Venugopala reddy
-
విలీనం బాగుంటేనే ఫలితాలు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్‌లో విలీనాలకు తగిన సమర్థవంతమైన, పటిష్ట విధానాలు అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ వై వేణుగోపాల రెడ్డి పేర్కొన్నారు. ఆశించిన ఫలితాలు రావాలంటే ‘తగిన’ బ్యాంకింగ్ విలీన విధానం అవసరమని ఆయన సూచించారు. అసోచామ్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన జేఆర్డీ టాటా స్మారక ఉపన్యాసం చేశారు. ‘ఒక బలహీన బ్యాంక్‌ను ఒక పటిష్ట బ్యాంకుతో విలీనం చేసినంత మాత్రాన తగిన ఫలితం వచ్చేస్తుందనుకుంటే పొరపాటు. బలహీన బ్యాంకుకు వ్యవస్థాగత సమస్యలు ఉంటే ఈ విలీనంతో అవి పరిష్కారం అయిపోవు. బలహీన బ్యాంక్ పటిష్ట బ్యాంకుగా మారిపోదు’ అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. బ్యాంకింగ్ విలీనాలకు సంబంధించిన ప్రణాళికలను సూత్రప్రాయ ఆమోదం కోసం త్వరలో ఆయా అంశాలను సమీక్షిస్తున్న ఆల్టర్నేటివ్ మెకానిజమ్ (ఏఎం) ప్యానల్ ముందు ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికశాఖ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో వైవీ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ప్యానల్‌కు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వం వహిస్తునారు. వడ్డీరేట్లు మరింత తగ్గింపుతో కష్టమే ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీరేటు మరింత తగ్గించే అవకాశాలు లేవని కూడా ఆయన వై.వి.రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ధోరణి బ్యాంకింగ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నా రు. ‘‘బ్యాంకుల్లో ప్రజలు డిపాజిట్లు చేయకపోతే రుణ మంజూరీలు కష్టమవుతాయి. ఎన్ఆర్ఐ పొదుపుల జమ తగ్గిపోతే, కరెంట్ అకౌంట్ లోటు కూడా ప్రతికూలంగా మారుతుంది’’ అని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఇదంతా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని ఆర్బీఐ మాజీ గవర్నర్ అభిప్రాయపడ్డారు. -
నేటి నుంచి పీజీఈసెట్
సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌లో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర పీజీ ఈసెట్-2015 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు హైదరాబాద్, వరంగల్ ప్రాంతీయ సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని టీఎస్ పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 18 విభాగాల్లో దాదాపు 49 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వివరించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అభ్యర్థులను అనుమతించమన్నారు. హెల్ప్‌డెస్క్ (040-27097124, 9160815762) కూడా ఏర్పాటు చేశామన్నారు. -
ఇగ్నో ‘రీజినల్’డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి
ఏపీ నుంచి ఈ పదవి చేపట్టిన తొలివ్యక్తిగా వేణుగోపాల్‌రెడ్డి రికార్డు సాక్షి, విజయవాడ బ్యూరో: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) ప్రాంతీయ కేంద్రాల విభాగానికి (రీజినల్ సర్వీసెస్ డివిజన్-న్యూఢిల్లీ) డెరైక్టర్‌గా తెలుగు వ్యక్తి డాక్టర్ వి.వేణుగోపాల్‌రెడ్డి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా వేణుగోపాల్‌రెడ్డి అరుదైన రికార్డును దక్కించుకున్నారు. 2015 మే నుంచి 2018 మే వరకు మూడేళ్లపాటు ఆయన డెరైక్టర్‌గా కొనసాగుతారు. దేశంలోని 67 ప్రాంతీయ కేంద్రాల విద్యార్థి సేవలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోనున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్యారంగానికి సంబంధించిన సేవలను మరింత మెరుగు పరిచేలా కృషి చేస్తానని వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన 1987లో ఇగ్నోలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. అనంతరం రీజినల్ డెరైక్టర్, సీనియర్ రీజినల్ డెరైక్టర్, రీసెర్స్ విభాగం డెరైక్టర్, స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ డెరైక్టర్ బాధ్యతలు నిర్వహించారు. 2012 నుంచి 2014 వరకు విజయవాడ ప్రాంతీయ కేంద్రానికి సంచాలకులుగా పనిచేశారు. -
త్వరలో ఇంటర్-వర్సిటీ బోర్డు
సాక్షి, హైదరాబాద్: వర్సిటీల్లో పాలన, విద్యాపరమైన అంశాల్లో మార్గదర్శనం చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఇంటర్-యూనివర్సిటీ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) తొలిసారిగా రూపొందించిన విద్యామండలి గణాంక పుస్తకాన్ని, ఆధునీకరించిన వెబ్‌సైట్‌ను చైర్మన్ వేణుగోపాలరెడ్డి గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కొత్త విధానాలను రూపకల్పన చేస్తున్నామన్నారు. -
పది కాలేజీలలో '0' అడ్మిషన్
హైదరాబాద్: రెండు రాష్ట్రాలలోని పది ఇంజనీరింగ్ కాలేజీలలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఎంసెట్ విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తి అయిందన్నారు. కన్వీనర్ కోటాలో 103 కాలేజీల్లో వంద శాతం అడ్మిషన్లు జరిగినట్లు తెలిపారు. న్యాయ సలహా మేరకు రెండవ దశ అడ్మిషన్లపై నిర్ణయం తీసుకుంటామని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ** -
కౌన్సెలింగ్‌పై నిర్ణయాధికారం మండలిదే
ఆలస్యంపై కారణాలను సుప్రీంకోర్టుకు చెబుతాం: చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ముందుకే సాగాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈనెల 30న నోటిఫికేషన్ జారీ చేసి, 7వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసేందుకు సిద్ధమైంది. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో అనంతరం ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుతో సమావేశం తర్వాత ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడి ్డ విలేకరులతో మాట్లాడారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌పై నిర్ణయాధికారం ఉన్నత విద్యామండలికే ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఆగస్టు 1 నాటికి తరగతులు ప్రారంభించాల్సి ఉందని, ఆగస్టు 15 తరువాత ఎలాంటి ప్రవేశాలు చేపట్టవద్దని పేర్కొందని వివరించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, వివిధ సంఘాల నేతలు కౌన్సెలింగ్ త్వరగా చేపట్టాలని కోరుతున్నారని చెప్పారు. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరాల్సిన ఈసెట్ విద్యార్థులు నష్టపోతున్నారని వివరించారు. సుప్రీంకోర్టు కౌన్సెలింగ్‌ను ఆపాలని చెప్పలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహణ, ప్రవేశాల అధికారం పదేళ్లపాటు ఉన్నత విద్యా మండలికే ఉందన్నారు. మేమూ ఇంప్లీడ్ అవుతాం... 4వ తేదీలోగా సుప్రీంకోర్టులో తామూ ఇంప్లీడ్ అవుతామని చైర్మన్ వివరించారు. ప్రవేశాల ఆలస్యానికి కారణాలను కోర్టుకు తె లియజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రవేశాల కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని విలేకరులు ప్రశ్నించగా, వేణుగోపాల్‌రెడ్డి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. కాగా, సోమవారం జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలోనూ ఎక్కువమంది సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు ఆలస్యంగా తెలిసింది. ఎంసెట్ కమిటీలో మొత్తం 12 మంది ఉండగా, సమావేశానికి 9 మందే హాజరయ్యారు. వారిలో ఐదుగురు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్ణయాన్ని, నోటిఫికేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు తెలిసింది. అయినా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా, మండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డితో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ ఫోన్లో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. -
వెబ్సైట్లో జవాబు పత్రాలు
బీటెక్, ఎంటెక్ మూల్యాంకనంలో సంస్కరణలు ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే ఆప్షన్ల నమోదుపై పునరాలోచన ఇంటర్ మార్కులతో మేనేజ్మెంట్ కోటా భర్తీపై తీసుకోని నిర్ణయం వెబ్సైట్లో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల ఓఎంఆర్ జవాబు పత్రాలు సాక్షి, హైదరాబాద్: బీటెక్, ఎంటెక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బీటెక్, ఎంటెక్‌లలో ఆన్లైన్లో మూల్యాంకన విధానాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తేనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు ఫలితాల అనంతరం విద్యార్థుల జవాబు పత్రాలను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నామని, తద్వారా పరీక్షలు, మూల్యాంకనంలో పారదర్శకత కు పెద్దపీట వేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు తాము రాసిన జవాబు పత్రాలు, తమకు వచ్చిన మార్కులను చూసుకునే సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. ఈసారి ఎంసెట్ సహా ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్ తదితర అన్ని రకాల ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు ఓఎంఆర్ జవాబు పత్రాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఉన్నత విద్య, పరీక్షల నిర్వహణలో తీసుకురానున్న మార్పులను సోమవారం ఆయన వెల్లడించారు. హైదరాబాద్ జేఎన్టీయూ సహా అన్ని కాలేజీల్లో నిర్వహిస్తున్న బీటెక్, ఎంటెక్ కోర్సుల పరీక్షల్లో ఆన్లైన్ మాల్యాంకనం అమలు చేస్తామని, దీనిపై ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. ఇంటర్ మార్కులతోనే ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేయాలన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వానికి సిఫారసు చేయలేదని మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. దీనిపై చర్చ జరిగిందని, అదీ 5 శాతం సీట్ల భర్తీ ఎలాగన్న అంశంపైనే చర్చించినట్లు తెలిపారు. ఇదీ ఆన్లైన్ విధానం: పరీక్షలకు హాజరైన విద్యార్థుల జవాబు పత్రాలు అన్నింటినీ మొదట స్కాన్ చేస్తారు. వాటిని మూల్యాంకన కేంద్రాలకు ఆన్లైన్లోనే పంపుతారు. మూల్యాంకనం చేసే ఫ్యాకల్టీ విద్యార్థి రాసిన జవాబులను ఆన్లైన్లోనే చదివి మార్కులను ఆన్లైన్లోనే అప్లోడ్ చేస్తారు. అలాగే ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థి రాసిన జవాబులను ఆన్లైన్లోనే వేరు చేస్తారు. అలా వేరు చేసిన జవాబుల్లో ఒకే నంబర్ గల జవాబులను మూల్యాకనం కోసం ఆన్లైన్లోనే ఒక ఫ్యాకల్టీకి కేటాయిస్తారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో జవాబులను వేరు చేయడం, మూల్యాంకనం తరువాత సదరు విద్యార్థికి సంబంధించిన అన్ని ప్రశ్నల జవాబులను మళ్లీ క్రోడీకరించడం, వాటికి కేటాయించిన మొత్తం మార్కులను కలపడం జరుగుతుంది. ఇక ఫలితాల వెల్లడి తర్వాత ఆ జవాబు పత్రాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. తద్వారా విద్యార్థి తన జవాబుపత్రం, తనకు వచ్చిన మార్కులను ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లపై పునరాలోచన ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే (హెచ్ఎల్సీ) వెబ్ ఆప్షన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయంపై అధికారులు పునరాలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హెల్ప్‌లైన్ కేంద్రాల సంఖ్య పెంచడం, వాటిల్లో పనిచేసేందుకు 2,500 మందికి పైగా ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందితో దళారులు కుమ్మైక్కై విద్యార్థుల పాస్వర్డ్ తీసుకుంటే ఎలాగన్న కోణంలో ఆలోచిస్తున్నారు. త్వరలో దీనిపై మరోసారి చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు. -
ఉన్నత విద్యాభివృద్ధికి ‘రూసా’ సాయం
వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకం అమలుపై వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశం శనివారం జరిగింది. సమావేశంలో పథకం అమలుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన మార్గదర్శకాలను విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి వివరించారు. యూనివర్సిటీలు తమ ప్రతిపాదనలకు సంబంధించి అనుమానాలు ఉంటే డిసెంబర్ 13న జరిగే సమావేశంలో నివృత్తి చేసుకుని డిసెంబర్ 20లోపు సమర్పించాలని ఉపకులపతులను కోరారు. వాటిని క్రోడీకరించి రాష్ట్ర సమగ్ర నివేదికను జనవరి 10లోగా కేంద్రానికి సమర్పిస్తామన్నారు. ఫిబ్రవరి 28 లోగా రాష్ట్ర ప్రతిపాదనలు ఆమోదం పొందితే.. ఏప్రిల్ 15 నాటికి కేంద్రం నిధులు విడుదల చేస్తుందని వివరించారు. అనంతరం రాష్ట్ర వాటా ఏప్రిల్ 30లోగా విడుదల చేయాల్సి ఉంటుందని తెలిపారు. రూసా పథకంలో చేపట్టే పనుల్లో.. 18 అంశాల్లో పనులకు సంబంధించి నిధుల కేటాయింపు, 500లకు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంపునకు నిధుల ఖర్చు, 12బీ, 2ఎఫ్ గుర్తింపు కలిగి ఉన్న, లేకున్నా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కళాశాలల అభివృద్ధి, ఎయిడెడ్ కళాశాలలకు మౌలిక వసతులు కల్పన వంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంతేగాక అటానమస్ కళాశాలలను వర్శిటీలుగా అప్‌గ్రేడ్ చేయడం, క్లస్టర్ కళాశాలలను కలుపుతూ వర్శిటీల ఏర్పాటు, మౌలిక వసతుల కోసం ఒక్కో వర్శిటీకి రూ. 20 కోట్లు కేటాయించడం, మోడల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేయడం, ప్రస్తుతమున్న డిగ్రీ కళాశాలలను మోడల్ డిగ్రీ కళాశాలలుగా అభివృద్ధిపరచడం, పదేళ్ల కాలంలో 40 అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు, తదితర అంశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ పథకం కింద వచ్చే మూడేళ్లలో రాష్ట్రానికి రూ. వెయ్యికోట్లకు పైగా నిధులు దక్కనున్నాయి. ఈ సమావేశంలో ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్ జైన్, మాధ్యమిక విద్య కమిషనర్ అదర్‌సిన్హా, ఉన్నత విద్య ప్రత్యేక కార్యదర్శి ఆర్.ఎం.డోబ్రియాల్, మండలి వైస్ చైర్మన్ విజయ్‌ప్రకాశ్, కార్యదర్శి సతీష్‌రెడ్డి, అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొన్నారు.