
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షలను మే 2వ తేదీ నుంచే నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. గత షెడ్యూల్ ప్రకారం మే 2 నుంచి 7 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని, 7వ తేదీని రిజర్వుగా పెట్టామన్నారు.
మే 6న నీట్ పరీక్ష ఉన్నందునా ఆ రోజును మినహాయించి మిగతా తేదీల్లో పరీక్షలను నిర్వహిం చేలా రోజువారీ షెడ్యూల్‌ను ఖరారు చేస్తామన్నారు. మే 2, 3 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కోర్సులకు, 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహించే అవకాశముందన్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నందున విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తులను బట్టే రోజువారీ పరీక్ష తేదీలు ఉంటాయన్నారు. అగ్రికల్చర్, ఇంజనీరింగ్ విభాగాల రోజువారీ పరీక్షల తేదీలు, వాటి ఫీజులు తదితర అంశాలపై ఎంసెట్ కమిటీ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment