చదువుతారా.. ఇంటర్నేషనల్‌ బిజినెస్‌! | IIFT 2022: Exam Date, Registration, Syllabus, Pattern, Selection Process | Sakshi
Sakshi News home page

IIFT 2022: చదువుతారా.. ఇంటర్నేషనల్‌ బిజినెస్‌!

Published Mon, Sep 13 2021 7:17 PM | Last Updated on Mon, Sep 13 2021 7:25 PM

IIFT 2022: Exam Date, Registration, Syllabus, Pattern, Selection Process - Sakshi

మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు క్యాట్‌ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న ప్రవేశ పరీక్ష.. ఐఐఎఫ్‌టీ ఎంబీఏ. ఈ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ)లో.. ఎంబీఏ(ఇంటర్నేషనల్‌ బిజినెస్‌) కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఇటీవల 2022–24 విద్యాసంవత్సరానికి సంబంధించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. ఐఐఎఫ్‌టీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐఐఎఫ్‌టీ ప్రత్యేకత, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం...

అంతర్జాతీయ వాణిజ్యంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు 1963లో స్థాపించిన సంస్థ.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎఫ్‌టీ). ఇది మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ పరిధిలో పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఐఐఎఫ్‌టీ ప్రస్తుతం ఎంబీఏ ఇన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌(ఫుల్‌టైమ్‌), ఎంబీఏ ఇన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌(వీకెండ్‌), ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్స్, ఎంఏ ఎకనామిక్స్, డాక్టోరల్‌ ప్రోగ్రామ్స్, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. (బీమా రంగంలో జాబ్‌ కావాలా.. ఇలా ట్రై చేయండి!)


2002లో ఐఐఎఫ్‌టీకి డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా సైతం లభించింది. అంతేకాకుండా న్యాక్‌.. దీన్ని గ్రేడ్‌ ఏ ఇన్‌స్టిట్యూషన్‌గా గుర్తించింది. ఐఐఎఫ్‌టీకి ఢిల్లీ, కోల్‌కతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. కాకినాడ క్యాంపస్‌లో యూజీసీ /కేంద్ర ప్రభుత్వ అనుమతికి అను గుణంగా ప్రవేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ ఎంబీఏ(ఇంటర్నేషనల్‌ బిజినెస్‌)లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత
► గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచీ కనీసం మూడేళ్ల వ్యవధిగల డిగ్రీ/ తత్సమాన విద్యను 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందినవారు కనీసం 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.

► గ్రాడ్యుయేషన్‌ చివరి ఏడాది చదవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.

► ఈ ఎంట్రెన్స్‌ టెస్ట్‌కు దరఖాస్తుకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.


ఎంపిక ప్రక్రియ

ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌ పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌–సీబీటీ), గ్రూప్‌ డిస్కషన్, రైటింగ్‌ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. (ఈ గురువుల్ని మించిన శిష్యుల కథ తెలుసా?)

ఆన్‌లైన్‌ పరీక్ష
► ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ను ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ)) విధానంలో నిర్వస్తారు.

► మొత్తం నాలుగు విభాగాల నుంచి 110 ప్రశ్నలు–300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. 

► ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు(ఎంసీక్యూ) ఉంటాయి. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.

► నాలుగు విభాగాలు: క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ–25 ప్రశ్నలు, వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌–35 ప్రశ్నలు, లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌–30ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌–20 ప్రశ్నలు.

► నెగిటివ్‌ మార్కులు: మొదటి మూడు సెక్షన్‌లలో ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. 4వ సెక్షన్‌కు సంబంధించి ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కుల చొప్పున కేటాయిస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు.

వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌
► ఈ విభాగం నుంచి మొత్తం 35 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో పెరా ఫార్ములేషన్‌ క్వశ్చన్స్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, సినానిమ్స్‌–ఆంటోనిమ్స్, ప్రిపోజిషన్స్, అనాలజీ, గ్రామర్,స్పెల్లింగ్, మ్యాచింగ్‌ వర్డ్‌ మీనింగ్, పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.

రీడింగ్‌ కాంప్రహెన్షన్‌
► ఈ విభాగం నుంచి నుంచి 14–16 ప్రశ్నలుంటాయి. ఇందులో నాలుగు ప్యాసెజ్‌లలో అడిగిన ప్రశ్నలకు ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. దీనిలో కరెంట్‌ అఫైర్స్, బిజినెస్‌ ఎకానమీ, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు, అంతర్జాతీయ పరిణామాలు–దేశంపై వాటి ప్రభావం తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ
► ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అర్థమెటిక్, సింపుల్‌ ఇంట్రెస్ట్, మ్యాన్‌ డే అండ్‌ వర్క్, రేషియో–ప్రపోర్షన్, పర్సంటేజెస్, ఫిలింగ్‌ ఆఫ్‌ ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇవే కాకుండా.. జామెట్రీ, అల్జీబ్రా, లాగ్, ట్రయాంగిల్, రెక్టాంగ్లర్స్, ప్రాబబిలిటీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

డేటా ఇంటర్‌ప్రిటిషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌
► ఈ విభాగం నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అనాలసిస్‌ అండ్‌ కాంపరేటివ్‌ స్టడీ ఆఫ్‌ డేటాటేబుల్స్, చార్ట్స్‌ అండ్‌ గ్రాఫ్స్‌ విత్‌ టేబుల్స్, పై చార్ట్‌ అండ్‌ టేబుల్, బార్‌ డయాగ్రమ్‌ అండ్‌ కాంపరేటివ్‌ టేబుల్‌ వంటి అంశాలను అడుగుతారు. అలాగే లాజికల్‌ రీజనింగ్‌కు సంబంధించి టీమ్‌ బేస్డ్‌ కొశ్చన్స్, స్టేట్‌మెంట్‌–కంక్లూజన్, కోడింగ్‌–డీకోడింగ్, ఆర్గు్గమెంట్స్, కంక్లూజన్స్, బ్లడ్‌ రిలేషన్స్, క్లాక్, కేలండర్, డైరెక్షన్‌ సెన్స్, సీటింగ్‌ అరెంజ్‌మెంట్స్‌ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు.


జనరల్‌ నాలెడ్జ్‌

► ఈ విభాగం నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కులు కేటాయిస్తారు. ఇందులో మ్యాచింగ్‌ ది లోగోస్, మేక్‌ ఇన్‌ ఇండియా, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్, మ్యాచింగ్‌ స్టాక్‌ మార్కెట్‌ ఆఫ్‌ కంట్రీస్, కరెన్సీ ఆఫ్‌ ది కంట్రీస్, కరెంట్‌ అఫైర్స్, వివిధ రంగాలకు బ్రాండ్‌ అంబాసీడర్లుగా వ్యవహరిస్తున్నవారు, బుక్స్‌ అండ్‌ ఆథర్స్, బిజినెస్‌ అండ్‌ ఎకానమీ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.

దరఖాస్తు ఫీజు
► జనరల్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.2500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. విదేశీ అభ్యర్థులు రూ.15000/200 యూఎస్‌ డాలర్స్‌ దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

ముఖ్యమైన సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15.10.2021
► పరీక్ష తేదీ: 05.12.2021
► పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు;
► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
► వెబ్‌సైట్‌: https://iift.nta.nic.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement