రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను టీఎస్ ఐసెట్ -2016కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను టీఎస్ ఐసెట్ -2016కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గురువారం జరిగే పరీక్షకు 72,474 మంది అభ్యర్థులు రాయబోతున్నారని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ తెలిపారు. రాష్ట్రంలోని 16 రీజినల్ సెంటర్ల పరిధిలో 127 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహిస్తామని, నిర్ణీత సమయూనికి నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
ఐసెట్‌కు తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్ష నిర్వహణకు 127 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 32 మంది స్పెషల్ అబ్జర్వర్లు, 140 మంది లోకల్ అబ్జర్వర్లను నియమించామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్‌లు తీసుకురావద్దని సూచించారు.