rainstrorms
-
Live Video: నెల క్రితమే నిర్మాణం.. ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి
గాంధీనగర్: నాణ్యత లేకుండా నిర్మిస్తున్న రోడ్లు కొద్ది పాటి వర్షానికే కొట్టుకుపోతున్న సంఘటనలు చాలానే చూశాం. అలాంటి సంఘటనే గుజరాత్లోని అహ్మదాబాద్లో వెలుగు చూసింది. రహదారి నిర్మించిన నెల రోజులకే డొల్లతనం బయటపడింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మధ్యలో ఒక్కసారిగా పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆదివారం కురిసిన వర్షాలకు నగరంలోని సురభి పార్క్ సమీపంలో రోడ్డు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ గొయ్యిలో పూర్తిగా నీటితో నిండిపోయిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. Watch: A road constructed, just a month back caves in, after a few hours of #rains in #Gujarat's #Ahmedabad. #GujaratRains #अहमदाबाद #अमराई वाडी #HeavyRain #VideoViral pic.twitter.com/IBPzk29PVO — Shiv Kumar Maurya (@ShivKum60592848) July 17, 2022 మెట్రో రైలు మార్గంలో పిల్లర్ నంబర్ 123 వద్ద రోడ్డు మధ్యలో పెద్ద గుంత పడినట్లు అధికారులు తెలిపారు. ఆ రోడ్డును కేవలం ఒక నెల ముందే నిర్మాణం చేపట్టటం గమనార్హం. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే.. రోడ్డు మధ్యలో ఒక్కసారిగా కుంగిపోయినప్పుడు అటుగా ఎలాంటి వాహనం వెళ్లకపోవటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వల్సాద్, నవ్సారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గురువారం ఒక్కరోజే 11 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 54 మందికి చేరింది. 14 వేల మంది ఇప్పటికీ తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు.. వర్షాల కారణంగా నాలుగు జాతీయ రహదారులను మూసివేసింది గుజరాత్ ప్రభుత్వం. ఇదీ చదవండి: భారీ మొసలిని బంధించిన అనకొండ.. వీడియో వైరల్ -
TS ECET 2022: 13న జరగాల్సిన ఈసెట్ పరీక్ష వాయిదా
కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13(బుధవారం)న జరగాల్సిన ఈసెట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే ఈనెల 14, 15 తేదీల్లో జరిగే ఎంసెట్, అగ్రికల్చర్ పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ సైతం మీడియా సమావేశంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు మూడు రోజులపాటు సెలవులు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: దంచికొడుతున్న వానలు.. కనువిందు చేస్తున్న ఆ 5 జలపాతాలు -
గాలి వాన బీభత్సం
సాక్షి, కొయ్యలగూడెం : గాలివాన బీభత్సానికి కొయ్యలగూడెం గ్రామ ప్రజలు భీతిల్లారు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ గాలులు, దానికి తోడు వర్షం రావడంతో బీభత్స వాతావరణం నెలకొంది. చేతికి అంది వచ్చిన మామిడికాయలు నేలరాలి పోవడంతో పరిసర ప్రాంతాలకు చెందిన మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అశోక్ నగర్లోని ఆకుల వెంకటేశ్వరరావుకి చెందిన ఇంటిపై తాటిచెట్టు కూలింది. ఆ సమయంలో ఇంట్లోని వారు పక్క గదిలో ఉండటంతో ప్రమాదం తప్పింది. అరగంట వ్యవధిలో భారీ వాన, గాలులకు చెట్లు విరిగి నేలకొరిగాయి. -
మళ్ళీ చైనాకు వర్షాల ముప్పు!
బీజింగ్ః చైనాను వర్షాల ముప్పు వదలడం లేదు. మళ్ళీ వానలు ముంచెత్తే అవకాశం ఉండటంతో ప్రభుత్వం బ్లూ అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం తీవ్రమైన గాలి, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ.. దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ఎడ తెరపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో దక్షిణ చైనా ప్రాంతం అతలాకుతలమౌతోంది. కాస్త తెరపి ఇచ్చిందనుకునే లోపే మళ్ళీ వర్షాలు మొదలవ్వడంతో ప్రభుత్వం బ్లూ అలర్ట్ ప్రకటించింది. దక్షిణ చైనాల్లో గాలి, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ముందు జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేశారు. గుయ్జౌ గువాంగ్జి, హునాన్, జియాంగ్జి, జెజియాంగ్, పుజియాన్, హెబీ, హెనాన్, యున్నాన్ ప్రాంతాల్లో.. రాగల 24 గంటల్లో తుపాను సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. వర్షం థాటికి మట్టి కరిగిపోవడం, కొండచరియలు విరిగి పడటం, వరద నీరు ఊళ్ళను ముంచెత్తడం వంటి అనేక ప్రమాదాలతోపాటు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇళ్ళనుంచీ బయటకు రావద్దని సూచించిన అధికారులు, ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. చైనాలో ఎరుపు, నారింజ, పసుపు, నీలం వంటి నాలుగు రంగులతో వాతావరణ హెచ్చరికల వ్యవస్థ అమల్లో ఉంది. అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో రెడ్ (ఎరుపు) అలర్ట్ ఇస్తారు. ఆ తర్వాత స్థాయిని బట్టి ఆరెంజ్, ఎల్లో, బ్లూ వంటి హెచ్చరికలు జారీ చేస్తారు. బుధవారం నాటికి కురిసిన కుండపోత వర్షాలకు చైనాలో ఇప్పటికే 237 మంది చనిపోగా, 93 మంది వరకూ కనిపించకుండా పోయారు. వర్షాలు, వరదలకు వేల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది.