Srirangam
-
రంగనాథుని సేవలో మోదీ
సాక్షి, చెన్నై/ తిరుచిరాపల్లి: కొద్దిరోజులుగా శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తున్న ప్రధాని మోదీ అందులో భాగంగా శనివారం తమిళనాడులోని ద్వీప పట్టణం ‘శ్రీరంగం’లోని ప్రఖ్యాత శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ధోతి, అంగవస్త్రం, రుద్రాక్షమాలతో తమిళ సంప్రదాయ ఆహార్యంలో ఆలయానికి విచ్చేసిన ప్రధాని మోదీకి ఆలయ నిర్వహణ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారికి వేదాలు పఠిస్తూ పండితులు తోడు వచ్చారు. మోదీ ఆ తర్వాత రంగనాథస్వామివారిని దర్శించుకున్నారు. రామానుజాచార్య, చక్రత్తాళ్వార్ సన్నిధాలను సందర్శించారు. ఆలయ ఏనుగు ఆండాళ్ ఆశీ్వరాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏనుగు మౌతార్గాన్ వాయిస్తూ ఆహ్వానం పలకడం విశేషం. భారత ప్రధాని రంగనాథ ఆలయాన్ని దర్శించుకోవడం ఇదే తొలిసారి. 12వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత తమిళ కవి కంబ రచించిన కంబ రామాయణాన్ని ఈ సందర్భంగా మోదీ పారాయణం చేశారు. తమిళనాడులోని ప్రఖ్యాత వైష్ణవదేవాలయాల్లో రంగనాథాలయం ముఖ్యమైనది. 108 దివ్య దేశాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. రామేశ్వరం ఆలయంలోనూ... శనివారం మధ్యాహ్నం మోదీ రామేశ్వరం వెళ్లారు. అగ్నితీర్థం బీచ్‌లో పుణ్యస్నానం ఆచరించారు. 22 పవిత్ర తీర్థాలలో స్నానం చేశారు. ప్రాచీన శివాలయమైన ప్రఖ్యాత రామనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. భక్తి, భజన కార్యక్రమాల్లో పాల్గొని భజన చేశారు. రామయణ గాథతో ఈ ఆలయానికి గాఢానుబంధం ఉంది. అనంతరం పట్టణంలోని బీజేపీ కార్యకర్తలు, స్థానికులతో మోదీ మాట్లాడారు. రాత్రి రామేశ్వరంలోని రామకృష్ణ మఠంలో బస చేశారు. ఆదివారం ఉదయం ఆయన మళ్లీ రామేశ్వరం అగ్ని తీర్థంలో పవిత్ర స్నానం చేసి మరోమారు రామనాథస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం సమీప గ్రామంలోని కోడండరామస్వామి దర్శనంతో మోదీ మూడు రోజుల తమిళనాడు పర్యటన పూర్తవుతుంది. తిరుచిరాపల్లిలో రోడ్ షో తిరుచిరాపల్లి పురవీధుల్లో జనం మోదీకి ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా పూలవర్షం కురిపించారు. వారందరికీ వనక్కమ్ అంటూ మోదీ అభివాదం చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆ మార్గమంతా మార్మోగిపోయింది. అక్కడి నుంచి శ్రీరంగం వైపుగా మోదీ రోడ్‌షో కొనసాగింది. -
మోక్షం కోసం మహిళ ఆత్మాహుతి
సాక్షి, టీ.నగర్(చెన్నై): మూఢభక్తితో ఓ మహిళ ఆత్మాహుతి చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగంలో సంచలనం కలిగించింది. ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన వివరాలు.. శ్రీరంగం సాత్తారవీధికి చెందిన సత్యనారాయణ నగరాభివృద్ధి కార్యాలయ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి ఏడేళ్ల క్రితం మృతిచెందారు. ఆయన భార్య పట్టమ్మాళ్(85). ఆదివారం వైకుంఠ ఏకాదశి ముగింపు సందర్భంగా నమ్మాళ్వార్ మోక్షసిద్ధి కార్యక్రమంలో పాల్గొంది. అనంతరం ఇంటికి వచ్చిన పట్టమ్మాళ్ స్నేహితురాలు రాజ్యలక్ష్మికి ఆధార్, రేషన్ కార్డు ఇతర పత్రాలను అందజేసింది. సోమవారం ఉదయం పట్టమ్మాళ్ ఇంటికి వెళ్లిన రాజ్యలక్ష్మి తలుపు తట్టినప్పటికీ తెరవలేదు. కిటికీ నుంచి తొంగిచూసిన ఆమెకు లోపల పట్టమ్మాళ్ శరీరం కాలుతూ కనిపించింది. వెంటనే స్థానికుల సాయంతో ఇంటి తలుపులు పగులగొట్టి పట్టమ్మాళ్‌పై నీళ్లు పోశారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు తెలిసి కోయంబత్తూరులోని బంధువులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో అక్కడికి వచ్చిన శ్రీరంగం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీరంగం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని మంగళవారం బంధువులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు రాజ్యలక్ష్మి, ఇరుగుపొరుగువారి దగ్గర ప్రాథమిక విచారణ జరపగా నమ్మాళ్వార్ మోక్షసిద్ధి పొందేరోజున ఎవరైనా చనిపోతే మోక్షం పొందుతారని పట్టమ్మాళ్ తరచూ చెప్పినట్లు వారు పేర్కొన్నారు. -
నిఘా నీడలో 'శ్రీరంగం'
తిరుచ్చి శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయ వెబ్సైట్ హ్యాక్‌కు గురైంది. దీంతో ఆలయ పరిసరాల్ని, శ్రీరంగం పట్టణాన్ని నిఘా నీడలోకి తెచ్చారు. చెన్నై: వైష్ణవ క్షేత్రాల్లో తిరుచ్చి శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఒకటి. ఆధ్యాత్మికతకు నిలయంగా ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం అతి పెద్దప్రాకారంతో, దేదీప్యమానంగా కన్పిస్తుంటుంది. ఏడు ప్రాకారాలు, 21 గోపురాలు, 50 సన్నిధులు ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు ముగిసి , కుంభాభిషేక వేడుకలు గతనెల కోలాహలంగా జరిగాయి. భక్తులు ఆలయానికి రాక పెరిగింది. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ఆలయం ముస్తాబు అవుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం ఆలయ వెబ్సైట్ హ్యాక్‌కు గురైంది. ఉదయం రెండన్నర గంటల సమయంలో వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన వ్యక్తులు, కశ్మీర్ కైవసం తమ లక్ష్యం అంటూ, పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ఉండటంతో కలవరం బయలు దేరింది. దీంతో ఆలయ అధికారులు నగర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సైబర్ క్రైం రంగంలోకి దిగింది. ఈ వెబ్ సైట్‌ను ఎక్కడి నుంచి హ్యాక్ చేశారో ఆరాతీస్తున్నారు. అదే సమయంలో వైకుంఠ ఏకాదశి వివరాలను ప్రజలకు అందించడం కష్టతరంగా మారింది. ఇక, ఈ హ్యాక్‌తో శ్రీరంగం ఆలయం, పరిసరాల్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదే వరకే తిరుచ్చి కలెక్టర్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు సైతం వచ్చి ఉన్న దృ ష్ట్యా, ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిసరాల్లో తనిఖీలు ముమ్మరం చేసి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకలకు భారీ భద్రత నిమిత్తం మదురై నుంచి బలగాలను రంగంలోకి దించేందుకు నిర్ణయించి ఉన్నారు. ఇదిలా ఉండగా, చెన్నైలోని హిందూ మున్నని ప్రధాన కార్యాలయానికి సైతం బాంబు బూచి రావడంతో ఉత్కంఠ బయలు దేరింది. చింతాద్రి పేటలో ఉన్న ఆ కార్యాలయానికి సిమీ తీవ్ర వాదుల పేరిట వచ్చిన లేఖతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు దొరకనప్పటికీ, ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేయక తప్పలేదు. -
ఓడినా..కృతజ్ఞతే!
శ్రీరంగంలో నేడు డీఎంకే సభ సాక్షి, చెన్నై : శ్రీరంగం ఉపఎన్నికల్లో ఓడినా.. డిపాజిట్ దక్కినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేయాలని డీఎంకే నిర్ణయించింది. ఈ మేరకు గురువారం శ్రీరంగంలోని దేవి థియేటర్ సమీపంలో ప్రత్యేక సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు ఆ పార్టీ కోశాధికారి ఎంకే.స్టాలిన్ హాజరు కానున్నట్లు సమాచారం. ఎన్నికల్లో తమను గెలిపించిన ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేయడం పరిపాటే. ఇంకా చెప్పాలంటే రాజకీయ నాగరికత మేరకు గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్లు అభినందనలు తెలియజేయడం సహజం. ఇలాంటి నాగరికత రాష్ర్టంలో లేదనే చెప్పవచ్చు. తాజాగా తమను ఓడించిన ఓటర్లకు కృత జ్ఞతలు తెలిపేందుకు డీఎంకే సిద్ధం కావడం విశేషం. శ్రీరంగం ఉపఎన్నిక ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 96 వేల ఓట్ల మెజారిటీతో అన్నాడీఎంకే అభ్యర్థి వలర్మతి విజయ కేతనం ఎగురవేశారు. కేవలం 55 వేల ఓట్లకు డీఎంకే అభ్యర్థి ఆనంద్ పరిమితమయ్యారు. బీజేపీ, సీపీఎం డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఎన్నికల ప్రచార సమయంలో ఉపఎన్నికలో తాము ఓడినా, గతంలో వచ్చిన ఓట్లు వస్తే గెలిచినట్టేనని డీఎంకే కోశాధికారి ఎంకే.స్టాలిన్ ప్రకటించారు. గతంలో వచ్చిన ఓట్ల కంటే, అధికంగానే ఆ పార్టీ అభ్యర్థి ఆనంద్‌కు శ్రీరంగం ఓటర్లు కట్ట బెట్టారు. దీంతో ఓడినా, ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేయడానికి డీఎంకే నిర్ణయించింది. గురువారం దేవీ థియేటర్ సమీపంలో కృతజ్ఞత సభకు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పాల్గొని ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. నిరాడంబరంగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ మార్చి ఒకటో తేదీన 63వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. అయితే, తన బర్తడేను హంగు ఆర్భాటాలతో చేయొద్దని, నిరాడంబరంగా ప్రజా హితాన్ని కాంక్షించే రీతిలో నిర్వహించాలని పార్టీ వర్గాలకు స్టాలిన్ ఉపదేశించారు. ఎక్కడా, ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయొద్దని, మహిళా శిశు సంక్షేమార్థం కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 28న చెన్నైలో కోటి రూపాయలతో 20 వేల మందికి డీఎంకే అధినేత ఎం.కరుణానిధి చేతుల మీదుగా సంక్షేమ పథకాలను పంపిణీ చేయడానికి నిర్ణయించారు. -
మద్దతుపై విజయకాంత్ మెలిక
సాక్షి, చెన్నై : శ్రీరంగం ఉపఎన్నికల్లో బీజేపీకి మద్దతు విషయంలో డీఎండీకే అధినేత విజయకాంత్ కొత్త మెలిక పెట్టారు. పార్టీ శ్రేణులతో ఆదివారం చెన్నైలో సమాలోచనలు చేసి నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ ఢిల్లీ పెద్దలు అమిత్ షా , ప్రధాని నరేంద్ర మోదీ వంటి వారు కోరినప్పుడే ప్రచారంలోకి వెళ్లడం, బహిరంగంగా మద్దతు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎండీకే మద్దతుతో శ్రీరంగం ఉప ఎన్నిక బరిలో తాము దిగుతున్నామని బీజేపీ వర్గాలు ప్రకటించాయి. విజయకాంత్ తమకు మద్దతు ఇచ్చారని బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారేగానీ, డీఎండీకే వర్గా లు మాత్రం బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. లోపాయి కారి ఒప్పందం మేరకు ఈ మద్దతు ఉందన్న ప్రచారం సాగుతున్న సమయంలో విజయకాంత్ కొత్త మెలిక పెట్టే పనిలో పడ్డారు. మెలికలు పెట్టడంలో ఆరి తీరిన విజయకాంత్ బీజేపీకి మద్దతు విషయంలో ఇప్పుడే అదే బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. సమావేశం : శ్రీరంగంలోని పార్టీ నాయకులు, అన్ని జిల్లాల కార్యదర్శులను ఆగమేఘాలపై ఆదివారం విజయకాంత్ చెన్నై కు రప్పించారు. కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం వరకు ఈ సమావేశం సాగింది. ఇందులో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కొన్ని జిల్లాల్లో పార్టీ నిర్వాహకుల తీరును ఆరా తీసి, వారిని తొలగించేందుకు నిర్ణయించినట్టు సమాచారం. పార్టీ పరంగా కొన్ని జిల్లాల్లో ప్రక్షాళనకు విజయకాంత్ నిర్ణయించినట్టుగా డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. శ్రీరంగం ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు విషయమై సుదీర్ఘ చర్చ సాగినట్టు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రమే తనను కలిసి వెళ్లడం, జాతీయ నాయకులెవ్వరూ కనీసం మాట వరుసకైనా ఫోన్లో కూడా మాట్లాడక పోవడాన్ని విజయకాంత్ తీవ్రంగా పరిగణించారు. ఈ దృష్ట్యా, ఉప ఎన్నికల్లో మద్దతు తెలియజేయడంతో పాటుగా బీజేపీ అభ్యర్థితో కలసి ఓట్ల వేటకు వెళ్లడం, తానే స్వయంగా ప్రచారానికి వెళ్లే విషయంగా చర్చించి ఓ కొత్త మెలికను బీజేపీ అధిష్టానం ముందు ఉంచేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేదా, ఇతర నాయకులు లేదా ప్రధాని నరేంద్ర మోదీలో ఎవరో ఒకరు తనతో ఫోన్లో సంప్రదించి మద్దతు కోరినప్పుడే స్పందించేందుకు నిర్ణయించి నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ వర్గాలు మద్దతు ప్రకటించినట్టు చెబుతున్నాయిగా? అని డీఎండీకే వర్గాలను ప్రశ్నించగా, వాళ్లు చెబితే చెప్పుకోనీయండి, తాము ప్రచారం బరిలో దిగాలిగా అని పేర్కొనడం గమనార్హం. తమను బీజేపీ పెద్దలు ఎవ్వరూ సంప్రదించని పక్షంలో ఇతర పార్టీల వలే మౌనంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. -
వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం
169 మంది విద్యార్థులు హాజరు సర్టిఫికెట్ల పరిశీలనకు 481 మంది హాజరు మోసపోవద్దు : క్యాంప్ ఆఫీసర్ శ్రీరంగం సాక్షి, విజయవాడ : జిల్లాలో ఇంజనీరింగ్ వెబ్ఆప్షన్ల ఎంపిక ప్రకియ ఆదివారం ప్రారంభమయింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరడానికి, మంచి కళాశాల ఎంపిక చేసుకోవటానికి ఇదే కీలక ప్రకియ కావడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులూ వెబ్ ఆప్షన్లపై దృష్టి సారించారు. ఆదివారం మొదలైన ఈప్రకియ 25వ తేదీ వరకు కొనసాగనుంది. 30వ తేదీకల్లా ఈప్రకియ పూర్తి చేసి కోర్టు ఉత్తర్వుల మేరకు సెప్టెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆడ్మిషన్లు మొదలయ్యేలా షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొదటి రోజు నగరంలోని మూడు హెల్ప్‌లైన్ సెంటర్లలో 169 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్ల కార్యక్రమానికి హజరై కళాశాలల అప్షన్లు ఇచ్చారు. నగరంలోని ఆంధ్రలయోలా కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలల్లోని సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాల్లో వెబ్ ఆప్షన్ల ప్రకియను నిర్వహించారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళాశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. మొదటిరోజున 1 నుంచి 50 వేల ర్యాంకుల వరకు వెబ్ఆప్షన్లు ఇచ్చారు. దీనికి గానూ ఆంధ్రలయోలా కళాశాలకు 53 మంది విద్యార్థులు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు 45 మంది విద్యార్థులు, ఎస్ఆర్ఆర్ కళాశాలకు 71 మంది విద్యార్థులు హజరై ఆప్షన్లు ఇచ్చారు. విద్యార్థులు ఆప్షన్‌తో పాటు వారి మైబైల్ నెంబర్‌ను కూడా రిజిష్టర్ చేసుకోవాలి. దానికి ఉన్నతవిద్యా మండలి పంపే పాస్వర్డ్ ద్వారానే సంబంధిత వైబ్సైట్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. మరో వైపు ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం కొనగసాతుంది. ఆదివారం 95 వేల నుంచి లక్ష ర్యాంకుల వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల పరి శీలన ప్రకియ నిర్వహించగా 481 మంది విద్యార్థులు హజరయ్యారు. ఈనెల 25 వరకు వెబ్ ఆప్షన్ల ప్రకియ నిర్వహణ అనంతరం 26 నుం చి ఆప్షన్లలో కళాశాలలు మార్చుకోవటానికి మరో షెడ్యూల్‌ను నిర్ణయించారు. 26న 1నుం చి లక్ష వరకు ర్యాంకులు 27న లక్ష ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు కళాశాలలు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అయితే ఈప్రకియ పూర్తిగా కొత్త విధానం కావటంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మొదటి కౌన్సెలింగ్ తరహలో జరిగే వెబ్ ఆప్షన్ల ప్రకియ ద్వారా కళాశాలను ఏంపిక చేసుకొని ఫీజులు చెల్లించి ఆతర్వాత మరో కళాశాలలో చేరేందుకు కూడా ఈ పర్యాయం అవకాశం కల్పించారు. దీనికి చెల్లించిన పూర్తి ఫీజును కళాశాలలు తిరిగి విద్యార్థికి చెల్లిస్తారు. ఈనెల చివరి కల్లా ప్రకియ పూర్తి చేసి వచ్చే నెల 1 నుంచి ఆడ్మిషన్లు మెదలుపెట్టాల్సి ఉంది. ఇంజనీరింగ్ కళాశాల హడావుడి.. ఆంధ్రలయోలా కళాశాల వద్ద ప్రెవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి కొంత హడావిడి చేశారు. వెబ్ ఆప్షన్లకు హజరైన విద్యార్థులను ఫీజు రాయితీలు, డోనేషన్లు లేవంటూ అకర్షించే ప్రయత్నం చేసి కొందరు విద్యార్థుల వద్ద ఒరిజినల్ సర్టిఫికెట్లను స్వీకరించారు. కొందరు విద్యార్థులు ఈవిషయాన్ని ఎంసెట్ క్యాంపు ఆఫీసర్ శ్రీరంగం దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎంసెట్ కన్వీనర్‌కు విషయాన్ని ఫిర్యాదు చేశారు. దళారుల మాట నమ్మొద్దు... దళారుల మాట నమ్మి నాలుగేళ్ల బంగారు భవిష్యత్తును వారి చేతుల్లో పెట్టవద్దని ఎంసెట్ క్యాంప్ ఆఫీసర్ శ్రీరంగం సూచించారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. ప్రెవేట్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవహరాన్ని ఎంసెట్ కన్వీనర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దళారులు చెప్పే ఆఫర్లు, ప్యాకేజీల మాట నమ్మి విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లువారికివ్వడం మంచిది కాదని, మొదటి ఏడాది ఫీజులో తగ్గింపు ఇచ్చే కళాశాలలు ఆ మొత్తాన్ని వివిధ రూపాల్లో వచ్చే మూడేళ్లలో వసూలు చేస్తాయనితెలిపారు.