- l 10న సీట్ల కేటాయింపు
పీజీసెట్ వెబ్ ఆప్షన్లకు ముగిసిన గడువు
Published Mon, Aug 8 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్‌ఆప్షన్ల ఇచ్చుకునే ప్రక్రియ ఆది వారం ముగిసింది.
ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎంసీజే, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, మైక్రోబయాలజీ, జియాలజీ, ఎంఏ సోషియాలజీ, ఎంఏ హిస్టరీ, ఎంటీఎం, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంఎల్‌ఐఎస్‌సీ, పీజీ సెరికల్చర్ డిప్లొమా, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జువాలజీ, ఫిజిక్స్, ఎంఏ ఇంగ్లిష్, పొలిటికల్‌సైన్స్, ఎంఈడీ, ఎంఎస్‌డబ్లూ్య, ఎంఏ తెలుగు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జెండర్æస్టడీస్, ఎమ్మెస్సీ బాటనీ, ఎంపీఈడీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది. ఈనెల 10న విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఏఏ కళాశాలలో సీటు వచ్చిందో ఆయా విద్యార్థులకు సెల్‌ఫోన్లకు మెస్సేజ్‌తోపాటు వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఎన్ని రోజుల్లో తమకు కేటాయించిన కళాశాలల్లో జాయిన్ కావాలో కూడా అభ్యర్థులకు సమాచారం పంపుతారు. ఇదిలా ఉండగా ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్ల కేటాయింపు ఈనెల 10న ఉండడం లేదని తెలుస్తోంది.
Advertisement
Advertisement