
సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పీజీఈసెట్ కౌన్సెలింగ్ ఈనెల19 నుంచి ప్రారంభం కానున్నది. ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి అధ్యక్షతన పీజీఈసెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా అడ్మిషన్ల షెడ్యూల్‌పై చర్చించారు.
ఈ నెల 30లోగా ఆన్‌లైన్ వెరిఫికేషన్‌కోసం సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని అడ్మిషన్ల కన్వీనర్ రమేశ్‌బాబు తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి సమర్పించాలని సూచించారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment