెషన్లలో బ్యాచ్‌లవారీగా ఆన్‌లైన్‌లో నిర్వహిం చనున్నట్లు వివరించారు. మే 23న ఉద యం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. మే 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. ప్రిలిమినరీ కీని మే 27న వెల్లడిస్తామని చెప్పారు. ప్రిలి మినరీ కీపై అభ్యంతరాలను జూన్ 4 వరకు స్వీకరిస్తామని, జూన్ 6న ఐసెట్ ఫలితాలను, ఫైనల్ కీని విడుదల చేస్తా మన్నారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకట రమ ణ, టీఎస్ ఐసెట్ చైర్మన్, కేయూ వీసీ సాయన్న, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.సుబ్రమణ్యశర్మ పాల్గొన్నారు.
కామన్ ఎంట్రన్స్
కేయూ క్యాంపస్: తెలంగాణలోని అన్ని వర్సిటీల పరిధిలో 2018–19 విద్యా సంవత్సరంలో పీజీ కోర్సులో ప్రవేశా లకు కామన్ ఎంట్రన్స్ టెస్టును (పీజీ సెట్) నిర్వహించాలని యోచిస్తున్నా మని పాపిరెడ్డి వెల్లడించారు.
ఆన్‌లైన్‌లో టీఎస్ ఐసెట్
Published Thu, Feb 8 2018 3:08 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment