21 వరకు ధ్రువపత్రాల పరిశీలన
20 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన ప్రక్రియ
26న సీట్ల కేటాయింపు
నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి
హైదరాబాద్: ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్)-2014 కౌన్సెలింగ్ ప్రక్రియకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికై ఐసెట్ ర్యాంకులు పొందిన అభ్యర్థులకు ఈనెల 17 నుంచి 21 వరకు కేంద్రీకృత ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అనంతరం 20 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అనుమతిస్తారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిమిత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 36 హెల్ప్‌లైన్ కేంద్రాలను, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, వికలాంగులు, సైనికుల పిల్లలు.. తదితర ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల కోసం హైదరాబాద్ (మాసబ్‌ట్యాంక్)లోని సాంకేతిక విద్యాభవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు.
ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లే అభ్యర్థులు తమవెంట హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, విద్యార్హతలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఓసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. హెల్ప్‌లైన్ కేంద్రాలు, వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ వివరాల కోసం జ్ట్టిఞట://జీఛ్ఛ్టి.జీఛి.జీ వెబ్‌సైట్లో సంప్రదించవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థుల్లో అర్హులైన వారికి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వనుందని, తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ఫాస్ట్ పథకం కింద (త్వరలో వెలువడనున్న మార్గదర్శకాల ప్రకారం) ఇక్కడి ప్రభుత్వం ఆర్థికసాయం చేయనుందని ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
17 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
Published Sun, Sep 14 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM
Advertisement
Advertisement