20 నుంచి టీఎస్ పీజీఈసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
Published Wed, Jul 20 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
కేయూక్యాంపస్ : ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఫార్మడి కోర్సులలో ప్రవేశాలకుగాను సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 20వతేదీ నుంచి కాకతీయ యూనివర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్ కార్యాలయంలో ప్రారంభమవుతుందని కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎం.కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఇ.సురేశ్‌బాబు మంగళవారం తెలిపారు.
ఈనెల 20న గేట్, జీపాట్ కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన కోసం హాజరుకావాలన్నారు. పీజీ ఈసెట్ అభ్యర్థులకు ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తామని అన్నారు. ర్యాంకులు, తేదీలు, వారి వివరాలు టీఎస్ పీజీఈసెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400 ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్పెషల్ కేటగిరి, పీహెచ్, ఎన్‌సీసీ కాప్, స్పోర్ట్స్ అభ్యర్థులకు ఈనెల 20న హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపారు. ఈనెల 22 నుంచి వెబ్ ఆప్షన్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చన్నారు.
Advertisement
Advertisement