- 169 మంది విద్యార్థులు హాజరు
- సర్టిఫికెట్ల పరిశీలనకు 481 మంది హాజరు
- మోసపోవద్దు : క్యాంప్ ఆఫీసర్ శ్రీరంగం
సాక్షి, విజయవాడ : జిల్లాలో ఇంజనీరింగ్ వెబ్‌ఆప్షన్ల ఎంపిక ప్రకియ ఆదివారం ప్రారంభమయింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరడానికి, మంచి కళాశాల ఎంపిక చేసుకోవటానికి ఇదే కీలక ప్రకియ కావడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులూ వెబ్ ఆప్షన్లపై దృష్టి సారించారు. ఆదివారం మొదలైన ఈప్రకియ 25వ తేదీ వరకు కొనసాగనుంది. 30వ తేదీకల్లా ఈప్రకియ పూర్తి చేసి కోర్టు ఉత్తర్వుల మేరకు సెప్టెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆడ్మిషన్లు మొదలయ్యేలా షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
మొదటి రోజు నగరంలోని మూడు హెల్ప్‌లైన్ సెంటర్లలో 169 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్ల కార్యక్రమానికి హజరై కళాశాలల అప్షన్లు ఇచ్చారు. నగరంలోని ఆంధ్రలయోలా కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలల్లోని సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాల్లో వెబ్ ఆప్షన్ల ప్రకియను నిర్వహించారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళాశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
మొదటిరోజున 1 నుంచి 50 వేల ర్యాంకుల వరకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చారు. దీనికి గానూ ఆంధ్రలయోలా కళాశాలకు 53 మంది విద్యార్థులు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు 45 మంది విద్యార్థులు, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలకు 71 మంది విద్యార్థులు హజరై ఆప్షన్లు ఇచ్చారు. విద్యార్థులు ఆప్షన్‌తో పాటు వారి మైబైల్ నెంబర్‌ను కూడా రిజిష్టర్ చేసుకోవాలి. దానికి ఉన్నతవిద్యా మండలి పంపే పాస్‌వర్డ్ ద్వారానే సంబంధిత వైబ్‌సైట్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
మరో వైపు ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం కొనగసాతుంది. ఆదివారం 95 వేల నుంచి లక్ష ర్యాంకుల వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల పరి శీలన ప్రకియ నిర్వహించగా 481 మంది విద్యార్థులు హజరయ్యారు. ఈనెల 25 వరకు వెబ్ ఆప్షన్ల ప్రకియ నిర్వహణ అనంతరం 26 నుం చి ఆప్షన్లలో కళాశాలలు మార్చుకోవటానికి మరో షెడ్యూల్‌ను నిర్ణయించారు. 26న 1నుం చి లక్ష వరకు ర్యాంకులు 27న లక్ష ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు కళాశాలలు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.
అయితే ఈప్రకియ పూర్తిగా కొత్త విధానం కావటంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మొదటి కౌన్సెలింగ్ తరహలో జరిగే వెబ్ ఆప్షన్ల ప్రకియ ద్వారా కళాశాలను ఏంపిక చేసుకొని ఫీజులు చెల్లించి ఆతర్వాత మరో కళాశాలలో చేరేందుకు కూడా ఈ పర్యాయం అవకాశం కల్పించారు. దీనికి చెల్లించిన పూర్తి ఫీజును కళాశాలలు తిరిగి విద్యార్థికి చెల్లిస్తారు. ఈనెల చివరి కల్లా ప్రకియ పూర్తి చేసి వచ్చే నెల 1 నుంచి ఆడ్మిషన్లు మెదలుపెట్టాల్సి ఉంది.
ఇంజనీరింగ్ కళాశాల హడావుడి..
ఆంధ్రలయోలా కళాశాల వద్ద ప్రెవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి కొంత హడావిడి చేశారు. వెబ్ ఆప్షన్లకు హజరైన విద్యార్థులను ఫీజు రాయితీలు, డోనేషన్లు లేవంటూ అకర్షించే ప్రయత్నం చేసి కొందరు విద్యార్థుల వద్ద ఒరిజినల్ సర్టిఫికెట్లను స్వీకరించారు. కొందరు విద్యార్థులు ఈవిషయాన్ని ఎంసెట్ క్యాంపు ఆఫీసర్ శ్రీరంగం దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎంసెట్ కన్వీనర్‌కు విషయాన్ని ఫిర్యాదు చేశారు.
దళారుల మాట నమ్మొద్దు...
దళారుల మాట నమ్మి నాలుగేళ్ల బంగారు భవిష్యత్తును వారి చేతుల్లో పెట్టవద్దని ఎంసెట్ క్యాంప్ ఆఫీసర్ శ్రీరంగం సూచించారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. ప్రెవేట్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవహరాన్ని ఎంసెట్ కన్వీనర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దళారులు చెప్పే ఆఫర్లు, ప్యాకేజీల మాట నమ్మి విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లువారికివ్వడం మంచిది కాదని, మొదటి ఏడాది ఫీజులో తగ్గింపు ఇచ్చే కళాశాలలు ఆ మొత్తాన్ని వివిధ రూపాల్లో వచ్చే మూడేళ్లలో వసూలు చేస్తాయనితెలిపారు.