పీజీ సెట్‌ వెబ్‌ ఆప్షన్లకు ముగిసిన గడువు | Set a deadline of the end of the page, the Web options | Sakshi
Sakshi News home page

పీజీ సెట్‌ వెబ్‌ ఆప్షన్లకు ముగిసిన గడువు

Published Mon, Aug 15 2016 1:40 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

Set a deadline of the end of the page, the Web options

  • ∙ఈనెల 16న సీట్ల కేటాయింపు 
  • ∙20లోపు ప్రవేశాలు పొందాలి
  • కేయూ క్యాంపస్‌ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్స్‌ ప్రక్రియ ఈ ఏడాది జులై 21 నుంచి ప్రారంభం కాగా ఈనెల 12తో వెబ్‌ ఆప్షన్‌లు ఇచ్చుకునే ప్రక్రియ ముగి సింది. ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎంసీజే, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్‌సైన్స్, సైకాలజీ, మైక్రోబయాలజీ, జీయాలజీ, ఎంఏ సోషియాలజీ, ఎంఏ హిస్టరీ, ఎంటీఎం, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంఎల్‌ఐఎస్‌సీ, పీజీ సెరికల్చర్‌ డిపో్లమా, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జూవాలజీ, ఫిజిక్స్, ఎంఏ ఇంగ్లిష్, పొలిటికల్‌ సైన్స్, ఎంఈడీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎ తెలుగు, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, జనరల్‌స్టడీస్, ఎమ్మెస్సీ బాటనీ, ఎంపీఈడీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు ల్లో ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్‌ల ప్రక్రియ ముగిసింది. కేయూ పీజీ సెట్‌ వెబ్‌సైట్‌ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ. కేయూడివోఏ.ఇన్‌ ద్వారా విద్యార్థులు తమ తమకు ఇష్టమైన కళాశాల, కోర్సులను ఎంపిక కోసం వెబ్‌ఆప్షన్‌లు ఇచ్చారు. ఈనెల16న మొదటిదశలో విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగబోతుంది. ఏఏ కళాశాలలో సీటు వచ్చిందో ఆయా విద్యార్థులకు సెల్‌కు మెస్సేజ్‌తో పాటు వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచబోతున్నారు. ఈనెల 20 లోపు తమకు కేటాయించిన కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని సంబంధిత అధికారులు తెలిపారు. కేయూ వెబ్‌సైట్‌æడైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ వెబ్‌సైట్‌లో చూసుకోవాలన్నారు.ఎస్‌బీఐ ద్వారా ఫీజు వివరాలు చలానా ద్వారా చెల్లించి సం బంధిత కళాశాల ప్రిన్సిపాల్స్‌కుకు రిపోర్ట్‌ చేయాలన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement