TS Iset
-
ఆన్లైన్లో టీఎస్ ఐసెట్
కేయూ క్యాంపస్: తెలంగాణలో ఈ విద్యాసంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్‌ను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి తెలిపారు. కేయూలో బుధవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. టీఎస్ ఐసెట్–2018 నోటిఫికేషన్‌ను ఈ నెల 22న విడుదల చేయను న్నట్లు వెల్ల డించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వాలని, ఈ ప్రక్రియ మార్చి 6 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. అప రాధ రుసుము లేకుండా ఐసెట్ కు దర ఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు ఏప్రిల్ 30 వరకు ఉంటుందన్నారు. రూ.500 అపరాధ రసుముతో మే 5 వరకు, రూ.2,000 అపరాధ రుసుము తో మే 10 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మే 14 వరకు, రూ.1 వేలఅపరాధ రుసుముతో మే 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వచ్చన్నారు. దరఖాస్తు ఫారం ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.450, ఇత రులకు రూ.650 చెల్లించాల్సి ఉంటుం దన్నారు. మే 7న అభ్యర్థులు హాల్ టికె ట్లు డౌన్లోడు చేసుకోవచ్చని.. ప్రవేశ పరీక్ష మే 23, 24 తేదీల్లో మూడు సెషన్లలో బ్యాచ్‌లవారీగా ఆన్లైన్లో నిర్వహిం చనున్నట్లు వివరించారు. మే 23న ఉద యం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. మే 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. ప్రిలిమినరీ కీని మే 27న వెల్లడిస్తామని చెప్పారు. ప్రిలి మినరీ కీపై అభ్యంతరాలను జూన్ 4 వరకు స్వీకరిస్తామని, జూన్ 6న ఐసెట్ ఫలితాలను, ఫైనల్ కీని విడుదల చేస్తా మన్నారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకట రమ ణ, టీఎస్ ఐసెట్ చైర్మన్, కేయూ వీసీ సాయన్న, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.సుబ్రమణ్యశర్మ పాల్గొన్నారు. కామన్ ఎంట్రన్స్ కేయూ క్యాంపస్: తెలంగాణలోని అన్ని వర్సిటీల పరిధిలో 2018–19 విద్యా సంవత్సరంలో పీజీ కోర్సులో ప్రవేశా లకు కామన్ ఎంట్రన్స్ టెస్టును (పీజీ సెట్) నిర్వహించాలని యోచిస్తున్నా మని పాపిరెడ్డి వెల్లడించారు. -
నేటి నుంచి టీఎస్ఐసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌ఐసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 16 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో తొలిరోజు 1వ ర్యాంకు నుంచి 12 వేల ర్యాంకు వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తామని సాంకేతిక విద్య కమిషనర్ తెలిపారు. ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ నెల 30 వరకు వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రవేశ పరీక్ష రాసినపుడు నమోదు చేసుకున్న బయోమెట్రిక్ వివరాలను కూడా పరిశీలిస్తారని చెప్పారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో మొత్తం 20,120 ఎంబీఏ సీట్లు ఉండగా, 1,845 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మొదటి దశ కౌన్సెలింగ్‌లోనే మెరుగైన కాలేజీలో సీటు పొందేందుకు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమవెంట ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఆధార్ కార్డు, డిగ్రీ ప్రొవిజనల్, మార్కుల మెమోలు, ఇంటర్, టెన్త్ పాస్ సర్టిఫికెట్లు, టీసీ, కుల, ఆదాయ, నివాస ధ్రువ పత్రాలు, వికలాంగులైతే వైకల్య ధ్రువపత్రం, స్పోర్ట్స్, ఎన్సీసీ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రాసెసింగ్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500, ఇతర కేటగిరీల అభ్యర్థులు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. షెడ్యూల్, తదితర వివరాలకు https://tsicet.nic.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు. -
నేడు టీఎస్ ఐసెట్
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను టీఎస్ ఐసెట్ -2016కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గురువారం జరిగే పరీక్షకు 72,474 మంది అభ్యర్థులు రాయబోతున్నారని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ తెలిపారు. రాష్ట్రంలోని 16 రీజినల్ సెంటర్ల పరిధిలో 127 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహిస్తామని, నిర్ణీత సమయూనికి నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఐసెట్‌కు తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్ష నిర్వహణకు 127 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 32 మంది స్పెషల్ అబ్జర్వర్లు, 140 మంది లోకల్ అబ్జర్వర్లను నియమించామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు తీసుకురావద్దని సూచించారు.