అర్ధరాత్రి నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ బుధవారం రాత్రి 12 గంటల తరువాత ప్రారంభం అయినట్లు ఎంసెట్-2014 కన్వీనర్ ఎన్‌వీ రమణారావు తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు వివరాలు, దరఖాస్తుల ప్రక్రియ, ఆన్‌లైన్ సబ్మిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్ (ఠీఠీఠీ.్చఞ్ఛ్చఝఛ్ఛ్టి.ౌటజ)లో పొందవచ్చని వివరించారు.
3 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: మార్చి 3 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్లు, హ్యాండ్లూమ్ వీవింగ్ రెండు గ్రేడ్లు, టైలరింగ్ రెండు గ్రేడ్ల పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులు ఠీఠీఠీ.ఛట్ఛ్చఞ.ౌటజ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
పంచాయతీ కార్యదర్శి పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీలో భాగంగా రాత పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అవసరమైన సామగ్రిని ఇప్పటికే జిల్లాలకు పంపించింది. రెండుసార్లు దరఖాస్తు చేసిన 2,500కు పైగా అభ్యర్థుల దరఖాస్తుల్లో ఒక దానిని తిరస్కరించినట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపారు. సీమాంధ్రలో ఉద్యోగులు సమ్మె విరమించడంతో 23వ తేదీన పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇగ్నోలో ప్రవేశాలకు 23న రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్, ఎంఫిల్, పీహెచ్‌డీల్లో ప్రవేశాల కోసం ఈనెల 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ డెరైక్టర్ కామేశ్వరి మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని చెప్పారు. హాల్‌టికెట్లను ఠీఠీఠీ.జీజౌఠ.్చఛి.జీ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
పరీక్షల కాలం
Published Thu, Feb 20 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement