Minister Srihari Kadiyam
-
ఎట్టకేలకు వెబ్ ఆప్షన్లు షురూ..
ఇంజనీరింగ్ విద్యార్థుల ఎదురు చూపులకు బ్రేక్ కోర్టు తీర్పుతో మార్గం సుగమం ఖమ్మం : ఎట్టకేలకు ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులకు సంబంధించి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నెల రోజులుగా ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తున్న ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కళాశాలల వివరాలు, అందులో ఉన్న కోర్సులు, సీట్ల సంఖ్య, ఫీజుల వివరాలతోపాటు పలుకోర్సుల కోసం కోర్టులను ఆశ్రయించిన కళాశాలలు, యూనివర్సిటీకి స్పెషల్ పర్మీషన్ కోసం నమోదు చేసుకున్న కళాశాలల వివరాలను పొందు పరుస్తూ శుక్రవారం సాయంత్రం తుదిజాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలోని 25 కాలేజీల్లో పలు కళాశాలలకు పూర్తిస్థాయి కోర్సులకు అనుమతులు రాగా, కొన్ని కళాశాలల్లో కొన్ని కోర్సులు యూనివర్సిటీకి అప్పీల్ చేసుకోవడం వల్ల అనుమతి లభిం చిం ది. గత ఏడాది తనిఖీలు నిర్వహించిన కళాశాలలకు ఒక కలర్, కోర్టు పరిధిలో ఉన్న కోర్సులకు మరో కలర్, యూనివర్సిటీ ప్రత్యేక అనుమతితో మంజూరైన కోర్సులకు మరో కలర్ కేటాయించడం తో ఆయా కళాశాలల్లో చేరాలా..? వద్దా అనే విషయమై విద్యార్థులు స్పష్టంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వెబ్ ఆప్షన్లు ఇలా.. వెబ్ ఆప్షన్లను విద్యార్థులు దగ్గరలోని ఇంటర్నెట్ సెంటర్లోగానీ, హెల్ప్‌లైన్ సెంటర్లోగానీ, ఇంటర్నెట్ అందుబాటు లో ఉన్న ఎక్కడి నుంచి అయినా వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివా రం సాయంత్రం 5 గంటల వరకు 1 నుంచి 44 వేల ర్యాంకుల విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అలాగే 19వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 21వ తేదీ 7 గంటల వరకు 44001 నుంచి చివరి ర్యాంకు వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 21వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 22వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆప్షన్లను మార్చుకోవచ్చు. 24వ తేదీ రాత్రి 6 గంటల నుంచి సీట్ల కేటాయింపు వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఈసారికి మినహాయింపునివ్వండి
పాఠ్యపుస్తకాలపై ఉప ముఖ్యమంత్రికి ప్రైవేటు స్కూళ్ల సంఘం విజ్ఞప్తి హైదరాబాద్: ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలు ఇన్నాళ్లు విద్యార్థులకు అందుబాటులో లేనందునే ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించిన పుస్తకాలను ప్రాథమిక పాఠశాలల్లో వినియోగించామని ప్రైవేటు పాఠశాలల సంఘం పేర్కొంది. మంగళవారం సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిశారు. ఇప్పటికే విద్యార్థులు ప్రైవేటు పుస్తకాలను కొనుగోలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే వినియోగించాలన్న నిబంధన నుంచి ఈసారికి మినహాయింపునివ్వాలని కోరారు. ఆ నిబంధన అమలు చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులు నష్టపోతారని, మినహాయింపునిస్తే వచ్చే ఏడాది నుంచి పక్కాగా అమలు చేస్తామని పేర్కొన్నారు. కాగా, సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి, కార్యదర్శిగా శేఖర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శేఖర్‌రెడ్డి, కోశాధికారిగా భూపాల్‌రావు, కేంద్ర ప్రతినిధిగా జేఎస్ పరంజ్యోతి, అసోసియేట్ అధ్యక్షులుగా రాజారెడ్డి, రవిశంకర్, నర్సింహగౌడ్, చంద్రన్న, అధికార ప్రతినిధిగా శేషుకుమార్ తదితరులు ఎన్నికయ్యారు. -
నిట్‌లో నిబంధనల ప్రకారమే సీట్లు
50 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే 371-డి ఎన్ఐటీలకు వర్తించదు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్య హెచ్ఆర్డీ శాఖ కార్యదర్శితో భేటీ న్యూఢిల్లీ: వరంగల్‌లోని నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం కోరడం చట్ట వ్యతిరేక మని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. నిబంధనల ప్రకారం జాతీయ విద్యాసంస్థల్లో స్థానిక విద్యార్థులకే 50 శాతం సీట్లు చెందుతాయని, వీటిలో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద తన పలుకుబడి ఉపయోగించి తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఉదయం ఢిల్లీకి వచ్చిన కడియం, కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ కార్యదర్శి ఎస్.ఎం.మహంతితో సమావేశమయ్యారు. వరంగల్ ఎన్ఐటీలో తమ విద్యార్థులకు సీట్లు కేటాయించాలంటూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలపై ఆయనతో చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడుతూ జాతీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు సంబంధించి 2007లో చేసిన చట్టాల ప్రకారం.. విద్యా సంస్థ ఉన్న రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 50 శాతం సీట్లు, మిగిలిన రాష్ట్రాల విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుందన్నారు. దీని ప్రకారం వరంగల్ నిట్‌లో ఉన్న 740 సీట్లలో తెలంగాణ విద్యార్థులకు 370 సీట్లు దక్కుతాయని స్పష్టం చేశారు. 371-డి ప్రకారం రాష్ర్ట ప్రభుత్వ పరిధిలోకి వచ్చే విద్యా సంస్థల్లోనే పదేళ్లపాటు ఉమ్మడి అడ్మిషన్లు జరగాలని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ ఇదే స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఏ నిబంధనల ప్రకారం చూసినా నిట్ వరంగల్‌లో ఏపీ విద్యార్థులకు కోటా కోరడం సరికాదన్నారు. కేంద్రం వద్ద పలుకుబడి ఉపయోగించి దొడ్డిదారిన సీట్లు పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తే, అన్ని మార్గాల్లో అడ్డుకునేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. ఇలాంటి సందర్భాల్లో గతంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం ప్రకారం సూపర్ న్యూమరీ సీట్లు కేటాయించి ఏపీ విద్యార్థులను ఆదుకోవాలని సూచించారు. వరంగల్ నిట్‌లోనూ అవకాశం ఉంటే, ఏపీ విద్యార్థుల కోసం సూపర్ న్యూమరీ సీట్లు కేటాయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. కొన్ని ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీల్లో నిరుపయోగంగా ఉన్న భూములను పేదల ఇళ్లు నిర్మించేందుకు వినియోగించడంలో తప్పులేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ భూములను ఎందుకు వినియోగిస్తున్నామన్న అంశాన్ని విద్యార్థులు సైతం అర్థం చేసుకోవాలన్నారు.