IGNO
-
గన్ వదిలి పెన్ పట్టిన మావోయిస్టులు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జల్లాలో ఎస్పీ జోగ్గామోహన్ మిన్నా చొరవ మేరకు మావోయిస్టులు దళం వీడి జనజీవన స్రవంతిలో కలిసి గన్నులు వదిలిపెట్టి పెన్నులు చేతబట్టారు. 107మంది మావోయిస్టులు ఎస్పీ ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. వారంతా ఎస్పీ ఆధ్వర్యంలో బ్యాచిలర్ ప్రిపరేషన్ ప్రోగ్రాం(బీపీపీ) కోర్సు పూర్తిచేసి బీఏ, బీకామ్‌లలో డిగ్రీ ప్రవేశాల కోసం శుక్రవారం ఎంట్రన్స్ పరీక్ష రాశారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే వారంతా డిగ్రీలు పూర్తి చేయగలుగుతారని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) రీజనల్ డైరెక్టర్ ఆర్. రాజగోపాల్ తెలిపారు. ఉత్తీర్ణులైన వారందరికీ డిగ్రీ కోర్సు ఉచితంగా చదివిస్తామని ఆయన చెప్పారు. బీపీపీ కోర్సు పూర్తి చేసిన వీరికి ఈ నెల రెండవ తేదీన ఒక పరీక్ష అయింది. శుక్రవారం మరో పరీక్ష నిర్వహించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మావోయిస్టులు గన్లు వదిలిపెడితే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. దళం వదిలి రండి. చైతన్య వంతులు కండి అని పిలుపునిచ్చారు. -
ఉరితీసేలోగా పీజీ పట్టా ఇవ్వలేం
నాగ్‌పూర్: ఈ నెల 30న ఉరిశిక్ష అమలు ఖాయమైన నేపథ్యంలో ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ చివరి కోరిక తీరకుండానే చనిపోనున్నారు. గడిచిన 21 ఏళ్లుగా జైలులోనే ఉన్న ఆయన.. రెండు పీజీ కోర్సులు పూర్తిచేశారు. అరెస్టుకు ముందు ఛార్టర్డ్ అకౌంటెంట్ గా మెమన్ కు మంచి పేరుండేది. జైలులోనూ తన పఠనాసక్తిని కొనసాగించిన ఆయన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులు పాస్ అయ్యారు. చనిపోయేలోగా ఎంఏ ఇంగ్లీష్ పట్టా తీసుకోవాలనుకుంటున్నట్లు మెమన్.. జైలు అధికారులకు చెప్పగా వారు యూనివర్సిటీ అధికారులను సంప్రదించారు. అయితే ఇప్పటికిప్పుడు పీజీ పట్టాలు ఇవ్వలేమని, దానికి కొంత సమయం పడుతుందని, అదికూడా ఈ నెల 30లోగా పట్టా అందించడం అసాధ్యమని ఇగ్నో అధికారులు తేల్చిచెప్పారు. దీంతో ఆఖరి కోరిక తీరకుండానే మెమన్ ఉరి కంబం ఎక్కనున్నారు. -
వానాకాలం చదువుకు తోడు..
ఎన్నికల వ్యయం గురించి చెప్పేవన్నీ సాధారణంగా దొం గలెక్కలే. దీనిని నిరోధించే విషయంలో ఎన్నికల సంఘం కూడా చేతులెత్తేసింది. మరీ విస్తృతంగా కాదు గానీ, వారికి ఉన్న అసలు విద్యార్హతకు మించి లేదా విద్యార్హత సాధిం చడానికి ఉన్న అవకాశానికి మించి అర్హతలు ఉన్నట్టు రాజకీయ నాయకులు చెప్పు కుంటూ ఉంటారు. దీనితో వారంతా విద్యాధికులన్న కృతకమైన గౌరవం కలుగుతూ ఉంటుంది. స్మృతి ఇరానీ ఏల్ డిగ్రీ లేదా డిప్లొమా వివాదం, జితేంద్ర తోమర్ న్యాయశాస్త్ర పట్టా సంగతి మనం విన్నాం. ఆప్ శాసన సభ్యుడు విశేష్ రవి అయితే 2013లో బీకాం పట్ట భద్రుడినని రాశాడు. మళ్లీ 2015లో ఇందిరాగాంధీ సార్వ త్రిక విశ్వవిద్యాలయంలో (ఇగ్నో) బీఏ చదువుతు న్నట్టు పేర్కొన్నారు. నిజానికి మంచి విద్యను వృద్ధి చేసుకో వడానికీ, ఆ రంగంలో మంచి సంప్రదాయాలను అనుస రించడానికీ దోహదం చేసే చట్టాలను నిర్మించుకో వడం లో అలాంటి కపట విద్యాధిక్యత ఏమైనా ఉపయో గపడుతుందా? వాస్తవంగా తన విద్యార్హతలు ఏమిటో దేశానికి నమ్మకం కలిగించేటట్టు చెప్పవలసిన బాధ్యత ఇంకా స్మృతి ఇరానీ మీద ఉంది. సోనియా గాంధీ తన విద్యార్హ తకు సంబంధించి చాలా కాలేజీలు ఉండే కేంబ్రిడ్జ్ పేరు ను అలవోకగా ఉపయోగించుకున్నారు. అబద్ధం చెప్పా డా, లేక బీకాం తరువాత బీఏ చదువుతూ రెండు డిగ్రీల కోసం ప్రయత్నిస్తున్నాడా అనే అంశాన్ని ఆప్ ఎమ్మెల్యే రవి కూడా మనకు చెప్పవలసి ఉంది. ఇటీవల ఇలాంటి వే మహారాష్ట్రలో కొన్ని కేసులు నమోదయ్యాయి. మరో ప్రముఖ రాజకీయ నాయకుడు ఛగన్ భుజ్‌బల్ విద్యార్హ తల మీద ఒక ఉద్యమకారుడు ఎఫ్ఐఆర్ నమో దు చే యించాడు. ఆయన ప్రఖ్యాత విద్యా సంస్థ వీజేటీఐ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పొందినట్టు చెబుతారు. ఇప్పు డు ఆ సంస్థ డీమ్డ్ విశ్వవిద్యాలయం కూడా. అయినా తన వాస్తవ విద్యార్హతలు ఏమిటో భుజ్‌బల్ వెల్లడిం చలే దు. పైగా ఇదంతా రాజకీయ కుట్ర అని కొట్టిపా రేశారు. గోవా మంత్రివర్గ సభ్యుడు రామకృష్ణ ధావ్లికర్ తాను పట్టభద్రుడనని చెప్పుకుంటూనే, ఒక సబ్జెక్ట్‌లో మాత్రమే ఫెయిల్ అయ్యాననీ, అయితే పట్టా మాత్రం ఉందనీ చెబుతారాయన. తాము దాఖలు చేసిన అఫిడవిట్లలో విద్యార్హత గురించి పేర్కొన్న అంశాలలో ఎందుకు వ్యత్యాసాలు ఉన్నాయో దాదాపు ఎనిమిది మంది శాసనసభ్యులు వివరించి చెప్పడం లేదు. గడచిన మూడు ఎన్నికలలో 288 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడ విట్లను విశ్లేషిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ అంశాలను వెల్లడించింది. ఈ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల వారే. బయటకు తెలియని ఇలాం టి కేసులు దేశం నలుమూలలా ఇంకా చాలా ఉంటాయి. దేశంలో పాఠశాల విద్య ఎగుడుదిగుడుగా ఉంది. దీనిని రూపొందించిన వారు, పర్యవేక్షిస్తున్నవారు రాజకీ య నేతలే. ఉత్తరప్రదేశ్ పరీక్షా కేంద్రాలలో బల్ల లూ, ఇన్విజిలేటర్లను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నా రు. అభ్యర్థులు తెరిచిన పుస్తకాలు పెట్టుకుని, మొబైల్ ఫోన్ల సాయంతో నేల మీదే కాళ్లు బారజాపి కూర్చుంటు న్నారు. బిహార్‌లో పరీక్షలకి అంత బాగా సిద్ధం కాలేక పోయిన, లేదా అంత మంచి బోధనకు నోచుకోని అభ్యర్థి కుటుంబ సభ్యులంతా పరీక్షా కేంద్రానికి విచ్చేసి, గోడలెక్కి మరీ విద్యార్థికి సాయమందిస్తున్నారు. ప్రైవేటు విద్య ప్రభుత్వ పాఠశాలలను అణగ దొక్కేసింది. స్కూళ్ల ఇన్స్పెక్టర్ పరిధిలోకి ఎంతమాత్రం చేరని ‘ఇంటర్నేషనల్ స్కూల్స్’ పుట్టగొడుగుల్లా పెరిగి పోయాయి. వాళ్ల పాఠ్య ప్రణాళిక వాళ్లదే. బోధనా పద్ధతు లు, నిబంధనలు కూడా వాళ్లవే. చిరకాలంగా విద్యకు దూరంగా ఉండిపోయిన వర్గాల వారు ఇప్పుడు ఉత్తమ విద్య కోసం వాటి వెంట పడుతున్నారు. మున్సి పల్, ప్రభుత్వ పాఠశాలలు అధ్వానస్థితిలో ఉన్నాయి. లోదు స్తులు మార్చుకోవడానికి కనీస సౌకర్యం కూడా లేకపోవ డంతో బాలికలు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు వారి వాస్తవ విద్యార్హ తలకు మించిన అర్హతలను చూపిస్తున్నారు. ఇదే వింత. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేశ్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
ఇగ్నో ‘రీజినల్’డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి
ఏపీ నుంచి ఈ పదవి చేపట్టిన తొలివ్యక్తిగా వేణుగోపాల్‌రెడ్డి రికార్డు సాక్షి, విజయవాడ బ్యూరో: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) ప్రాంతీయ కేంద్రాల విభాగానికి (రీజినల్ సర్వీసెస్ డివిజన్-న్యూఢిల్లీ) డెరైక్టర్‌గా తెలుగు వ్యక్తి డాక్టర్ వి.వేణుగోపాల్‌రెడ్డి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా వేణుగోపాల్‌రెడ్డి అరుదైన రికార్డును దక్కించుకున్నారు. 2015 మే నుంచి 2018 మే వరకు మూడేళ్లపాటు ఆయన డెరైక్టర్‌గా కొనసాగుతారు. దేశంలోని 67 ప్రాంతీయ కేంద్రాల విద్యార్థి సేవలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోనున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్యారంగానికి సంబంధించిన సేవలను మరింత మెరుగు పరిచేలా కృషి చేస్తానని వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన 1987లో ఇగ్నోలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. అనంతరం రీజినల్ డెరైక్టర్, సీనియర్ రీజినల్ డెరైక్టర్, రీసెర్స్ విభాగం డెరైక్టర్, స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ డెరైక్టర్ బాధ్యతలు నిర్వహించారు. 2012 నుంచి 2014 వరకు విజయవాడ ప్రాంతీయ కేంద్రానికి సంచాలకులుగా పనిచేశారు. -
విద్యా, పోటీ పరీక్షల సమాచారం
2 వరకు సంగీత పరీక్ష ఫీజు చెల్లింపు గడువు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మే నెలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందు కోసం సర్టిఫికెట్ డిప్లొమా కోర్సుల రెగ్యులర్, ప్రైవేట్ అభ్యర్థులు ఫిబ్రవరి 2వ తేదీ లోగా ఫీజు చెల్లించాలని వర్సిటీ రిజిస్ట్రార్ కె. తోమాసయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ ఫలితాలు విడుదల సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గత సెప్టెంబర్ 28న నిర్వహించిన ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ టెస్టు ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో సెమిస్టర్ విధానం సాక్షి, హైదరాబాద్: డిగ్రీలోనూ సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ కాలేజీల్లో అమలు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్ఎస్క్యూఎఫ్, సీబీసీఎస్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా శుక్రవారం సమావేశ మైంది. అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 15 వరకు ఇగ్నో అడ్మిషన్లకు గడువు విజయవాడ: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) 2015 సెషన్‌కు జరుగుతున్న అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ గడువును జనవరి 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ బి.రాజగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం జూలై 2015 సెషన్‌కి ఎంబీఏ ప్రోగ్రామ్ అడ్మిషన్ల ప్రవేశ పరీక్ష (ఓపెన్మేట్) కోసం దరఖాస్తు ఫారాలు ఇగ్నో స్టడీ సెంటర్లలో, ఇగ్నో ప్రాంతీయ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ లోపు ఇగ్నో న్యూఢిల్లీ చిరునామాకు అందేలా పంపించాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 15వ తేదీన జరగనుందని తెలిపారు. -
పరీక్షల కాలం
అర్ధరాత్రి నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ బుధవారం రాత్రి 12 గంటల తరువాత ప్రారంభం అయినట్లు ఎంసెట్-2014 కన్వీనర్ ఎన్వీ రమణారావు తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు వివరాలు, దరఖాస్తుల ప్రక్రియ, ఆన్లైన్ సబ్మిషన్కు సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్సైట్ (ఠీఠీఠీ.్చఞ్ఛ్చఝఛ్ఛ్టి.ౌటజ)లో పొందవచ్చని వివరించారు. 3 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: మార్చి 3 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్లు, హ్యాండ్లూమ్ వీవింగ్ రెండు గ్రేడ్లు, టైలరింగ్ రెండు గ్రేడ్ల పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులు ఠీఠీఠీ.ఛట్ఛ్చఞ.ౌటజ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పంచాయతీ కార్యదర్శి పరీక్షకు ఏర్పాట్లు పూర్తి సాక్షి, హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీలో భాగంగా రాత పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అవసరమైన సామగ్రిని ఇప్పటికే జిల్లాలకు పంపించింది. రెండుసార్లు దరఖాస్తు చేసిన 2,500కు పైగా అభ్యర్థుల దరఖాస్తుల్లో ఒక దానిని తిరస్కరించినట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపారు. సీమాంధ్రలో ఉద్యోగులు సమ్మె విరమించడంతో 23వ తేదీన పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇగ్నోలో ప్రవేశాలకు 23న రాత పరీక్ష సాక్షి, హైదరాబాద్: మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, ఎంఫిల్, పీహెచ్‌డీల్లో ప్రవేశాల కోసం ఈనెల 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ డెరైక్టర్ కామేశ్వరి మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని చెప్పారు. హాల్‌టికెట్లను ఠీఠీఠీ.జీజౌఠ.్చఛి.జీ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.