మండలి ఆధ్వర్యంలో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలు! | The degree of online entries under the board! | Sakshi
Sakshi News home page

మండలి ఆధ్వర్యంలో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలు!

Published Sat, Feb 11 2017 3:51 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

మండలి ఆధ్వర్యంలో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలు! - Sakshi

మండలి ఆధ్వర్యంలో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలు!

  • మార్చి మొదటి లేదా రెండో వారంలో నోటిఫికేషన్‌
  • ఎన్‌టీఏ నేపథ్యంలో మార్కుల ఆధారంగా మిగులు సీట్లు భర్తీ
  • ఉన్నత విద్యా మండలి యోచన.. పూర్తి పరిశీలన తర్వాతే నిర్ణయం
  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల ను విద్యా మండలి ఆధ్వర్యంలోనే చేపట్టాల ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పాలకవర్గం నిర్ణయించినట్లు తెలిసింది. మండలి చైర్మన్‌ టి.పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. గతేడాది తొలి సారిగా డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలను కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. కానీ అనేక సమస్యలు తలెత్తాయి. దీంతో వృత్తి విద్యా కాలేజీల్లో మండలి ఆధ్వర్యంలో ప్రవే శాలు చేపడుతున్నట్లుగానే డిగ్రీలోనూ చేప ట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. మార్చి ఒకటో వారం లేదా రెండో వారంలో ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయించారు.

    ప్రవేశాల్లో లోపాలపై అధ్యయనం
    యాజమాన్య కోటా సీట్ల భర్తీ, మైనారిటీ విద్యా సంస్థల్లో సొంత కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల భర్తీ వంటి విధానాల్లో లోపాలు, సమస్యలపై వైస్‌ చాన్స్‌లర్ల నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, అధ్యయనం చేయాలని విద్యా మండలి పాలకవర్గం భేటీలో నిర్ణయించారు. ఇక కన్సార్షియం ఆఫ్‌ అసోసియేషన్స్‌ పేరుతో సొంతంగా చేసుకుంటున్న ప్రవేశాలను నియంత్రించాల ని, పక్కాగా నిబంధనలు పాటించేలా చర్య లు చేపట్టాలని యోచిస్తున్నారు. 2018–19 విద్యా సంవత్సరం నుంచి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలోనే అన్ని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను నిర్వహించడం, జేఈఈ మెయిన్‌ ద్వారానే ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ ప్రవేశాలు చేపట్టేలా కేంద్రం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో... చివరకు మిగిలిపోతున్న సీట్లను మార్కుల ఆధారంగా భర్తీ చేయాలన్న అంశం చర్చకు వచ్చింది. దీనిపై మరింత లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

    ఇతర నిర్ణయాలు..
    అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్‌ హా జరును అమలు చేయాలని.. ప్రస్తుత రెండో సెమిస్టర్‌కు మినహాయింపు ఇ వ్వాలని నిర్ణయించారు. ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలపై అన్ని వర్సిటీల మేధావులతో ఏప్రిల్‌లో జాతీయ సెమి నార్‌ నిర్వహించడంపై చర్చ జరిగింది. కొత్తగూడెంలో మైనింగ్‌ వర్సిటీ ఆవశ్యక తపై మరోసారి ప్రభు త్వానికి సిఫారసు చేయాలని, వర్సిటీల అభివృద్ధి, కోర్సు లు తదితర అంశాలపై వీసీలతో కమి టీ ఏర్పాటు చేసి, నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement