
తొలిసారిగా వెబ్ కౌన్సెలింగ్
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ ప్రవేశాలకు నిర్వహించిన ఎస్కేయూసెట్–2017లో ర్యాంకర్లకు 19 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. 30న ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్పోర్ట్స్, పీహెచ్, సీఏపీ కేటగిరి విద్యార్థులకు ప్రత్యేకంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నామన్నారు.
తొలిసారిగా వెబ్ ఆప్షన్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. 21 నుంచి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి అవకాశం కల్పించారు. మొదటి దఫా సీట్లు అలాట్‌మెంట్లకు జూలై 4 నుంచి 6వ తేదీ వరకు షెడ్యూల్ కేటాయించారు. సీట్లు అలాట్‌మెంట్ అయిన విద్యార్థులు జూలై 4 నుంచి 6వ తేదీలోపు ఆన్‌లైన్‌లో కోర్సు ఫీజు చెల్లించాలి. జూలై 8 నుంచి 12 వరకు రెండో దఫా సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. రెండో దఫా సీట్లు కేటాయింపు జూలై 16న నిర్వహిస్తారు. ఇందులోనూ మిగిలిన సీట్లకు జూలై 22, 23, 24న స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక ఒక స్కాచ్ కార్డును ఇస్తారు. ఇందులో పాస్‌వర్డ్ ఉంటుంది. ఆప్షన్స్ ఎంచుకోవడానికి ఈ పాస్‌వర్డ్ దోహదపడుతుంది. కళాశాల ఆప్షన్లు ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు. వెబ్‌సైట్ ఠీఠీఠీ. టజుuఛీ్చౌ.జీn అనే వెబ్‌సైట్ ద్వారా వెబ్‌ఆప్షన్లు ఇవ్వాలి.
తీసుకురావాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లు : హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, డిగ్రీ ప్రొవిజనల్, మార్కులిస్ట్, టీసీ, డిగ్రీ వరకు 7 సంవత్సరాలు తగ్గకుండా స్టడీ సర్టిఫికెట్లు, తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం.
సర్టిఫికెట్ల పరిశీలన ఇలా :
తేదీ ఉదయం (9 గంటలకు) మధ్యాహ్నం (2గంటలకు)
19 బయోకెమిస్ట్రీ ,బయోటెక్నాలజీ, బోటనీ, జువాలజీ
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్,
జియాలజీ
20 కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్సెస్
21 పాలిమర్ సైన్సెస్, ఫిజిక్స్
మైక్రోబయాలజీ,
ఫిజికల్ ఎడ్యుకేషన్,
సెరికల్చర్
22 జువాలజీ స్టాటిస్టిక్స్ , ఎలక్ట్రానిక్స్ అండ్
ఇన్‌స్ట్రుమెంటేషన్
23 ఎకనామిక్స్ ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, హిందీ
24 పొలిటికల్ సైన్సెస్ హిస్టరీ, అడల్ట్ ఎడ్యుకేషన్,
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఎల్‌ఐఎస్సీ
25 తెలుగు రూరల్ డెవలప్‌మెంట్,
సోషల్ వర్క్ ,సోషియాలజీ
26 మేథమేటిక్స్ (1–250వ ర్యాంకు వరకు) మేథమేటిక్స్ (251–500వ ర్యాంకు)
27 కామర్స్ (1–250వ ర్యాంకు వరకు) కామర్స్ (251–500)
28 కామర్స్ (501–750) కామర్స్ 751–1000
29 కామర్స్ (1001–1250) కామర్స్ 1251–1406