2 వరకు సంగీత పరీక్ష ఫీజు చెల్లింపు గడువు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మే నెలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందు కోసం సర్టిఫికెట్ డిప్లొమా కోర్సుల రెగ్యులర్, ప్రైవేట్ అభ్యర్థులు ఫిబ్రవరి 2వ తేదీ లోగా ఫీజు చెల్లించాలని వర్సిటీ రిజిస్ట్రార్ కె. తోమాసయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గత సెప్టెంబర్ 28న నిర్వహించిన ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్టు ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో సెమిస్టర్ విధానం
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలోనూ సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ కాలేజీల్లో అమలు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఎస్‌క్యూఎఫ్, సీబీసీఎస్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా శుక్రవారం సమావేశ మైంది. అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
15 వరకు ఇగ్నో అడ్మిషన్లకు గడువు
విజయవాడ: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) 2015 సెషన్‌కు జరుగుతున్న అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ గడువును జనవరి 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ బి.రాజగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంబీఏ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
జూలై 2015 సెషన్‌కి ఎంబీఏ ప్రోగ్రామ్ అడ్మిషన్ల ప్రవేశ పరీక్ష (ఓపెన్‌మేట్) కోసం దరఖాస్తు ఫారాలు ఇగ్నో స్టడీ సెంటర్లలో, ఇగ్నో ప్రాంతీయ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ లోపు ఇగ్నో న్యూఢిల్లీ చిరునామాకు అందేలా పంపించాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 15వ తేదీన జరగనుందని తెలిపారు.
విద్యా, పోటీ పరీక్షల సమాచారం
Published Sat, Jan 10 2015 3:03 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement