ఇంజనీరింగ్ విద్యార్థుల ఎదురు చూపులకు బ్రేక్
కోర్టు తీర్పుతో మార్గం సుగమం
ఖమ్మం : ఎట్టకేలకు ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులకు సంబంధించి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నెల రోజులుగా ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తున్న ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కళాశాలల వివరాలు, అందులో ఉన్న కోర్సులు, సీట్ల సంఖ్య, ఫీజుల వివరాలతోపాటు పలుకోర్సుల కోసం కోర్టులను ఆశ్రయించిన కళాశాలలు, యూనివర్సిటీకి స్పెషల్ పర్మీషన్ కోసం నమోదు చేసుకున్న కళాశాలల వివరాలను పొందు పరుస్తూ శుక్రవారం సాయంత్రం తుదిజాబితాను విడుదల చేశారు.
ఈ జాబితా ప్రకారం జిల్లాలోని 25 కాలేజీల్లో పలు కళాశాలలకు పూర్తిస్థాయి కోర్సులకు అనుమతులు రాగా, కొన్ని కళాశాలల్లో కొన్ని కోర్సులు యూనివర్సిటీకి అప్పీల్ చేసుకోవడం వల్ల అనుమతి లభిం చిం ది. గత ఏడాది తనిఖీలు నిర్వహించిన కళాశాలలకు ఒక కలర్, కోర్టు పరిధిలో ఉన్న కోర్సులకు మరో కలర్, యూనివర్సిటీ ప్రత్యేక అనుమతితో మంజూరైన కోర్సులకు మరో కలర్ కేటాయించడం తో ఆయా కళాశాలల్లో చేరాలా..? వద్దా అనే విషయమై విద్యార్థులు స్పష్టంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
వెబ్ ఆప్షన్లు ఇలా..
వెబ్ ఆప్షన్లను విద్యార్థులు దగ్గరలోని ఇంటర్‌నెట్ సెంటర్‌లోగానీ, హెల్ప్‌లైన్ సెంటర్లోగానీ, ఇంటర్‌నెట్ అందుబాటు లో ఉన్న ఎక్కడి నుంచి అయినా వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివా రం సాయంత్రం 5 గంటల వరకు 1 నుంచి 44 వేల ర్యాంకుల విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అలాగే 19వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 21వ తేదీ 7 గంటల వరకు 44001 నుంచి చివరి ర్యాంకు వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 21వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 22వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆప్షన్లను మార్చుకోవచ్చు. 24వ తేదీ రాత్రి 6 గంటల నుంచి సీట్ల కేటాయింపు వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎట్టకేలకు వెబ్ ఆప్షన్లు షురూ..
Published Sat, Jul 18 2015 3:36 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement
Advertisement