వైద్యకోర్సుల ‘ర్యాండమ్’ విడుదల | ryndam Medical coursesRelease | Sakshi
Sakshi News home page

వైద్యకోర్సుల ‘ర్యాండమ్’ విడుదల

Published Sun, Jun 15 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

వైద్యకోర్సుల ‘ర్యాండమ్’ విడుదల

వైద్యకోర్సుల ‘ర్యాండమ్’ విడుదల

సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని 19 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,555 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 383 సీట్లు జాతీయ స్థాయి కౌన్సెలింగ్‌కు అప్పగించారు. మిగిలిన 2,172 సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇక, 11 స్వయం ప్రతిపత్తి హోదా(ప్రైవేటు) కళాశాలల్లో 1560 సీట్లు ఉన్నాయి. ఇందులో యాజమాన్య కోటా కింద 646 సీట్లను కేటాయించారు. మిగిలిన 912 సీట్లు ప్రభుత్వ కోటా పరిధికి చేరుతాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో చెన్నైలోని దంత వైద్య కళాశాలలో 85 సీట్లు ఉన్నాయి. ఇందులో 15 జాతీయ స్థాయి కౌన్సెలింగ్‌కు అప్పగించారు. రాష్ట్రంలోని 18 దంత వైద్య కళాశాలల్లో 977 సీట్లు ప్రభుత్వ కోటా కింద ఉన్నాయి. ప్రభుత్వ కోటా పరిధిలోని  ఎంబీబీఎస్, దంత వైద్య(బీడీఎస్) సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గత నెల శ్రీకారం చుట్టింది. 50 వేల దరఖాస్తుల్ని సిద్ధం చేసి విద్యార్థులకు అందించే పనిలో పడ్డారు.
 
 భలే డిమాండ్  : గత నెల  30 వరకు దరఖాస్తులు విక్రయించగా, జూన్ 2వ తేదీ వరకు పూర్తి చేసిన దరఖాస్తుల్ని స్వీకరించారు. సీట్ల భర్తీ నిమిత్తం 28 వేల 53 దరఖాస్తులు వచ్చా యి. పరిశీలనానంతరం 27,539 దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో పది వేల 105 మంది విద్యార్థులు, 14,434 మంది విద్యార్థినులు ఉన్నారు. మొదటి తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పది వేల 61 మంది ఉన్నా రు. వీరిలో 132 మంది విద్యార్థులు 200-200 మార్కులు సాధించి ఉన్నారు. ఈ దృష్ట్యా, ఈ ఏడాది ఎంబీబీఎస్ , బీడీఎస్ సీట్లకు డిమాండ్ పెరగనుంది. పది వేల మంది మొదటి తరగతిలో ఉత్తీర్ణులైన వాళ్లే ఉన్న దృష్ట్యా, వీరిలో సగం మందికి ప్రభుత్వ కోటా సీట్లు దక్కేది అనుమానమే. మిగిలిన తరగతుల్లో ఉత్తీర్ణులైన వారి పరిస్థితి అంతే.
 
 నంబర్ల విడుదల : దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మార్కుల ఆధారంగా ర్యాండమ్ నంబర్లను కేటాయించారు. ఈ జాబితాను ఉదయం ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ విడుదల చేశారు. ఇందులో మొదటి పది స్థానాల్లో నిలుచున్న విద్యార్థుల వివరాలను మంత్రి ప్రకటించారు. ఆ మేరకు మొదటి స్థానాన్ని చెన్నై వెస్ట్ మాంబళానికి చెందిన సుందర నటేషన్(డీఏవీ మహోన్నత పాఠశాల, గోపాలపు రం), రెండో స్థానాన్ని అభిషేక్(శ్రీ విద్యా మందిర్, ఊత్తం కరై), మూడో స్థానాన్ని వీఎస్ విజయ రాం(భారతీ విద్యా భవన్, ఈరోడ్), నాలుగో స్థానాన్ని ఎన్ మిథున్(గ్రీన్ పార్క్ స్కూల్, నామక్కల్) సాధించారు. ఐదో స్థానంలో శృతి (గ్రీన్ పార్క్ స్కూల్, కోయంబత్తూరు), ఆరో స్థానంలో నివేదా(గ్రీన్ పార్క్ స్కూల్, నైవేలి), ఏడో స్థానంలో కేఆర్ మైథిల్(ఆదర్శల్ విద్యాలయ, నామక్కల్), ఎనిమిదో స్థానంలో కలోవిన్ దివ్య(గ్రీన్ పార్క్ స్కూల్, కోయంబత్తూరు),
 
 తొమ్మిదో స్థానంలో గౌతం(గ్రీన్ పార్క్ స్కూల్, నామక్కల్), పదో స్థానంలో ఎం మైవెలి శృతి( ఎస్‌ఆర్‌వి మహిళా మహోన్నత పాఠశాల, రాశిపురం) నిలిచారు. వీరందరికీ సీట్లు గ్యారంటీ. కౌన్సెలింగ్‌కు వచ్చే విద్యార్థుల కోసం కీల్పాకం వైద్య కళాశాల ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 17 నుంచి కౌన్సెలింగ్ ఆరంభం కానున్నది. తొలి రోజు క్రీడ, వికలాంగులు, మాజీ సైనికోద్యోగులు తదితర రిజర్వేషన్ కోటా సీట్లు భర్తీ కానున్నాయి. జనరల్ కౌన్సెలింగ్ 18 నుంచి ఆరంభం కానుం్నది. ఈ ఏడాది అదనంగా ప్రకటించిన 400 సీట్ల భర్తీకి గాను కౌన్సెలింగ్ జూలై రెండో వారంలో ఆరంభం అవుతుంది. 11 స్వయంప్రతి పత్తి హోదా కలిగిన కళాశాలల్లో సీట్లను దక్కించుకునే విద్యార్థులు రూ.25 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సొమ్ము తిరిగి రాదు. గత ఏడాది ఫీజులే ఈ ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, వైద్య విద్యా డెరైక్టర్ గీతా లక్ష్మి, కౌన్సెలింగ్ కార్యదర్శి సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement