TS ECET 2022 Postponed Due To Severe Floods: TSCHE - Sakshi
Sakshi News home page

TS ECET 2022: 13న జరగాల్సిన ఈసెట్‌ పరీక్ష వాయిదా, ఎంసెట్‌ యథాతథం

Published Mon, Jul 11 2022 7:11 PM | Last Updated on Mon, Jul 11 2022 7:44 PM

TS ECET Exam Has Been Postponed - Sakshi

కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13(బుధవారం)న జరగాల్సిన ఈసెట్‌ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే ఈనెల 14, 15 తేదీల్లో జరిగే ఎంసెట్‌, అగ్రికల్చర్‌ పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్‌ సైతం మీడియా సమావేశంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు మూడు రోజులపాటు సెలవులు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: దంచికొడుతున్న వానలు.. కనువిందు చేస్తున్న ఆ 5 జలపాతాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement