
వేణుగోపాల్ రెడ్డి
హైదరాబాద్: రెండు రాష్ట్రాలలోని పది ఇంజనీరింగ్ కాలేజీలలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఎంసెట్ విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తి అయిందన్నారు.
కన్వీనర్ కోటాలో 103 కాలేజీల్లో వంద శాతం అడ్మిషన్లు జరిగినట్లు తెలిపారు. న్యాయ సలహా మేరకు రెండవ దశ అడ్మిషన్లపై నిర్ణయం తీసుకుంటామని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.
**