సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆప్షన్లను రేపు(శుక్రవారం) అర్ధరాత్రి వరకూ నమోదు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 18 తేదీ అర్ధరాత్రి నుంచి వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొత్తం 16 వేల పోస్టులు బ్లాక్ చేశామని పేర్కొన్నారు. బ్లాకింగ్ ప్రక్రియ లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా 4008 పోస్టులు భర్తీ కాకుండా నిలిచిపోయే పరిస్థితి ఉందని ఆయన వివరించారు. (చదవండి: ‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామం)
మొత్తంగా ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ కోసం 74, 418 మంది ఐచ్ఛికాలను ఇచ్చారని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో విధానపరమైన నిర్ణయాలపై చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ ఫీజులు గత ఏడాది తరహాలోనే ఉండే అవకాశముందని, తుది నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూలును రేపు ప్రకటిస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు.(చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment