వానాకాలం చదువుకు తోడు..
ఎన్నికల వ్యయం గురించి చెప్పేవన్నీ సాధారణంగా దొం గలెక్కలే. దీనిని నిరోధించే విషయంలో ఎన్నికల సంఘం కూడా చేతులెత్తేసింది. మరీ విస్తృతంగా కాదు గానీ, వారికి ఉన్న అసలు విద్యార్హతకు మించి లేదా విద్యార్హత సాధిం చడానికి ఉన్న అవకాశానికి మించి అర్హతలు ఉన్నట్టు రాజకీయ నాయకులు చెప్పు కుంటూ ఉంటారు. దీనితో వారంతా విద్యాధికులన్న కృతకమైన గౌరవం కలుగుతూ ఉంటుంది. స్మృతి ఇరానీ ఏల్ డిగ్రీ లేదా డిప్లొమా వివాదం, జితేంద్ర తోమర్ న్యాయశాస్త్ర పట్టా సంగతి మనం విన్నాం. ఆప్ శాసన సభ్యుడు విశేష్ రవి అయితే 2013లో బీకాం పట్ట భద్రుడినని రాశాడు. మళ్లీ 2015లో ఇందిరాగాంధీ సార్వ త్రిక విశ్వవిద్యాలయంలో (ఇగ్నో) బీఏ చదువుతు న్నట్టు పేర్కొన్నారు. నిజానికి మంచి విద్యను వృద్ధి చేసుకో వడానికీ, ఆ రంగంలో మంచి సంప్రదాయాలను అనుస రించడానికీ దోహదం చేసే చట్టాలను నిర్మించుకో వడం లో అలాంటి కపట విద్యాధిక్యత ఏమైనా ఉపయో గపడుతుందా?
వాస్తవంగా తన విద్యార్హతలు ఏమిటో దేశానికి నమ్మకం కలిగించేటట్టు చెప్పవలసిన బాధ్యత ఇంకా స్మృతి ఇరానీ మీద ఉంది. సోనియా గాంధీ తన విద్యార్హ తకు సంబంధించి చాలా కాలేజీలు ఉండే కేంబ్రిడ్జ్ పేరు ను అలవోకగా ఉపయోగించుకున్నారు. అబద్ధం చెప్పా డా, లేక బీకాం తరువాత బీఏ చదువుతూ రెండు డిగ్రీల కోసం ప్రయత్నిస్తున్నాడా అనే అంశాన్ని ఆప్ ఎమ్మెల్యే రవి కూడా మనకు చెప్పవలసి ఉంది. ఇటీవల ఇలాంటి వే మహారాష్ట్రలో కొన్ని కేసులు నమోదయ్యాయి. మరో ప్రముఖ రాజకీయ నాయకుడు ఛగన్ భుజ్‌బల్ విద్యార్హ తల మీద ఒక ఉద్యమకారుడు ఎఫ్‌ఐఆర్ నమో దు చే యించాడు. ఆయన ప్రఖ్యాత విద్యా సంస్థ వీజేటీఐ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పొందినట్టు చెబుతారు. ఇప్పు డు ఆ సంస్థ డీమ్డ్ విశ్వవిద్యాలయం కూడా. అయినా తన వాస్తవ విద్యార్హతలు ఏమిటో భుజ్‌బల్ వెల్లడిం చలే దు. పైగా ఇదంతా రాజకీయ కుట్ర అని కొట్టిపా రేశారు. గోవా మంత్రివర్గ సభ్యుడు రామకృష్ణ ధావ్లికర్ తాను పట్టభద్రుడనని చెప్పుకుంటూనే, ఒక సబ్జెక్ట్‌లో మాత్రమే ఫెయిల్ అయ్యాననీ, అయితే పట్టా మాత్రం ఉందనీ చెబుతారాయన.
తాము దాఖలు చేసిన అఫిడవిట్లలో విద్యార్హత గురించి పేర్కొన్న అంశాలలో ఎందుకు వ్యత్యాసాలు ఉన్నాయో దాదాపు ఎనిమిది మంది శాసనసభ్యులు వివరించి చెప్పడం లేదు. గడచిన మూడు ఎన్నికలలో 288 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడ విట్లను విశ్లేషిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ అంశాలను వెల్లడించింది. ఈ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల వారే. బయటకు తెలియని ఇలాం టి కేసులు దేశం నలుమూలలా ఇంకా చాలా ఉంటాయి.
దేశంలో పాఠశాల విద్య ఎగుడుదిగుడుగా ఉంది. దీనిని రూపొందించిన వారు, పర్యవేక్షిస్తున్నవారు రాజకీ య నేతలే. ఉత్తరప్రదేశ్ పరీక్షా కేంద్రాలలో బల్ల లూ, ఇన్విజిలేటర్లను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నా రు. అభ్యర్థులు తెరిచిన పుస్తకాలు పెట్టుకుని, మొబైల్ ఫోన్ల సాయంతో నేల మీదే కాళ్లు బారజాపి కూర్చుంటు న్నారు. బిహార్‌లో పరీక్షలకి అంత బాగా సిద్ధం కాలేక పోయిన, లేదా అంత మంచి బోధనకు నోచుకోని అభ్యర్థి కుటుంబ సభ్యులంతా పరీక్షా కేంద్రానికి విచ్చేసి, గోడలెక్కి మరీ విద్యార్థికి సాయమందిస్తున్నారు.
ప్రైవేటు విద్య ప్రభుత్వ పాఠశాలలను అణగ దొక్కేసింది. స్కూళ్ల ఇన్‌స్పెక్టర్ పరిధిలోకి ఎంతమాత్రం చేరని ‘ఇంటర్నేషనల్ స్కూల్స్’ పుట్టగొడుగుల్లా పెరిగి పోయాయి. వాళ్ల పాఠ్య ప్రణాళిక వాళ్లదే. బోధనా పద్ధతు లు, నిబంధనలు కూడా వాళ్లవే. చిరకాలంగా విద్యకు దూరంగా ఉండిపోయిన వర్గాల వారు ఇప్పుడు ఉత్తమ విద్య కోసం వాటి వెంట పడుతున్నారు. మున్సి పల్, ప్రభుత్వ పాఠశాలలు అధ్వానస్థితిలో ఉన్నాయి. లోదు స్తులు మార్చుకోవడానికి కనీస సౌకర్యం కూడా లేకపోవ డంతో బాలికలు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు వారి వాస్తవ విద్యార్హ తలకు మించిన అర్హతలను చూపిస్తున్నారు. ఇదే వింత.
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
- మహేశ్ విజాపుర్కార్
ఈమెయిల్: mvijapurkar@gmail.com)