
నిండా ముంచిన నిమిషం
నిమిషం.. కేవలం ఒకే ఒక్క నిమిషం కొందరు విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసింది.. శుక్రవారం జరిగిన ఎంసెట్ పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించలేదు.. కాళ్లా..వేళ్లా..పడ్డా కనికరించలేదు. కొన్నిపరీక్షా కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. పరీక్షా కేంద్రం వద్దకు వచ్చిన తల్లిదండ్రులు చెట్ల కింద సేదతీరారు.