
కొయ్యలగూడెంలో గాలివాన బీభత్సానికి ఇంటిపై కూలిన తాటిచెట్టు
సాక్షి, కొయ్యలగూడెం : గాలివాన బీభత్సానికి కొయ్యలగూడెం గ్రామ ప్రజలు భీతిల్లారు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ గాలులు, దానికి తోడు వర్షం రావడంతో బీభత్స వాతావరణం నెలకొంది. చేతికి అంది వచ్చిన మామిడికాయలు నేలరాలి పోవడంతో పరిసర ప్రాంతాలకు చెందిన మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అశోక్ నగర్‌లోని ఆకుల వెంకటేశ్వరరావుకి చెందిన ఇంటిపై తాటిచెట్టు కూలింది. ఆ సమయంలో ఇంట్లోని వారు పక్క గదిలో ఉండటంతో ప్రమాదం తప్పింది. అరగంట వ్యవధిలో భారీ వాన, గాలులకు చెట్లు విరిగి నేలకొరిగాయి.