నేటి నుంచి పీజీఈసెట్ | PGECET 2015 exams to be held from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పీజీఈసెట్

Published Thu, Jun 4 2015 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

PGECET 2015 exams to be held from today

సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌లో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర పీజీ ఈసెట్-2015 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు హైదరాబాద్, వరంగల్ ప్రాంతీయ సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని టీఎస్ పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 18 విభాగాల్లో దాదాపు 49 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వివరించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అభ్యర్థులను అనుమతించమన్నారు. హెల్ప్‌డెస్క్ (040-27097124, 9160815762) కూడా ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement