Medical courses
-
మార్కులు పెరిగినా.. ర్యాంకులు ఢమాల్!
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య కోర్సులు ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో ప్రవేశాలకు ఈసారి విపరీతమైన పోటీ నెలకొంది. గత రెండేళ్లతో పోలిస్తే ఎక్కువ మార్కులు సాధించినవారికి సైతం ఈసారి సీటు దక్కుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఎక్కువ మార్కులు సాధించినా ర్యాంకులు వేలల్లోకి చేరడంతో ఎక్కడ సీటు దక్కుతుందన్నదీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. 2024–25 విద్యా సంవత్సరానికిగాను యూజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్ కోసం వెబ్సైట్లో రిజి్రస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఆలిండియా కోటా (ఏఐక్యూ)కు సంబంధించిన కౌన్సెలింగ్ ఈనెల 14వ తేదీ నుంచి మొదలవనుంది. తొలుత ఆలిండియా కోటా సీట్ల కౌన్సెలింగ్ పూర్తిచేసి.. తర్వాత రాష్ట్ర స్థాయి సీట్లను భర్తీ చేస్తారు.లీకేజీ గందరగోళం మధ్య.. ⇒ ఈ ఏడాది యూజీ నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం విద్యార్థుల ను తీవ్ర గందరగోళంలోకి నెట్టింది. ఫలితాలు వెలువడ్డాక సుప్రీంలో కేసులు, వాదప్రతివాదనల అనంతరం కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది. దీనితో కాస్త ఆలస్యంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు వెలువడ్డాయి. వాటిని చూసుకున్న అభ్యర్థు లు సీటు వస్తుందా? రాదా? వస్తే ఎక్కడ రావొచ్చన్న ఆందోళనలో పడ్డారు.మార్కులు ఘనం.. ర్యాంకు పతనం.. ఈ ఏడాది రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంకు సాధించిన విద్యార్థికి వచి్చన మార్కులు 711, ఆలిండియా స్థాయిలో వచి్చన ర్యాంకు 137. అదే 2022 యూజీ నీట్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థికి 711 మార్కులేరాగా.. జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు వచి్చంది. మంచి మార్కులు వచి్చనా.. ఆలిండియా ర్యాంకు బాగా తగ్గిపోయింది. పోటీ విపరీతంగా పెరగడం, చాలా మంది విద్యార్థులకు మార్కులు పెరగడమే దీనికి కారణం. మెరుగైన మార్కులు సాధించామనుకున్న విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకులు మాత్రం తగ్గిపోవడంతో ఆందోళనలో పడ్డారు. దీంతో ఏ కాలేజీలో సీటు వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రధానంగా ఆలిండియా కోటా సీట్ల విషయంలో సీటు ఎక్కడ వస్తుందనేది అంచనా వేసే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు.రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌లోనూ అయోమయంప్రస్తుతం రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదలవడంతో విద్యార్థులు రిజి్రస్టేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏ కాలేజీలో సీటు వస్తుందనేది అంచనా వేసుకుంటున్నారు. కానీ ఏపీకి 15% కోటా సీట్లు రద్దు, స్థానికతపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మార్కులు, ర్యాంకుల తీరు మారడం వంటివి విద్యార్థుల్లో అయోమయం సృష్టిస్తున్నాయి. కాలేజీల వారీగా సీట్లు, రిజర్వేషన్ కోటా ప్రకా రం విభజించి పరిశీలిస్తేనే ఏదైనా అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని సీని యర్లు అభిప్రాయపడుతున్నారు. ఆలిండియా కోటాను మినహాయించి రాష్ట్ర స్థాయిలో సీట్ మ్యాట్రిక్స్ విడుదలైతేనే స్పష్టత వస్తుందని అంటున్నారు. -
0.001 శాతం నిర్లక్ష్యమున్నా పరిష్కరించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన నీట్–యూజీ 2024 పరీక్ష విధానం, నిర్వహణలో 0.001 శాతం లోపం తలెత్తినా సరే సకాలంలో పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం వ్యాఖ్యానించింది. మే ఐదో తేదీన నిర్వహించిన నీట్‌యూజీలో కొందరు విద్యార్థులకు సమయాభావం, ఇతరత్రా కారణాలతో గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల సెలవుకాల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) చేపట్టిన విషయం విదితమే. ‘‘ అత్యంత కఠినమైన ఇలాంటి ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులు ఎంతగా శ్రమిస్తారో మనందరికీ తెలుసు. వైద్యుడే సమాజంలో అవినీతికి పాల్పడితే సమాజానికి ఎంతటి నష్టం చేకూరుతుందో ఊహించండి. ప్రవేశపరీక్షలు నిర్వహించే ఒక బాధ్యతాయుత సంస్థగా ఒకే మాట మీద నిలబడాలి. మీ వైపు ఏదైనా తప్పు జరిగితే నిజాయతీగా ఒప్పుకోవాలి. సరిదిద్దేందుకు చేపట్టిన చర్యలనూ వివరించాలి. కనీసం ఆ దిశగా చర్యలకు సమాయత్తం అయ్యామని అయినా నిరూపించుకోవాలి. అప్పుడే మీ పనితీరుపై విశ్వాసం పెరుగుతుంది’’ అని ఎన్టీఏ తరఫున వాదించిన లాయర్లకు కోర్టు చీవాట్లు పెట్టింది.రెండు వారాల్లో స్పందన తెలపండికేసుల తదుపరి విచారణ జరిగే జూలై 8వ తేదీలోపు ఏమేం చర్యలు చేపట్టారో నివేదించాలని కోర్టు సూచించింది. మళ్లీ పరీక్షను నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై రెండు వారాల్లోపు మీ స్పందన తెలపాలంటూ ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. పరీక్షలో అడిగిన ఒక ప్రశ్నను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రస్తావించగా ‘‘దానికి ఎన్టీఏ, కేంద్రం సమాధానం చెప్తాయి. మీరెందుకు పిటిషన్లు వేశారో మమ్మల్ని అర్థంచేసుకోనివ్వండి.మీ వాదనలను సావధానంగా వినేందుకు సాయంత్రందాకా కూర్చుంటాం’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌నూ కోర్టు విచారించింది. గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు ఆ మార్కులను తీసేశామని కేంద్రం, ఎన్టీఏ జూన్ 13వ తేదీన కోర్టుకు నివేదించిన విషయం విదితమే. ఆ మార్కులు పోను మిగి లిన మార్కులతో ఆ విద్యార్థు లు కౌన్సెలింగ్‌కు వెళ్లొచ్చు లేదంటే మరో సారి పరీక్ష రాసు కోవ చ్చు అని ఎన్టీఏ తెలిపింది. 4,750 కేంద్రాల్లో 24 లక్షల మంది అభ్యర్థులుమే ఐదున 4,750 కేంద్రాల్లో దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు నీట్‌యూజీ–2024 రాశారు. హరియాణాలోని ఫరీదాబాద్ కేంద్రంలో రాసిన వారిలో ఆరుగురికి సహా దేశవ్యాప్తంగా 67 మందికి 720కిగాను 720 మార్కులు పొంది టాప్‌ర్యాంక్ సాధించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువ మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడమే ఈ అనూహ్య టాప్‌ర్యాంకుల పర్వానికి అసలు కారణమని వెల్లడైంది. వ్యవహారం కోర్టుకు చేరడంతో వారందరికీ గ్రేస్ మార్కులు తొలగిస్తున్నామని ఎన్టీఏ ప్రకటించినప్పటికీ అసలు ఈ విధానాన్ని ఎందుకు అనుసరిస్తున్నారని, గోప్యత ఎందుకు పాటించారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.సమయం వృథా అయితే ఆ మేరకు అదనపు సమయం పరీక్ష రాయించాలిగానీ విద్యార్థికి ఏ ప్రామాణిక ప్రాతిపదికన గ్రేస్ మార్కులు ఇస్తారని విద్యావేత్తలు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. నీట్‌యూజీ కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. -
వైద్య విద్యలో ‘వెనుకబాటు’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో అణగారిన వర్గాల సంఖ్య తక్కువగా ఉంటోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, ఇతర మైనారిటీలు తక్కువగా ఉంటున్నారు. ఎంబీబీఎస్‌లో కొంతమేరకు ఫర్వాలేదు కానీ, ఆపై స్థాయి మెడికల్ కోర్సుల్లో ఆయా వర్గాల శాతం తక్కువగా ఉండటంపై సామాజిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇందులో ఓసీలు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా విభాగం చేపట్టిన సర్వేలో వెల్లడైంది. 2021–22లో వైద్య కోర్సుల్లో పాసైన వారిని ఆధారం గా చేసుకొని ఈ సర్వే నిర్వహించారు. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో 75 శాతం కాలేజీలను సర్వే చేశారు. ఎంబీబీఎస్, ఎండీ కోర్సుల్లో మహిళలు ఎక్కువగా ఉంటున్నా, ఎంఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు వచ్చేసరికి వారి శాతం చాలా తక్కువగా ఉంటోంది. ఆ కోర్సులు సాధించడం, వాటిని పూర్తి చేయడానికి వయసు మీద పడటం ఒక కారణంగా చెబుతుండగా, పెళ్లి, పిల్లలు తదితర కారణాల వల్ల కూడా వాటిని చదవడానికి ముందుకు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్‌లో ఓబీసీలు 24.4% సర్వేలో భాగంగా ఎంబీబీఎస్ పాసైన 54,547 మందిని ఎంపిక చేశారు. వారిలో పురుషులు 26,474 మంది (49 శాతం), మహిళలు 28,073 (51 శాతం) మంది ఉన్నారు. ఎంబీబీఎస్‌లో ఎస్సీలు 4,539 మంది (పురుషులు 2,310 మంది, మహిళలు 2,229 మంది) ఉండగా, వీరి శాతం 8.3గా ఉంది. ఇక ఎస్టీలు 2,100 మంది (పురుషులు 1008, మహిళలు 1092 మంది) ఉన్నారు. వీరి శాతం 3.8 శాతంగా ఉంది. ఓబీసీల్లో మొత్తం 13,350 మంది (పురుషులు 6,682, మహిళలు 6,668 మంది) ఉండగా, వీరు 24.4 శాతంగా ఉన్నారు. దివ్యాంగులు 112 (0.2 శాతం) మంది ఉన్నారు. ముస్లింలు 2,005 మంది ఉన్నారు. వారిలో పురుషులు 929 మంది, మహిళలు 1079 మంది ఉన్నారు. వీరి శాతం 3.6 శాతంగా ఉంది. ఇతర మైనారిటీలు 1,178 (2.1శాతం) ఉన్నారు. ఈడబ్ల్యూఎస్‌లో 210 (0.4 శాతం) మంది ఉన్నారు. ఇక ఓసీలు 57 శాతం మంది ఉన్నారు. ఎండీల్లో ఎస్సీ, ఎస్టీలు 11.3% ఎండీ కోర్సుల్లో జనరల్ మెడిసిన్, అనెస్థీíÙయా, చెస్ట్, రేడియాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్ వంటివి వస్తాయి. ఎండీ కోర్సుల్లో 15,732 మందిని సర్వే చేశారు. అందులో పురుషులు 7,343 (46 శాతం), మహిళలు 8,389 (54 శాతం) మంది ఉన్నారు. ఇక ఎస్సీలు 1220 (7.7 శాతం) మంది, ఎస్టీలు 561 (3.6 శాతం) మంది, ఓబీసీలు 3,404 (22 శాతం) మంది, దివ్యాంగులు 12 (0.08%) మంది, ముస్లింలు 543 (3.5%) మంది, ఇతర మైనారిటీలు 357 (2.2%) మంది, ఈడబ్ల్యూఎస్ 187 (1.2%) మంది ఉన్నారు. ఓసీలు 59 శాతంగా ఉన్నారు. ఎంఎస్ కోర్సుల్లో ముస్లింలు 3.3% ఎంఎస్ కోర్సుల్లో జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, చెవి, ముక్కు, కంటి తదితర సర్జరీ కోర్సులు వస్తాయి. ఎంఎస్‌లో 4,713 మందిని సర్వే చేశారు. అందులో పురుషులు 2,521 (53%) మంది, మహిళలు 2,192 (47%) మంది ఉన్నారు. ఇక ఎస్సీలు 337 (7.1%) మంది, ఎస్టీలు 128 (2.7%), ఓబీసీలో 1021 (21.6%) మంది, ముస్లింలు 155 (3.3%) మంది, ఇతర మైనారిటీలు 102 (2.1%) మంది, ఈడబ్ల్యూఎఎస్లో 8 (0.2%) మంది ఉండగా, ఓసీలు 63 శాతంగా ఉన్నారు. డీఎం కోర్సుల్లో ఓసీలు 89 శాతం మెడికల్ సూపర్ స్పెషాలిటీ (డీఎం కోర్సులు)ల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ తదితర కోర్సులు వస్తాయి. వీటిల్లో 469 మందిని సర్వే చేశారు. అందులో పురుషులు 362 (77%), మహిళలు 107 (23%) మంది ఉన్నారు. ఎస్సీలు ఏడుగురు (1.49%), ఎస్టీలు ముగ్గురు (0.6%), ఓబీసీలు 29 (6%), ముస్లింలు 0.6%, ఇతర మైనారిటీలు 9 (1.91%) మంది ఉండగా, ఓసీలు 89 శాతం మంది ఉన్నారు. ఎంసీహెచ్ కోర్సుల్లో మహిళలు 15 శాతమే ఎంసీహెచ్ (సర్జికల్ సూపర్ స్పెషాలిటీలు) జీర్ణకోశ, యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూరో సర్జరీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, వ్యాసు్కలర్ సర్జరీ తదితర కోర్సులు ఉంటాయి. వీటిల్లో 337 మందిని సర్వే చేశారు. పురుషులు 287 (85%), కేవలం మహిళలు 50(15) మంది మాత్రమే ఉన్నారు. ఎస్సీలు ఏడుగురు (2%), ఎస్టీలు ముగ్గురు (1%), ఓబీసీలు 15 (4.4%), ముస్లింలు ఒకరు, ఇతర మైనారిటీలు ముగ్గురు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్‌లో ఒకరు ఉండగా, ఓసీలు 90 శాతంగా ఉన్నారు. సూపర్ స్పెషాలిటీల్లో తగ్గుతున్న మహిళలు: డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వీనర్, ఐఎంఏ, తెలంగాణ ఎంబీబీఎస్, ఎండీ కోర్సుల్లో మహిళలు ఎక్కువగా చేరుతుంటే, ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో పురుషుల శాతమే ఎక్కువగా ఉంటోందని నివేదిక చెబుతోంది. ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్ వంటి సూపర్ స్పెషాలిటీ కోర్సులకు వెళ్లేసరికి మహిళల శాతం చాలా తక్కువగా ఉంటోంది. దీనికిగల కారణాలను అన్వేషించాల్సిన అవసరముంది. ఆ మేరకు మహిళలకు వెసులుబాటు కల్పించాలి. దీనిపై జాతీయ మెడికల్ కమిషన్ దృష్టిసారించాలి. -
గ్రామీణ బాలికలు.. డాక్టరమ్మలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల బాలికలు ఎక్కువగా వైద్య రంగం వైపే చూస్తున్నారు. 14.2 శాతం మంది డాక్టర్ కావాలనుకుంటే, మరో 25.2 శాతం మంది నర్స్ అవుదామని ఉందని చెప్పారు. అదే మగపిల్లల్లో డాక్టర్ కావాలనుకుంటున్నవారు 4.7 శాతం మందేకావడం గమనార్హం. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా చూసినా.. బాలికలు డాక్టర్, నర్స్ లేదా టీచర్ కావాలని కోరుకుంటే, బాలురు పోలీసు, ఇంజనీరింగ్, ఆర్మీ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 26 రాష్ట్రాల్లో సర్వే చేసి.. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల పరిధిలో ఉన్న 1,664 గ్రామాల్లో 34,745 మంది 14–18 ఏళ్ల మధ్య వయసున్న బాలురు, బాలికలపై ఈ సర్వే చేశారు. వారి ఉద్యోగ/ఉపాధి ఆశలు, విద్యా ప్రమాణాలు, డిజిటల్ స్కిల్స్, చదువు ను నిజజీవితంలో ఏమేరకు అమలు చేస్తున్నా రనేది పరిశీలించారు. స్కూళ్లు, కాలేజీల్లో చదు వుతున్నవారితోపాటు బయటివారినీ ప్రశ్నించా రు. మొత్తంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనేది చాలా మంది ఆలోచనగా ఉందని, ఆ ప్రకారమే ఉద్యోగం/ఉపాధిపై దృష్టిపెడుతున్నారని కేంద్ర నివేదిక పేర్కొంది. లాక్డౌన్ సమయంలో కష్టాలు ఎదుర్కొన్నందున ప్రభుత్వ ఉద్యోగంపై చాలా మంది మక్కువ చూపిస్తున్నట్టు తెలిపింది. మహిళలు చదువుకున్నా ఇంటి పని తప్పదన్న ఉద్దేశంతో.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించింది. హోటల్ మేనేజ్మెంట్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, వ్యవసాయం వంటి వాటిపై దృష్టిసారిస్తామని బాలికలు పేర్కొన్నట్టు తెలిపింది. లెక్కలు, ఇంగ్లిష్‌లో వెనుకబాటు తెలంగాణ గ్రామీణ యువతలో 14–18 ఏళ్ల వయసు వారిలో కూడికలు, తీసివేతలు వంటి లెక్కలు చేయగలిగినవారు 21.5 శాతమేనని కేంద్ర నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్‌పై కనీస అవగాహన ఉన్నవారు 41 శాతమేనని తెలిపింది. ఇక రాష్ట్రంలో పనిచేయడానికి ఆసక్తి చూపనివారిలో బాలురు 18 శాతం, బాలికలు 11.7 శాతం ఉన్నారు. పనిపై ఆసక్తి చూపనివారి విషయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఈ అంశంలో దేశ సగటు రెండు శాతమే. ఉద్యోగ భద్రతకే గ్రామీణ యువత మొగ్గు ‘‘గ్రామీణ యువత జీవితంలో త్వరగా స్థిరపడాలని, ఉద్యోగ భద్రత కావాలనే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర నివేదిక చెప్తోంది. దానికి తగ్గట్టుగానే చాలా మంది పనిని ఎంచుకుంటున్నారు. అయితే సమాజ అవసరాలు కూడా ముఖ్యమే. పరిశోధనలు, ఉన్నత విద్య, వైద్య రంగంలో స్థిరపడటంలో ఆలస్యం కారణంగా తక్కువ మంది వాటివైపు వస్తున్నారు. పనిచేయడానికి ఆసక్తి చూపనివారూ ఎక్కువగా ఉండటం వెనుక కారణాలను అన్వేషించాలి. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వీనర్, ఐఏఎం, తెలంగాణ -
మేం చెప్పే వరకూ ఆగండి
సాక్షి, అమరావతి: ఈ ఏడాది పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా రివైజ్డ్ ఫేజ్ –1 కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయవద్దని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం ప్రకటించింది. రాజమండ్రిలోని జీఎస్ఎల్ కళాశాలలో ఎండీ– రేడియో డయగ్నోసిస్ కోర్సులో 14 సీట్లకు నకిలీ అనుమతులు జారీ అయినట్లు నేసనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మంగళవారం తెలిపింది. దీంతో యాజమాన్య కోటా విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. విశ్వవిద్యాలయం మళ్లీ తెలిపే వరకూ విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయద్దని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి కోరారు. ఇప్పటికే కళాశాలల్లో రిపోర్ట్ చేసిన, చేయని విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి జారీ చేసే తదుపరి నిర్ణయం కోసం వెబ్‌సైట్‌ను చూస్తుండాలని సూచించారు. ఎన్ఎంసీకి వైద్య, ఆరోగ్య శాఖ లేఖ నంద్యాల జిల్లా శాంతీరామ్, విజయనగరం జిల్లా మహారాజా, తూర్పుగోదావరి జిల్లా జీఎస్ఎల్ వైద్య కళాశాలల్లో నకిలీ అనుమతులతో పీజీ సీట్లు పెంచినట్లు వెల్లడవడంతో గత నెలలో నిర్వహించిన తొలి దశ కౌన్సెలింగ్‌ను విశ్వవిద్యాలయం రద్దు చేసింది. ఎన్ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని తిరిగి మొదటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి సోమవారం సీట్లు కేటాయించింది. అయితే అనూహ్యంగా మంగళవారం మరో 14 సీట్లకు జీఎస్ఎల్ నకిలీ అనుమతులు ఉన్నాయంటూ ఎన్ఎంసీ పేర్కొంది. దీంతో ఈ అంశంపై స్పష్టత కోసం వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఎన్ఎంసీకి లేఖ రాశారు. ఎన్ఎంసీ నుంచి వివరణ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నకిలీ అనుమతులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎన్ఎంసీ సమాచారమిచ్చిందని తెలిపారు. ఫిర్యాదు వివరాలను కోరామని చెప్పారు. విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశామన్నారు. మరో వైపు నకిలీ అనుమతుల అంశంపై మూడు కళాశాలలకు విశ్వవిద్యాలయం వీసీ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. -
వైద్యవిద్య పీజీ ప్రవేశాల వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్ అభ్యర్థులు https:// pgcq.ysruhs.com వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆప్షన్ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వీసీ డాక్టర్ బాబ్జీ సూచించారు. పలు కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలపై ఎన్ఎంసీ పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతి పత్రాలు వెలుగులోకి రావడంతో తొలిదశ కౌన్సెలింగ్‌ను రద్దుచేసినట్లు తెలిపారు. ఎన్ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్‌ను వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. తొలిదశలో కేటాయించిన సీట్లు రద్దుచేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. జీఎస్ఎల్, మహారాజాల్లోను ఫేక్ అనుమతులుశాంతీరామ్ వైద్యకళాశాలలో ఫేక్ అనుమతుల వ్యవహారం బయటపడటంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు మిగిలిన కళాశాలల్లో సీట్లను పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని జీఎస్ఎల్, విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రైవేట్ వైద్యకళాశాలల్లోని పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్లకు మధ్య వ్యత్యాసం గుర్తించారు. దీంతో ఎన్ఎంసీకి ఈ వ్యవహారంపై లేఖ రాశారు. ఆయా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలకు తాము అనుమతులు ఇవ్వలేదని ఎన్ఎంసీ శుక్రవారం స్పష్టం చేసింది. సీట్లు పెంచుతూ వెలువడిన అనుమతులు ఫేక్/ఫోర్జరీవని తెలిపింది. మరోవైపు 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల డీఎంఈలు ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు సైతం ఇతర మాధ్యమాల్లో పొందుపరిచే సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. -
ప్రశాంతంగా నీట్ పరీక్ష
సాక్షి, అమరావతి: వైద్య విద్య కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్–2022) ప్రశాంతంగా ముగిసింది. ఏపీలో.. 29 కేంద్రాల్లో మ.2 గంటల నుంచి సా.5.20 వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 60వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, దేశవ్యాప్తంగా 95 శాతం మంది హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. ఈసారి ప్రశ్నపత్రం గత రెండేళ్లతో పోలిస్తే కాస్త కఠినంగా ఉందని నిపుణులతోపాటు చాలామంది విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా బోటనీ, జువాలజీల్లో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టడంతో చాలావరకు సమయం అక్కడే వృథా అయిందన్న భావన విద్యార్థుల్లో నెలకొంది. ఆ 20నిమిషాలపై భిన్నాభిప్రాయాలు మరోవైపు.. 20 నిమిషాల అదనపు సమయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు తమకు అదనపు సమయం కలిసొచ్చిందని చెబితే.. మరికొందరు దానివల్ల ఎటువంటి లాభం చేకూరలేదన్నారు. కెమిస్ట్రీలో 4–5 ప్రశ్నలు తార్కికంగా ఆలోచించి సమాధానాలు రాసేవిగా ఉన్నాయని, ఫిజిక్స్‌లో ప్రశ్నలు కొంత సులువుగా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. ఈసారి కటాఫ్ తగ్గొచ్చు.. గతేడాది ఎక్కువ మంది విద్యార్థులు 700కు పైగా మార్కులు సాధించగా ఈసారి ఆ సంఖ్య తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారి అంచనా ప్రకారం ఈ సంవత్సరం ప్రశ్నపత్రంలో కొత్తగా మ్యాచింగ్ ప్రశ్నలు, స్టేట్మెంట్ ప్రశ్నలు, అసెర్షన్ అండ్ రీజన్ ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారు. ఇలాంటి ప్రశ్నలు 10–12 వరకు ఉన్నాయి. ఇలా ఇస్తారన్న సమాచారం కూడా విద్యార్థులకు లేకపోవడంతో వారు ఇబ్బందిపడ్డారు. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు సరైన సమాధానమేలేదు. బోటనీలో ఒక ప్రశ్నకు మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చే విధంగా ఉంది. ప్రశ్నలన్నీ కూడా ఎన్సీఈఆర్టీ సిలబస్ పరిధి నుంచే వచ్చాయి. అయితే, ఈసారి నీట్ ప్రశ్నపత్రం మధ్యస్థం నుంచి కఠినంగా ఉండటంతో గతం కంటే 10 మార్కుల వరకు కటాఫ్ మార్కులు తగ్గే అవకాశముంది. జనరల్ కటాఫ్ 130 మధ్య, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్ 100 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
వైద్యకోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2021–22 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా సీట్లలో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించింది. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. https://ug.ntruhsadmissions.com వెబ్సైట్లో ప్రాధాన్యత క్రమంలో అన్ని కళాశాలలకు విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేయాలి. అన్ని విడతల కౌన్సెలింగ్‌లలో సీట్ల కేటాయింపునకు ఈ ఆప్షన్లనే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆప్షన్ల నమోదు విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆప్షన్లు నమోదు చేసి సబ్మిట్ చేసే సమయంలో రిజిస్టర్ మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలకు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్‌చేసి సబ్మిట్ చేయాలి. ఏ కళాశాలలో సీటు లభించిందన్న సమాచారం విద్యార్థుల మొబైల్ ఫోన్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది. ఆప్షన్ల నమోదులో సాంకేతిక సమస్యలు ఎదురైతే 7416563063, 7416253073, 8333883934, 9063500829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. సలహాలు, సందేహాలకు 08978780501, 07997710168 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. -
అందుకే భారతీయులు ఉక్రెయిన్ బాట!
'సాక్షి హైదరాబాద్: ఎప్పుడు ఎటు వైపు నుంచి ఏ క్షిపణి దూసుకువస్తుందో తెలీదు. ఏ క్షణాన ఏ బాంబు నెత్తి మీద పడుతుందో ఊహించలేం. ఉక్రెయిన్‌లో మన విద్యార్థులు క్షణక్షణం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని గడుపుతున్నారు. కేంద్రం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక విమానాల్లో వెనక్కి తీసుకొస్తున్నా మరో 14 వేల మంది విద్యార్థులు అక్కడే చిక్కుబడ్డారు. సాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. కర్ణాటకకు చెందిన విద్యార్థి బాంబు దాడికి బలవడంతో భయపడిపోతున్నారు. వైద్య విద్య కోసం వేలాదిగా ఉక్రెయిన్ ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నిస్తే, తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత అన్న సమాధానమే వస్తోంది... వెద్య విద్యలో నాణ్యత ఉక్రెయిన్ వైద్య విద్యకు ప్రసిద్ధి చెందింది. ఆ దేశ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న యూనివర్సిటీలకు నాణ్యమైన విద్య అందిస్తాయని పేరుంది. వైద్యవిద్యలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అత్యధిక విద్యార్థులు చదివే దేశాల జాబితాలో యూరప్‌లో ఉక్రెయిన్ నాలుగో స్థానంలో ఉంది. అందుకే తల్లిదండ్రులు ఎక్కువగా ఉక్రెయిన్ వైపు మొగ్గుచూపిస్తున్నారు. ప్రపంచ స్థాయి గుర్తింపు ఉక్రెయిన్ మెడికల్ కాలేజీల డిగ్రీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. యునెస్కో, డబ్ల్యూహెచ్ఓ వంటి అంతర్జాతీయ సంస్థల గుర్తింపు ఉక్రెయిన్ కళాశాలలకు ఉంది. వరల్డ్ హెల్త్ కౌన్సిల్ సహా వివిధ దేశాలు ఈ డిగ్రీని గుర్తించాయి. దీంతో యూరప్ దేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని కలలు కనేవారికి ఉక్రెయిన్‌లో చదవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ప్రవేశ పరీక్ష అవసరం లేదు మన దేశంలో మెడిసిన్ సీటుకు తీవ్రమైన పోటీ ఉంటుంది. లక్షలాది మందితో పోటీ పడి జాతీయ స్థాయిలో నీట్ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 84 వేల వరకు ఎంబీబీఎస్ సీట్లున్నాయి. గతేడాది 16.1 లక్షల మంది నీట్ పరీక్ష రాశారు. అంత పోటీని తట్టుకొని సీటు సాధించడం సులువు కాదు. కానీ ఉక్రెయిన్‌లో సీటు కోసం ఎలాంటి ప్రవేశ పరీక్షా రాయాల్సిన పని లేదు. బోధన ఇంగ్లిష్‌లో ఉంటుంది. కాబట్టి కొన్ని దేశాల్లో మాదిరిగా ప్రత్యేకంగా విదేశీ భాష నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా వైద్య విద్య పూర్తవుతుంది భారత్‌లో ప్రాక్టీసుకు లైసెన్స్ విదేశీ ఎంబీబీఎస్ డిగ్రీతో మన దేశంలో ప్రాక్టీస్ చేయాలంటే నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ) పాసవ్వాల్సి ఉంటుంది. ఏటా సగటున ఉక్రెయిన్ నుంచి 4 వేల మంది మెడికల్ డిగ్రీలతో వచ్చి ఈ పరీక్షలు రాస్తారు. వీరిలో 700 మంది దాకానే ఉత్తీర్ణులవుతారు. అయినప్పటికీ ఉక్రెయిన్ యూనివర్సిటీలకు భారత్ విద్యార్థుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముందు అత్యుత్తమ విద్యా ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలన్నీ ఉక్రెయిన్‌లో ఉండేవి. విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించడానికి, తమ ఆదాయం పెంచుకోవడానికి ఇటీవల ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. యూనివర్సిటీ డీన్లు భారత్ సహా వివిధ దేశాల్లో పర్యటించి విద్యార్థుల్ని ఆకర్షించేలా ప్రచారం చేశారు. ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని దేశానికి రప్పించారు. విదేశీ విద్యార్థుల ద్వారా ఉక్రెయిన్‌కు ఏడాదికి 54.2 కోట్ల డాలర్ల ఆదాయం వస్తోంది.’’ – యుక్తి బెల్వాల్, బుక్‌మైయూనివర్సిటీ, భారతీయ విద్యా కన్సల్టింగ్ సంస్థ ఫీజులు తక్కువ ఉక్రెయిన్‌లో తక్కువ ఖర్చుతోనే మెడిసన్ పూర్తవుతుంది. భారత్‌లో దండిగా ఫీజులు వసూలు చేసే ప్రైవేటు కాలేజీల్లో చదివించడం కంటే ఉక్రెయిన్‌లో ప్రభుత్వ కాలేజీల్లో సీటొస్తే అక్కడకి పంపించడానికే తల్లిదండ్రులు సుముఖత చూపిస్తున్నారు. ఆరేళ్ల మెడిసిన్ కోర్సుకు ఉక్రెయిన్‌లో ఏడాదికి రూ.4–5 లక్షలు అవుతుంది. అంటే రూ.17–20 లక్షలు ఖర్చు చేస్తే డిగ్రీ చేతికొస్తుంది. ఖర్చులన్నీ కలుపుకున్నా 25 లక్షలు దాటదు. అదే మన దేశంలో ప్రైవేటు కాలేజీలో ఏడాదికి కనీసం రూ.10–12 లక్షల పై మాటే. నాలుగున్నరేళ్ల కోర్సుకి రూ.50 లక్షల నుంచి 70 లక్షల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. – నేషనల్ డెస్క్, సాక్షి (చదవండి: ఎయిరిండియా సీఈవో పోస్టుకు ఇల్కర్ తిరస్కరణ ) -
ఆ వీడియోలు చూస్తూ విలవిల..
సాక్షి, నెట్వర్క్: ఉన్నత విద్య కోసం ఏపీ నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్‌కు వెళ్లారు. కానీ, ప్రస్తుతం ఆ దేశంపై రష్యా దాడుల ఘటనలతో ఇక్కడ దాదాపు అన్ని జిల్లాల్లోని వారి తల్లిదండ్రులు తమ పిల్లల బాగోగుల గురించి కలత చెందుతున్నారు. విద్యార్థులు కూడా అక్కడి పరిస్థితుల వీడియోలను తమ కుటుంబ సభ్యులకు పంపుతుండడంతో అవి చూసి వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఉదా.. ఉక్రెయిన్‌లో తామెంత భయోందోళనతో ఉన్నామో వివరిస్తూ తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన 18 మంది విద్యార్థులు పంపిస్తున్న వీడియో క్లిప్పింగ్స్ చూసి వారి తల్లిదండ్రులు ఇక్కడ భయకంపితులవుతున్నారు. ఉక్రెయిన్‌లోని జాపొరొజెయి స్టేట్ వర్సిటీలో వీరంతా వైద్య కోర్సులు చదువుతున్నారు. అక్కడ నుంచి ఎలాగోలా వచ్చేద్దామంటే విమాన టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయని వీరు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అమలాపురం ఆర్డీఓని కలిసి తమ పిల్లల్ని క్షేమంగా వచ్చేలా చేయాలని తల్లిదండ్రులు ప్రాథేయపడ్డారు. వీరిలాగే పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన టి.జయకుమార్ కుమార్తె అభిజ్ఞ కూడా ఉక్రెయిన్‌లోని పరిస్థితులను తన తల్లిదండ్రులకు, ‘సాక్షి’కి వివరించింది. బాంబు దాడుల కారణంగా విమానాలను రద్దుచేశారని, బంకర్లలోకి వెళ్లి దాక్కోమని అధికారులు చెబుతుండడంతో భయంగా ఉందంటూ వాట్సాప్‌లో అక్కడి దృశ్యాలను చూపుతూ ఆవేదన వ్యక్తంచేసింది. ఇప్పటివరకు ఎంబసీ సిబ్బంది గాని, ఉక్రెయిన్ అధికారులుగాని అందుబాటులో లేరని చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అలాగే, ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. యుద్ధం తీవ్రతరం అవుతుండడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. ఎంబీబీఎస్ చదువు కోసం అద్దంకి పట్టణం, పరిసర ప్రాంతాలకు చెందిన బెల్లంకొండ పోతురాజు, నల్లమోతు పవన్, తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన అల్లంనేని విజయరాఘవ ఉక్రెయిన్ వెళ్లారు. తామంతా ఇక్కడ క్షేమంగానే ఉన్నామని ఆందోళన చెందవద్దని వారు తల్లిదండ్రులతో చెబుతున్నారు. విమానాల రాకపోకలు లేకపోవడంతో తాము స్వదేశానికి రాలేకపోతున్నామని విజయరాఘవ ‘సాక్షి’కి తెలిపారు. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు పురుషోత్తం సాయి హరీష్, బత్తల వెంకటసాయి, వసీం అక్రమ్, శ్రీయపురెడ్డి పల్లవి, మహమ్మద్ సుహేల్, శ్రీకరన్, యుగంధర్, గణేష్ కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. వారందరూ ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లారు. గురువారం వారి వివరాలను సేకరించిన జిల్లా అధికారులు ఆ విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి వారి యోగక్షేమాలపై ఆరా తీశారు. ప్రస్తుతానికి ఆ విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులు అధికారులకు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని కలెక్టర్ హరినారాయణన్ వారికి భరోసా ఇచ్చారు. మరోవైపు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 10 మంది వైద్య విద్యను అభ్యసిస్తున్నట్లు జిల్లా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పి. వెంకటలక్ష్మి నరసింహ సాయితేజ, సూర్తినేని విషాల్, షేక్ మహ్మద్ అబుబకర్ సిద్ధిక్, షేక్ మహ్మద్ షర్రా తాబస్సుమ్, శ్రీహరికోట వరలక్ష్మి, శ్రీచైతన్య తేజ, వల్లూరు సాయిసుధాకర్రెడ్డి, ధన్యాసి శ్యామంత్, గంగినేని జస్వంత్, భానుమతి తదితరులు అక్కడుంటూ మెడిసిన్ చేస్తున్నారని తెలిసింది. వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే, వీరి గురించి తమకెలాంటి సమాచారం లేదని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇక తమ కుమారుడు నెల్సన్ కేరిని తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా గుడివాడ పట్టణానికి చెందిన కాటి కమల్ సుధాకర్ కూడా వేడుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితుల దృష్ట్యా స్వస్థలానికి తిరిగి రావాలనున్నా విమానాశ్రయం మూసివేయడంతో తమ కుమారుడు అక్కడే ఉండిపోయాడన్నారు. -
వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసిన కేంద్రం
-
వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసిన కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: వైద్య విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం 2021-22కి గాను వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లను కేంద్రం ఖరారు చేసింది. మెడికల్ అండ్ డెంటల్ ఎడ్యుకేషన్ (యూజీ, పీజీ) లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఆల్ ఇండియా కోటా కింద ఓబీసీ విద్యార్ధులకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ విద్యార్ధులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 5,550 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని, ఓబీసీలకు, ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు రిజర్వేషన్లను కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది నుంచి ఆర్థికంగా వెనకబడిన వారికి విద్యా రిజర్వేషన్లను కల్పిస్తున్నట్టు పేర్కొంది. దీంతో ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్‌లో దాదాపు 1500 మంది ఓబిసి విద్యార్థులకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 2500 మంది ఓబిసి విద్యార్థులకు, ఎంబీబీఎస్‌లో 550 మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 1000 మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించింది. తమ ప్రభుత్వం మైలురాయిలాంటి నిర్ణయం తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. తద్వారా ప్రతి సంవత్సరం వేలాదిమంది యువత అవకాశాలు పొంద నున్నారని పేర్కొన్నారు, మన దేశంలో సామాజిక న్యాయకల్పనలో ఇదొక కొత్త అధ్యాయంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం కల్పించాలని ప్రధాని మోదీ జూలై 26న సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలను ఆదేశించిన సంగతి తెలిసిందే. Our Government has taken a landmark decision for providing 27% reservation for OBCs and 10% reservation for Economically Weaker Section in the All India Quota Scheme for undergraduate and postgraduate medical/dental courses from the current academic year. https://t.co/gv2EygCZ7N — Narendra Modi (@narendramodi) July 29, 2021 -
పరీక్షలు రాయకుండానే ప్రమోట్ అవుతారా?
న్యూఢిల్లీ: మెడిసిన్ పోస్టు గ్రాడ్యుయేట్ చివరి సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని, లేదా వాయిదా వేయాలని మెడికల్ యూనివర్సిటీలను ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పరీక్షలకు హాజరు కావాల్సిన వైద్య విద్యార్థులు కోవిడ్–19 విధుల్లో నిమగ్నమై ఉన్నందున పరీక్షలను రద్దు చేయడమో లేదా వాయిదా వేయడమో చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎం.ఆర్.షాల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ విషయంలో మెడికల్ యూనివర్సిటీలకు ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. పరీక్షలు రాయకుండానే వైద్యులు ప్రమోట్ అయ్యేందుకు అనుమతించబోమని తేల్చిచెప్పింది. పీజీ ఆఖరి ఏడాది పరీక్షల తేదీలను ప్రకటించేటప్పుడు కరోనా పరిస్థితిని సైతం పరిగణనలోకి తీసుకోవాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఏప్రిల్‌లోనే అన్ని వర్సిటీలకు ఆదేశాలిచ్చిందని తెలిపింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులకు తగినంత సమయం ఇచ్చేలా ఎన్ఎంసీని ఆదేశించాలంటూ న్యాయవాది సంజయ్ హెగ్డే వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. చదవండి: కర్ణాటకలో లాక్డౌన్ సడలింపు.. ఎప్పటివరకంటే! -
జాగ్రత్తల నడుమ జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర విద్యాసంస్థలతో పాటు ఎంబీబీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీఏ) ప్రకటించింది. కోవిడ్–19 నేపథ్యంలో విద్యార్థులెవరికీ ఇబ్బందులు తలెత్తకుండా అనేక చర్యలు చేపడుతున్నామని పేర్కొంది. ఈ పరీక్షల నిర్వహణ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ సహకారం అందించాలని కోరింది. ఈ మేరకు ఎన్టీఏ తాజాగా ప్రకటన జారీ చేసింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు, నీట్ (అండర్ గ్రాడ్యుయేట్) పరీక్ష సెప్టెంబర్ 13న నిర్వహించేందుకు ఎన్టీఏ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అవసరమైన కసరత్తును ఎన్టీఏ చేపట్టింది. భౌతిక దూరం పాటించేలా.. ► జేఈఈ (మెయిన్), నీట్ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే 99 కంటే ఎక్కువ శాతం మంది అభ్యర్థులకు తొలి ప్రిఫరెన్స్ కింద వారు కోరుకున్న పరీక్ష కేంద్రాన్ని ఎన్టీఏ కేటాయించింది. ► పరీక్ష కేంద్రాల సంఖ్యను జేఈఈ మెయిన్స్‌కు 570 నుంచి 660కు, నీట్ కేంద్రాలను 2,546 నుంచి 3,843కు పెంచారు. ► జేఈఈలో షిఫ్ట్‌ల సంఖ్య గతంలో 8 కాగా.. 12కు పెంచారు. అభ్యర్థుల సంఖ్య షిఫ్ట్‌కు అంతకుముందు 1.32 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు 85 వేలకు తగ్గించారు. ► జేఈఈ మెయిన్‌కు 8.58 లక్షల మంది, నీట్‌కు 15.97 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ► భౌతిక దూరం పాటించేందుకు వీలుగా పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచారు. ► జేఈఈ పరీక్ష కేంద్రాల లోపల నిర్ణీత భౌతిక దూరం ఉండేలా అభ్యర్థులకు దూరదూరంగా సీట్లు ఉంటాయి. ► నీట్ పరీక్ష కేంద్రాల్లో ఒక్కో గదిలో గతంలో 24 మంది అభ్యర్థులను అనుమతించగా.. ఇప్పుడు 12కు తగ్గించారు. ► పరీక్ష హాళ్లలో భౌతిక దూరాన్ని పాటించేందుకు అభ్యర్థుల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు చేపడుతున్నారు. ► పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు నిర్దేశిత నిబంధనలు అనుసరించడంలో అభ్యర్థులు, తల్లిదండ్రులు సహకరించాలని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. -
వైద్య ఫీజుల ఖరారుకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సహా మెడికల్ పీజీ, ఇతర సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజు పెంపునకు సన్నాహాలు మొదలయ్యాయి. మూడేళ్లకోసారి ఫీజుల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజుల ఖరారుకు తెలంగాణ రాష్ట్ర అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఎస్ఏఎఫ్ఆర్సీ) నోటిఫికేషన్ జారీచేసింది. అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 2020–23 కాలానికి ఫీజు ఖరారుకు సంబంధించి గత మూడేళ్ల తమ ఆడిట్ ఆర్థిక నివేదికలను సమర్పించాలని కోరింది. ఆడిట్ ఆర్థిక నివేదికలతోపాటు ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ ఈ నెల 31 అని తెలిపింది. ఫీజు ప్రతిపాదనలను సమర్పించని లేదా స్పందించని కాలేజీలు 2020–23 కాలానికి సవరించిన ప్రకారం ఫీజు వసూలు చేయడానికి అనుమతి ఉండదని టీఎస్ఏఎఫ్ఆర్సీ పేర్కొంది. ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజులను 2016లో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించింది. గతేడాది ప్రైవేటు వైద్య కళాశాలలు ద్రవ్యోల్బణం, ఉపాధ్యాయుల జీతాల పెరుగుదలను పేర్కొంటూ ఐదు శాతం ఫీజుల పెంపును కోరాయి. కానీ ప్రభుత్వం పెంచలేదు. 2017లో ప్రైవేటు మెడికల్ పీజీ ఫీజులను ఖరారు చేశారు. వాటిని కూడా ఇప్పుడు కొత్తగా ఖరారు చేయనున్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో 21 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, 11 ప్రైవేట్ డెంటల్ కాలేజీలు ఉన్నాయి. ఐదు శాతం పెంచితే...? ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని వైద్య సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా సీట్లు ఉంటాయి. ఇక 35 శాతం బీ కేటగిరీ సీట్లు ఉంటాయి. మరో 15 శాతం సీట్లను సీ కేటగిరీ కింద భర్తీ చేసుకునే వీలుంది. ఇప్పుడు బీ, సీ కేటగిరీ సీట్లకు ఫీజు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలుంది. ఐదు శాతం పెంచితే అదనంగా రూ. 57,750 కానుంది. అంటే మొత్తం ఎంబీబీఎస్ బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 12,12,750 కానుంది. ఇక సీ కేటగిరీ ఫీజు ప్రస్తుతం ఏడాదికి రూ. 23.10 లక్షలుంది. ఐదు శాతంపెంచితే అదనంగా రూ. 1,15,500 కానుంది. అంటే మొత్తం ఎంబీబీఎస్ సీ కేటగిరీ ఫీజు రూ. 24,25,500 కానుంది. అలాగే డెంటల్ కోర్సులకూ ఐదు శాతం పెరగనుంది. ఐదేళ్లకు కలిపి చూస్తే పెంచిన ఫీజుల భారం విద్యార్థులపై అధికం కానుంది. -
నీట్ రగడ
♦ సర్కారుపై ప్రతిపక్షాల ఫైర్ ♦ మంత్రులతో వాగ్వాదం ♦ వాకౌట్ ♦ కరుణకు వెసులుబాటు ♦ 8 ముసాయిదాలు ♦ ఇక, మరింతగా ముందుకు జాలర్లు రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం ‘నీట్’ వ్యవహారంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఢీకొట్టాయి. నీట్ రూపంలో రాష్ట్రంలోని విద్యార్థులకు వైద్య కోర్సులు అందని ద్రాక్షగా మారినట్టు మండిపడ్డాయి. మంత్రులతో వాగ్వాదం హోరెత్తడం, స్పీకర్ సైతం పాలకులకు మద్దతుగా స్పందించడంతో సభనుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఇక, సభకు హాజరయ్యే విషయంలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధికి వెసులుబాటు కల్పించారు. సభలో ఎనిమిది ముసాయిదాలను ప్రవేశ పెట్టారు. సాక్షి, చెన్నై : రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మంగళవారం మళ్లీ అసెంబ్లీ సమావేశం అయింది. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ‘నీట్’ రూపంలో విద్యార్థులు పడుతున్న పాట్లను ఏకరువు పెట్టారు. వైద్య కోర్సులు అందని ద్రాక్షగా మారాయని, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు. అవకాశాలు కలిసివచ్చినా, నీట్ మినహాయింపు సాధనలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉండాలని పేర్కొన్నారు. ఇకనైనా స్పందించాలని డిమాండ్‌చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్ని పరిగణనలోకి తీసుకుని నీట్ మినహాయింపునకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని పట్టుబట్టారు. దీంతో ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ స్పందిస్తూ, బుధవారం ఢిల్లీ వెళ్తున్నట్టు, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మొక్కుబడిగా సమాధానం ఇవ్వడం ప్రతిపక్షాల్లో ఆగ్రహం పెల్లుబికింది. బాధ్యత గల మంత్రి ఇకమీద చర్యలకు సిద్ధం కాబోతున్నట్టుగా స్పందించడం శోచనీయమని విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో మంత్రులతో డీఎంకే సభ్యుల వాగ్వావాదం సభలో హోరెత్తింది. వీరిని బుజ్జగించే క్రమంలో స్పీకర్ ధనపాల్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ, నీట్ చర్చ ఇక ముగిసినట్టు వ్యాఖ్యానించడాన్ని డీఎంకేతో పాటుగా, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌లు తీవ్రంగా పరిగణించారు. సభ నుంచి ఒకరి తర్వాత మరొకరు వాకౌట్ చేశారు. కాగా, వాగ్వాద సమయంలో డీఎంకే ఎమ్మెల్యే పొన్ముడిని పలుమార్లు స్పీకర్ తీవ్రంగా మందలించడం గమనార్హం. మరింతగా ముందుకు జాలర్లు సాగరంలో చేపల వేట నిమిత్తం మరింత ముందుకు సాగేందుకు జాలర్లకు మార్గం సుగమం అయింది. ఇందుకు తగ్గ ముసాయిదా అసెంబ్లీలో దాఖలైంది. మత్స్యశాఖ మంత్రి జయకుమార్ దాఖలు చేసిన ముసాయిదాలతో సముద్రంలో చేపల వేటకు సరిహద్దును పొడిగిస్తూ తీర్మానం చేశారు. ఆ మేరకు ఇక, ఐదు నాటికల్ మైళ్ల దూరం వరకు సముద్రంలో చేపల వేటకు అవకాశం కల్పించారు. అలాగే, జాలర్ల హక్కులు, సంక్షేమం లక్ష్యంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, క్రీడ, వ్యవసాయం, పశు వైద్య వర్సిటీల్లో వీసీల నియామకంపై ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించే రీతిలో ఆయా శాఖల మంత్రులు ముసాయిదాలను అసెంబ్లీలో దాఖలు చేశారు. విద్యుత్, ఒప్పందాలు, ఉద్యోగుల చట్ట నిబంధనల విషయంలోనూ ముసాయిదాలు సభకు చేరాయి. కరుణకు వెసులు బాటు ప్రతి సభ్యుడు సమావేశ సమయాల్లో ఏదో ఒక్కసారైనా సభ లాబీలో ఉన్న పుస్తకంలో సంతకం చేయాల్సిన అవసరం ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశాలకు డీఎంకే అధినేత కరుణానిధి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇందుకు కారణం అనారోగ్యం,వయోభారంతో ఆయన గోపాల పురం ఇంటికి పరిమితం కావడమే. దీంతో ఆయనకు సభకు హాజరయ్యే విషయంలో వెసులుబాటు , మినహాయింపు కల్పించాలని డీఎంకే తరఫున ప్రత్యేక తీర్మానం సభ దృష్టికి తెచ్చారు. దీనిని స్పీకర్ ధనపాల్ అంగీకరించారు. కరుణానిధి సభకు హాజరు కావాల్సిన అవసరం లేదని, సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాక హాజరు కావచ్చంటూ స్పీకర్ ప్రవేశపెట్టిన తీర్మానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం విశేషం. సాయం పెంపు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే అగ్నిమాపక సిబ్బంది కుటుంబానికి సాయం పెంచుతూ అసెంబ్లీలో సీఎం పళని స్వామి ప్రకటించారు. కొడుంగైయూర్ ప్రమాదాన్ని పరిగణించి, ఎవరైనా సిబ్బంది మరణిస్తే, ఇక రూ.పది లక్షలు సాయంగా పేర్కొన్నారు. అలాగే, ఏదేని అవయవాలను కోల్పోయిన సిబ్బందికి రూ.నాలుగు లక్షలు, మంటల్లో గాయపడ్డ వారికి రూ.రెండు లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వ సాయం దక్కుతుందని ప్రకటించారు. ముందుగా ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానాలు ఇచ్చారు. -
వైద్య కోర్సుల్లో ‘రక్షణ రిజర్వేషన్ల’పై తేల్చండి
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో రక్షణ శాఖకు చెందిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తారో లేదో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తేల్చిచెప్పాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఆరోగ్య శాఖను ఆదేశించింది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో రక్షణ శాఖ వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని హోంశాఖ గతంలో సిఫార్సు చేసింది. దీనిపై కుటుంబ సంక్షేమ శాఖ త్వరగా నిర్ణయం తీసుకోవాలనీ, తద్వారా రిజర్వేషన్లు ఇచ్చేలా అయితే వచ్చే ఏడాది నుంచే వాటిని అమలు చేయవచ్చని జస్టిస్ సంజీవ్ సచ్దేవ పేర్కొన్నారు. -
'నీట్'గా!
సాక్షి, చెన్నై : నీట్ గందరగోళానికి తెర పడడంతో రాష్ర్టంలో వైద్య విద్యా కోర్సుల సీట్ల భర్తీకి అధికార వర్గాలు చర్యలు చేపట్టాయి. ఆన్లైన్ దరఖాస్తుల పర్వానికి బుధవారం శ్రీకారం చుట్టగా, గురువారం నుంచి కళాశాలల ద్వారా దరఖాస్తుల పంపిణీ సాగనున్నది. జూన్ 20వ తేదీన కౌన్సెలింగ్, ఆగస్టు ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైద్య విద్యా డెరైక్టర్ విమల ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, నీట్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడికి సీఎం జయలలిత సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా విధానం మేరకు ఇంజనీరింగ్, వైద్య కోర్సుల సీట్లను ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ సీట్లను అన్నా వర్సిటీ ద్వారా, వైద్య కోర్సుల సీట్లను ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా భర్తీ చేయడం జరుగుతోంది. ఆ మేరకు ఇప్పటికే ఇంజనీరింగ్ కోర్సుల దరఖాస్తుల విక్రయానికి శ్రీకారం చుట్టారు. ప్లస్‌టూ ఫలితాలు వెలువడటంతో ఇంజనీరింగ్‌లోని ప్రధాన కోర్సుల సీట్లను దక్కించుకోవడం లక్ష్యంగా పెద్ద ఎత్తున విద్యార్థులు దరఖాస్తుల కొనుగోలు, ఆన్లైన్ ద్వారా నమోదుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇక, వైద్య కోర్సుల దరఖాస్తుల పర్వానికి నీట్ అడ్డు వచ్చినట్టు అయింది. దేశ వ్యాప్తంగా ఒకే పరీక్షా విధానం(నీట్)తో సీట్ల భర్తీ అమలుకు సుప్రీం ఆదేశాలు ఇవ్వడంతో గందరగోళం బయలు దేరింది. ఈ విధానానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఎట్టకేలకు ఈ ఏడాదికి నీట్ రద్దు అయింది. ఈ గందరగోళానికి తెర పడడంతో ఇక, దరఖాస్తుల పర్వం మీద వైద్య విద్యా డెరైక్టరేట్ దృష్టి పెట్టింది. ఇక దరఖాస్తులు : నీట్ రద్దుతో దరఖాస్తుల పంపిణీ, ర్యాండం నంబర్లు, ర్యాంకుల జాబితా, కౌన్సెలింగ్ తదితర అంశాలపై రాష్ర్ట వైద్య విద్యా డెరైక్టర్ విమల దృష్టి పెట్టారు. ఇందుకు తగ్గ ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. అలాగే, ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల నమోదుకు శ్రీకారం చుట్టారు. త దుపరి మీడియాతో మాట్లాడుతూ దరఖాస్తుల మొదలు నుంచి కౌన్సెలింగ్, తరగతుల ప్రారంభానికి సంబంధించిన వివరాలను, సీట్ల వివరాలను విమల ప్రకటించారు. రాష్ట్రంలో 20 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 2,650 సీట్లు ఉండగా, పదిహేను శాతం (397) సీట్లు జాతీయ స్థాయి కౌన్సెలింగ్‌కు అప్పగించారు. మిగిలిన 2253 సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నది. అలాగే, ఆరు స్వయం ప్రతిపత్తి హోదా(ప్రైవేటు) కళాశాలల్లో ఉన్న 760లో ప్రభుత్వ కోటా సీట్లుగా 470, కేకేనగర్ ఈఎస్ఐలోని వంద సీట్లలో 65 రాష్ట్ర ప్రభుత్వ కోటా సీట్ల పరిధిలోకి రానున్నాయి. ఈ సీట్లను సైతం వైద్య విద్యా డెరైక్టరేట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో చెన్నైలోని దంత వైద్య కళాశాలలో 85 ,17 స్వయం ప్రతిపత్తి హోదా కల్గిన దంత వైద్య కళాశాలల్లో 970 సీట్లు ప్రభుత్వ కోటా కింద ఉన్నాయి. వీటిని కూడా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక, విద్యార్థులు నీట్ గురించిన ఆందోళన అవసరం లేదని, కౌన్సెలింగ్ మీద దృష్టి పెట్టాలని విమల సూచించారు. జూన్ 20 కౌన్సెలింగ్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశ నిమిత్తం దరఖాస్తుల పంపిణీకి గురువారం శ్రీకారం చుట్టనున్నారు. ఆయా కళాశాలల్లో దరఖాస్తుల్ని పంపిణీ చేయనున్నారు. రూ. ఐదు వందలు డీడీ చెల్లించి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. జూన్ ఆరో తేదీ వరకు దరఖాస్తుల పంపిణీ, ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు పూర్తి చేసిన దరఖాస్తుల్ని సమర్పించేందుకు అవకాశం కల్పించారు.జూన్ పదిహేడో తేదిన ర్యాండం నంబర్ల ప్రకటన, తదుపరి ర్యాంకుల వివరాలు, జూన్ 20 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియకు చర్యలు తీసుకున్నారు. అవసరాన్ని బట్టి మలి విడతగా జూలై 18న కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. పూర్తి చేసిన దరఖాస్తులతో కులధ్రువీకరణ పత్రాలు, మార్కుల జాబితా నకలు తదితర పత్రాల్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, ఆన్లైన్ సౌకర్యంగా www.tnhealth.org వెబ్ సైట్‌ను ప్రకటించారు. కోయంబత్తూరు ఈఎస్ఐకు అనుమతి ఇచ్చిన పక్షంలో వంద సీట్లు అదనంగా వచ్చి చేరుతాయి. ఇందులో 65 సీట్లు రాష్ట్ర విద్యార్థులు కౌన్సెలింగ్ ద్వారా చేజిక్కించుకునేందుకు వీలు ఉంది. శాశ్వత రద్దుకు ఒత్తిడి : రాష్ట్రంలో వైద్య కోర్సుల సీట్ల భర్తీకి అధికార వర్గాలు చర్యలు చేపట్టడంతో, ఇక, నీట్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడికి సీఎం జయలలిత సిద్ధమయ్యారు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీకి ఆమె లేఖ రాశారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి సాగుతున్న విద్యా విధానం గురించి వివరిస్తూ, నీట్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని , తమిళనాడుకు నీట్ నుంచి శాశ్వతంగా మినహాయింపు కల్పించాలని కోరారు. -
తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ ప్రవేశాలు ఎలా?
నీట్ నిర్వహణను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశానికి సంబంధించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆర్డినెన్సు చూసిన తర్వాత ఈ అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ 'సాక్షి'కి తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కోర్సులకు కూడా ఎంసెట్ నిర్వహించారు. ఫలితాలు, ర్యాంకులను మాత్రం విడుదల చేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వ పెద్దలు, అధికారులతో చర్చించి శనివారం ఉదయం 11- 12 గంటల మధ్యలో కీలక నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ కాలేజీలలో ఉన్నట్లుగానే ప్రైవేటు వైద్య కళాశాలల్లో కూడా కన్వీనర్ కోటా ప్రవేశాలను ఎంసెట్ ద్వారా పూర్తిచేయాలని తాము కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. ఈ అంశంపై ఆర్డినెన్సులో కేంద్రం ఏం చెప్పిందో చూసి.. అప్పుడు నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ఆ వివరాలు చూసిన తర్వాత అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఇక వచ్చే సంవత్సరం నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన విద్యార్థులను సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు. సీఎం సమక్షంలో విద్యాశాఖతో చర్చించి ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ఎలా తేవాలో నిర్ణయిస్తామన్నారు. వాస్తవానికి నాలుగేళ్ల క్రితమే నీట్‌కు తాము సిద్ధమవుతామంటూ రాష్ట్ర ప్రభుత్వం అండర్‌టేకింగ్ ఇచ్చిందని, ఆ విషయం కూడా తమకు తెలియదని అన్నారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు జె.పి.నడ్డా, వెంకయ్యనాయుడుల ప్రత్యేక చొరవ వల్లే నీట్‌పై ఆర్డినెన్స్ జారీ అయ్యిందని, సీఎం చంద్రబాబు ఈ అంశంపై మూడుసార్లు కీలక సమావేశాలు నిర్వహించి కేంద్రానికి ఏపీ అభ్యర్ధనను తెలియజేశారని చెప్పారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, తమ ప్రార్థనను కేంద్ర ఆలకించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక తెలంగాణలో నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే ఎంసెట్ నిర్వహించడం, అందులో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు పరీక్ష నిర్వహించకపోవడంతో.. ఇప్పుడు మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విషయంపై కూడా ఆర్డినెన్సు చూసిన తర్వాత ప్రభుత్వ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి 'సాక్షి'కి తెలిపారు. కేంద్రం ఎంతవరకు వెసులుబాటు ఇచ్చిందో పరిశీలించిన తర్వాత తదుపరి విషయాలపై నిర్ణయిస్తామన్నారు. -
‘వెద్య’ దరఖాస్తులు రెడీ
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల ప్రవేశ నిమిత్తం దరఖాస్తులు సిద్ధం అయ్యాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సోమవారం నుంచి ఈనెల 28 వరకు ఈ దరఖాస్తులను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా విధానం మేరకు ఇంజినీరింగ్, వైద్య కోర్సుల సీట్లను ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ సీట్లను అన్నా వర్సిటీ ద్వారా, వైద్య కోర్సుల సీట్లను ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా భర్తీ చేయడం జరుగుతోన్నది. ఆ మేరకు ఇప్పటికే ఇంజినీరింగ్ కోర్సుల దరఖాస్తుల విక్రయానికి శ్రీకారం చుట్టారు. ఇక, వైద్య కోర్సుల్ని అభ్యషించాలన్న ఆశయంతో ఉన్న విద్యార్థులు దరఖాస్తులు ఎప్పుడెప్పుడు పంపిణీ చేస్తారా..? అన్న ఎదురు చూపుల్లో పడ్డారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలో దరఖాస్తులు సిద్ధం కావడంతో, ఇక పంపిణీకి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నేటి నుంచి దరఖాస్తులు: రాష్ట్రంలో 19 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇందులో 2,555 సీట్లు ఉండగా, 383 సీట్లు జాతీయ స్థాయి కౌన్సెలింగ్‌కు అప్పగించారు. మిగిలిన 2,172 సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నది. అలాగే, రాష్ట్రంలో 12 స్వయం ప్రతిపత్తి హోదా(ప్రైవేటు) కళాశాలల్లో 1,560 సీట్లు ఉన్నాయి. 993 సీట్లు మేనేజ్ మెంట్ కోటాకు చెందినవి కాగా, మిగిలిన సీట్లు ప్రభుత్వ కోటా కింద భర్తీ చేయడం జరుగుతున్నది. ఇక రాష్ట్రప్రభుత్వం పరిధిలో చెన్నైలోని దంత వైద్య కళాశాలలో 85 సీట్లు ఉన్నాయి. వీటి భర్తీ నిమిత్తం దరఖాస్తుల్ని ఆహ్వానించేందుకు ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందు కోసం యాభై వేల వరకు దరఖాస్తుల్ని సిద్ధం చేసి ఉన్నారు. సోమవారం నుంచి వీటిని విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చెన్నై స్టాన్లీ, చెంగల్పట్టు , తిరునల్వేలి, మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి, తదితర 19 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి దరఖాస్తులను, చెన్నైలో దంత కళాశాలలో బీడీఎస్ కు దరఖాస్తులను పంపిణీ చేయనున్నారు. ఒక్కో దరఖాస్తు ధర *500గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తులను ఉచితగా పంపిణీ చేయనున్నారు. ఈనెల 28 వరకు దరఖాస్తుల్ని పంపిణీ చేయనున్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను 29వ తేదీ సాయంత్రంలోపు సమర్పించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు దరఖాస్తుల పంపిణీ జరగనున్నది. సోమవారం నుంచి దరఖాస్తుల పర్వం ఆరంభం కానున్నడంతో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తుల కోసం ప్రభుత్వ కళాశాలల వద్ద బారులు తీరడం ఖాయం. -
వైద్యకోర్సుల ‘ర్యాండమ్’ విడుదల
సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని 19 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,555 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 383 సీట్లు జాతీయ స్థాయి కౌన్సెలింగ్‌కు అప్పగించారు. మిగిలిన 2,172 సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇక, 11 స్వయం ప్రతిపత్తి హోదా(ప్రైవేటు) కళాశాలల్లో 1560 సీట్లు ఉన్నాయి. ఇందులో యాజమాన్య కోటా కింద 646 సీట్లను కేటాయించారు. మిగిలిన 912 సీట్లు ప్రభుత్వ కోటా పరిధికి చేరుతాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో చెన్నైలోని దంత వైద్య కళాశాలలో 85 సీట్లు ఉన్నాయి. ఇందులో 15 జాతీయ స్థాయి కౌన్సెలింగ్‌కు అప్పగించారు. రాష్ట్రంలోని 18 దంత వైద్య కళాశాలల్లో 977 సీట్లు ప్రభుత్వ కోటా కింద ఉన్నాయి. ప్రభుత్వ కోటా పరిధిలోని ఎంబీబీఎస్, దంత వైద్య(బీడీఎస్) సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గత నెల శ్రీకారం చుట్టింది. 50 వేల దరఖాస్తుల్ని సిద్ధం చేసి విద్యార్థులకు అందించే పనిలో పడ్డారు. భలే డిమాండ్ : గత నెల 30 వరకు దరఖాస్తులు విక్రయించగా, జూన్ 2వ తేదీ వరకు పూర్తి చేసిన దరఖాస్తుల్ని స్వీకరించారు. సీట్ల భర్తీ నిమిత్తం 28 వేల 53 దరఖాస్తులు వచ్చా యి. పరిశీలనానంతరం 27,539 దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో పది వేల 105 మంది విద్యార్థులు, 14,434 మంది విద్యార్థినులు ఉన్నారు. మొదటి తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పది వేల 61 మంది ఉన్నా రు. వీరిలో 132 మంది విద్యార్థులు 200-200 మార్కులు సాధించి ఉన్నారు. ఈ దృష్ట్యా, ఈ ఏడాది ఎంబీబీఎస్ , బీడీఎస్ సీట్లకు డిమాండ్ పెరగనుంది. పది వేల మంది మొదటి తరగతిలో ఉత్తీర్ణులైన వాళ్లే ఉన్న దృష్ట్యా, వీరిలో సగం మందికి ప్రభుత్వ కోటా సీట్లు దక్కేది అనుమానమే. మిగిలిన తరగతుల్లో ఉత్తీర్ణులైన వారి పరిస్థితి అంతే. నంబర్ల విడుదల : దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మార్కుల ఆధారంగా ర్యాండమ్ నంబర్లను కేటాయించారు. ఈ జాబితాను ఉదయం ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ విడుదల చేశారు. ఇందులో మొదటి పది స్థానాల్లో నిలుచున్న విద్యార్థుల వివరాలను మంత్రి ప్రకటించారు. ఆ మేరకు మొదటి స్థానాన్ని చెన్నై వెస్ట్ మాంబళానికి చెందిన సుందర నటేషన్(డీఏవీ మహోన్నత పాఠశాల, గోపాలపు రం), రెండో స్థానాన్ని అభిషేక్(శ్రీ విద్యా మందిర్, ఊత్తం కరై), మూడో స్థానాన్ని వీఎస్ విజయ రాం(భారతీ విద్యా భవన్, ఈరోడ్), నాలుగో స్థానాన్ని ఎన్ మిథున్(గ్రీన్ పార్క్ స్కూల్, నామక్కల్) సాధించారు. ఐదో స్థానంలో శృతి (గ్రీన్ పార్క్ స్కూల్, కోయంబత్తూరు), ఆరో స్థానంలో నివేదా(గ్రీన్ పార్క్ స్కూల్, నైవేలి), ఏడో స్థానంలో కేఆర్ మైథిల్(ఆదర్శల్ విద్యాలయ, నామక్కల్), ఎనిమిదో స్థానంలో కలోవిన్ దివ్య(గ్రీన్ పార్క్ స్కూల్, కోయంబత్తూరు), తొమ్మిదో స్థానంలో గౌతం(గ్రీన్ పార్క్ స్కూల్, నామక్కల్), పదో స్థానంలో ఎం మైవెలి శృతి( ఎస్ఆర్వి మహిళా మహోన్నత పాఠశాల, రాశిపురం) నిలిచారు. వీరందరికీ సీట్లు గ్యారంటీ. కౌన్సెలింగ్‌కు వచ్చే విద్యార్థుల కోసం కీల్పాకం వైద్య కళాశాల ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 17 నుంచి కౌన్సెలింగ్ ఆరంభం కానున్నది. తొలి రోజు క్రీడ, వికలాంగులు, మాజీ సైనికోద్యోగులు తదితర రిజర్వేషన్ కోటా సీట్లు భర్తీ కానున్నాయి. జనరల్ కౌన్సెలింగ్ 18 నుంచి ఆరంభం కానుం్నది. ఈ ఏడాది అదనంగా ప్రకటించిన 400 సీట్ల భర్తీకి గాను కౌన్సెలింగ్ జూలై రెండో వారంలో ఆరంభం అవుతుంది. 11 స్వయంప్రతి పత్తి హోదా కలిగిన కళాశాలల్లో సీట్లను దక్కించుకునే విద్యార్థులు రూ.25 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సొమ్ము తిరిగి రాదు. గత ఏడాది ఫీజులే ఈ ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, వైద్య విద్యా డెరైక్టర్ గీతా లక్ష్మి, కౌన్సెలింగ్ కార్యదర్శి సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.