ఏపీ నుంచి ఈ పదవి చేపట్టిన తొలివ్యక్తిగా వేణుగోపాల్‌రెడ్డి రికార్డు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) ప్రాంతీయ కేంద్రాల విభాగానికి (రీజినల్ సర్వీసెస్ డివిజన్-న్యూఢిల్లీ) డెరైక్టర్‌గా తెలుగు వ్యక్తి డాక్టర్ వి.వేణుగోపాల్‌రెడ్డి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా వేణుగోపాల్‌రెడ్డి అరుదైన రికార్డును దక్కించుకున్నారు. 2015 మే నుంచి 2018 మే వరకు మూడేళ్లపాటు ఆయన డెరైక్టర్‌గా కొనసాగుతారు.
దేశంలోని 67 ప్రాంతీయ కేంద్రాల విద్యార్థి సేవలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోనున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్యారంగానికి సంబంధించిన సేవలను మరింత మెరుగు పరిచేలా కృషి చేస్తానని వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన 1987లో ఇగ్నోలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. అనంతరం రీజినల్ డెరైక్టర్, సీనియర్ రీజినల్ డెరైక్టర్, రీసెర్స్ విభాగం డెరైక్టర్, స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ డెరైక్టర్ బాధ్యతలు నిర్వహించారు. 2012 నుంచి 2014 వరకు విజయవాడ ప్రాంతీయ కేంద్రానికి సంచాలకులుగా పనిచేశారు.
ఇగ్నో ‘రీజినల్’డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి
Published Sun, May 17 2015 8:06 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM
Advertisement