సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ఈఏపీసెట్)ను మే 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ దీన్‌కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తున్నామన్నారు. ఈసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సిలబస్‌ను వందశాతం అమలు చేస్తామని చెప్పారు.
పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఉంటుందన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్ష (టీఎస్‌పీజీ సెట్)ను జూన్ 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు పీజీ సెట్ కన్వీనర్ డాక్టర్ అరుణకుమారి తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నేతృత్వంలో మంగళవారం సెట్స్ తేదీలు వెల్లడించారు.
మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్‌కే మహ్మమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, జేఎన్‌టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment