PG set
-
మే 9 నుంచి టీఎస్ఈఏపీసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఈఏపీసెట్)ను మే 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ దీన్‌కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తున్నామన్నారు. ఈసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సిలబస్‌ను వందశాతం అమలు చేస్తామని చెప్పారు. పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుందన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్ష (టీఎస్‌పీజీ సెట్)ను జూన్ 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు పీజీ సెట్ కన్వీనర్ డాక్టర్ అరుణకుమారి తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నేతృత్వంలో మంగళవారం సెట్స్ తేదీలు వెల్లడించారు. మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహ్మమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
సెట్స్ తేదీల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి మార్చింది. లాసెట్, పీఈసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్ తేదీల్లో మార్పు చేసింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్‌లు మాత్రం గతంలో ప్రకటించిన తేదీల్లోనే జరుగుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. సెట్స్ నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్ సూచన మేరకు ఈ మార్పులు చేసినట్లు చెప్పారు. లాసెట్, పీజీ లాసెట్ మే 26కి బదులు మే 20నే నిర్వహిస్తామని తెలిపారు. పీఈ సెట్‌ను మే 20 నుంచి నిర్వహించాల్సి ఉండగా దాన్ని మే 15 నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు. పీజీ ఈసెట్‌ను షెడ్యూల్ ప్రకారం మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా వాటిని అదే నెల 28 నుంచి 31 వరకు నిర్వహిస్తామని వివరించారు. ఎడ్‌సెట్‌ను మే 30, 31 తేదీల్లో నిర్వహించేలా ముందుగా షెడ్యూల్ జారీ చేసినప్పటికీ మే 31నే పూర్తి చేసేలా మార్పులు చేసినట్లు వివరించారు. ఇటీవల ఆయా సెట్స్‌కు కన్వీనర్లను నియమించిన ఉన్నత విద్యామండలి గురువారం వారితోపాటు ఆయా సెట్స్‌కు చైర్మన్లుగా వ్యవహరించే సంబంధిత యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సెట్స్ నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణ అంశాలపై చర్చించింది. ఇప్పటికే సెట్స్ కమిటీలను ఏర్పాటు చేశామని, త్వరలోనే ఆయా కమిటీలు సమావేశమై నోటిఫికేషన్ల జారీ తేదీలను వెల్లడిస్తాయని పాపిరెడ్డి పేర్కొన్నారు. అప్పుడే దరఖాస్తు ఫీజుల వివరాలను వెల్లడిస్తామన్నారు. గతేడాది నిర్ణయించిన ఫీజునే కొనసాగించే అవకాశం ఉందని, ఒకవేళ పెంచాల్సి వచ్చినా ఆ పెంపు స్పల్పంగానే ఉంటుందని వివరించారు. ప్రవేశపరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున ఈసారి పరీక్ష కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా, ఒకవేళ తలెత్తినా వెంటనే పరిష్కరించేలా టెక్నీషియన్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆన్లైన్ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యేలా సెట్స్ వెబ్సైట్లలో మాక్ టెస్టుల లింకులను విద్యార్థుల ప్రాక్టీస్ కోసం అందుబాటులో ఉంచుతామన్నారు. హైదరాబాద్ నాచారంలోని పరీక్ష కేంద్రంలో దాదాపు 8 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, అక్కడ గతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని, ఈసారి అవి లేకుండా చూస్తామన్నారు. పీజీ కామన్ ఎంట్రెన్స్ విషయంలో ఆలోచనలు చేస్తున్నామన్నారు. ఇవీ సెట్స్ తేదీల వివరాలు... సెట్ పాత తేదీలు మారిన తేదీలు లాసెట్, పీజీ లాసెట్ మే 26 మే 20 పీఈసెట్ మే 20 నుంచి మే 15 నుంచి పీజీఈసెట్ మే 27, 28, 29 మే 28, 29, 30, 31 ఎడ్‌సెట్ మే 30, 31 మే 31 ఎంసెట్ మే 3, 4, 6 (ఇంజనీరింగ్), – 8, 9 (అగ్రికల్చర్) ఈసెట్ మే 11 – ఐసెట్ మే 23, 24 – -
పీజీసెట్ వెబ్ ఆప్షన్లకు ముగిసిన గడువు
l 10న సీట్ల కేటాయింపు కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ఆప్షన్ల ఇచ్చుకునే ప్రక్రియ ఆది వారం ముగిసింది. ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎంసీజే, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, మైక్రోబయాలజీ, జియాలజీ, ఎంఏ సోషియాలజీ, ఎంఏ హిస్టరీ, ఎంటీఎం, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ, పీజీ సెరికల్చర్ డిప్లొమా, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జువాలజీ, ఫిజిక్స్, ఎంఏ ఇంగ్లిష్, పొలిటికల్‌సైన్స్, ఎంఈడీ, ఎంఎస్డబ్లూ్య, ఎంఏ తెలుగు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జెండర్æస్టడీస్, ఎమ్మెస్సీ బాటనీ, ఎంపీఈడీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది. ఈనెల 10న విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఏఏ కళాశాలలో సీటు వచ్చిందో ఆయా విద్యార్థులకు సెల్ఫోన్లకు మెస్సేజ్తోపాటు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఎన్ని రోజుల్లో తమకు కేటాయించిన కళాశాలల్లో జాయిన్ కావాలో కూడా అభ్యర్థులకు సమాచారం పంపుతారు. ఇదిలా ఉండగా ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్ల కేటాయింపు ఈనెల 10న ఉండడం లేదని తెలుస్తోంది. -
20 నుంచి టీఎస్ పీజీఈసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
కేయూక్యాంపస్ : ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఫార్మడి కోర్సులలో ప్రవేశాలకుగాను సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 20వతేదీ నుంచి కాకతీయ యూనివర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్ కార్యాలయంలో ప్రారంభమవుతుందని కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎం.కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఇ.సురేశ్‌బాబు మంగళవారం తెలిపారు. ఈనెల 20న గేట్, జీపాట్ కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన కోసం హాజరుకావాలన్నారు. పీజీ ఈసెట్ అభ్యర్థులకు ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తామని అన్నారు. ర్యాంకులు, తేదీలు, వారి వివరాలు టీఎస్ పీజీఈసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400 ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్పెషల్ కేటగిరి, పీహెచ్, ఎన్సీసీ కాప్, స్పోర్ట్స్ అభ్యర్థులకు ఈనెల 20న హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపారు. ఈనెల 22 నుంచి వెబ్ ఆప్షన్ ద్వారా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చన్నారు. -
3 నుంచి ఏపీ ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తులు
-
3 నుంచి ఏపీ ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తులు
అపరాధ రుసుము లేకుండా తుది గడువు మార్చి 21 సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2016, ఏపీ పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఖరారయ్యాయి. ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానుంది. పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 6 నుంచి ప్రారంభమవుతుంది. ఎంసెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 29న, పీజీ సెట్ నోటిఫికేషన్‌ను మార్చి 4న విడుదల చేయనున్నారు. ఏపీ ఎంసెట్, పీజీ సెట్ కమిటీల సమావేశం బుధవారమిక్కడి ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి, ఎంసెట్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ వీఎస్ఎస్కుమార్, కన్వీనర్ సీహెచ్ సాయిబాబు, పీజీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాదరాజు హాజరయ్యారు. పరీక్ష రుసుముల పెంపు ఎంసెట్, పీజీ సెట్ పరీక్ష రుసుములను పెంచారు. ఎంసెట్ ఫీజు గతంలో రూ.250 ఉండగా.. ఈసారి 350కి పెంచారు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. పీజీ సెట్ ఫీజు గతంలో రూ.500 ఉండగా.. ఈసారి 600కు పెంచారు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.500 చెల్లించాలి. కాగా, ఎంసెట్ దరఖాస్తులను ఆన్లైన్లోనే దాఖలు చేయాలని కన్వీనర్ సాయిబాబు చెప్పారు. దరఖాస్తు, ఇతర నియమ నిబంధనలను ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఈఏఎంసీఈటీ.ఓఆర్జీ’’ వెబ్సైట్లో పొందుపరుస్తున్నామని చెప్పారు. ఒక దరఖాస్తు ఒక్కసారే ఆన్లైన్లో ఆమోదం పొందుతుందని, ఈ విషయాన్ని గమనించి వివరాలను సరిచూసుకొని అప్లోడ్ చేయాలని సూచించారు.