సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2021–22 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా సీట్లలో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించింది. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. https://ug.ntruhsadmissions.com వెబ్‌సైట్‌లో ప్రాధాన్యత క్రమంలో అన్ని కళాశాలలకు విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేయాలి. అన్ని విడతల కౌన్సెలింగ్‌లలో సీట్ల కేటాయింపునకు ఈ ఆప్షన్లనే పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ నేపథ్యంలో ఆప్షన్ల నమోదు విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆప్షన్లు నమోదు చేసి సబ్మిట్ చేసే సమయంలో రిజిస్టర్ మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలకు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్‌చేసి సబ్మిట్ చేయాలి. ఏ కళాశాలలో సీటు లభించిందన్న సమాచారం విద్యార్థుల మొబైల్ ఫోన్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది. ఆప్షన్ల నమోదులో సాంకేతిక సమస్యలు ఎదురైతే 7416563063, 7416253073, 8333883934, 9063500829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. సలహాలు, సందేహాలకు 08978780501, 07997710168 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
వైద్యకోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
Published Fri, Mar 4 2022 4:34 AM | Last Updated on Fri, Mar 4 2022 9:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment