PGECET
-
ఒక్క క్లిక్‌తో టీజీ పీజీఈసెట్ రిజల్ట్.. డైరెక్ట్ లింక్ ఇదే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూహెచ్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి ఫలితాలను చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20,626 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా, జూన్ 10 నుంచి 13 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. కేవలం నాలుగు రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశారు.టీజీ పీజీఈసెట్ ఫలితాలు రిజల్ట్ కోసం క్లిక్ చేయండి -
పీజీ సెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పీజీఈ సెట్–2023 షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. జేఎన్టీయూహెచ్ ఈ పరీక్షను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కోసం ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. రూ.1,100 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ.600)తో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాల కోసం https:// pgecet.tsche.ac.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలని ఆయన సూచించారు. -
పీజీఈసెట్ కౌన్సెలింగ్ 19 నుంచి
సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పీజీఈసెట్ కౌన్సెలింగ్ ఈనెల19 నుంచి ప్రారంభం కానున్నది. ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి అధ్యక్షతన పీజీఈసెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా అడ్మిషన్ల షెడ్యూల్‌పై చర్చించారు. ఈ నెల 30లోగా ఆన్లైన్ వెరిఫికేషన్‌కోసం సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని అడ్మిషన్ల కన్వీనర్ రమేశ్‌బాబు తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి సమర్పించాలని సూచించారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. -
పీజీఈసెట్‌లో 91.48% ఉత్తీర్ణత
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఎం.టెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్ 2022)లో 91.48 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆగస్టు 2 నుంచి 5 వరకు జరిగిన ఈ పరీక్షలకు 12,592 మంది విద్యార్థులు హాజరుకాగా, 11,520 మంది అర్హత సాధించారు. అందులో 6,440 మంది అమ్మాయిలు, 5,080 మంది అబ్బాయిలు ఉన్నారు. శనివారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆర్.లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డి.రవీందర్, రిజిస్ట్రార్, పీజీఈసెట్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ రాజశేఖర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 19 సబ్జెక్టులకు పీజీఈసెట్ పరీక్ష నిర్వహించినట్లు కన్వీనర్ లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ పరీక్ష ద్వారా 115 కోర్సులలో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పీజీఈసెట్‌లో అమ్మాయిల ఉత్తీర్ణత 93 శాతంగా నమోదు కాగా, అబ్బాయిల ఉత్తీర్ణత 89.62 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఫార్మసీలో అధికం పీజీఈసెట్‌కు హాజరైన వారిలో ఫార్మసీ విద్యార్థులే అధికంగా ఉన్నారు. ఈ పరీక్షకు మొత్తం 12,592 మంది హాజరుకాగా, అందులో 5,452మంది కేవలం ఫార్మసీ విద్యార్థులే ఉన్నారు. వారిలో 5,186 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి 2,027మంది పరీక్షకు హాజరుకాగా, 1,782 మంది అర్హత సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 1,279 మంది హాజరుకాగా,1,211 మంది ఉత్తీర్ణత సాధించారు. -
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలకు రీషెడ్యూల్.. తేదీలివే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాయిదాపడిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు, టీఎస్ ఈసెట్, టీఎస్ పీజీఈసెట్ పరీక్షలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి రీ షెడ్యూల్ ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్లో మార్పులను అభ్యర్థులు గమనించాలని కోరింది. హాల్ టికెట్స్‌ను త్వరలో డౌన్లోడ్ చేసుకునేందుకు సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీలు.. 1. టీఎస్ ఎంసెట్ (అగ్రికల్చర్&మెడికల్)-జులై 30 మరియు 31 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 2. టీఎస్ ఈసెట్ ఆగస్టు 1న ఉదయం 9 నుంచి 12 మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 3. టీఎస్ పీజీఈసెట్- ఆగస్టు 2 నుంచి 5 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు -
నవంబర్ 1 నుంచి ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: మహత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద నవంబర్ 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణకు తుది గడువుగా నిర్దేశించగా.. దరఖాస్తులను ఈపాస్ వెబ్సైట్ ద్వారా సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. (చదవండి: వచ్చే నెలలో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్) పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు టీఎస్ పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 25 వరకు పెంచినట్లు సెట్ కన్వీనర్ పి.రమేశ్‌బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఫార్మా డీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్‌లో 17,628 అర్హత సాధించారు. వీరిలో ఇప్పటివరకు 7,500 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వెబ్ఆప్షన్స్ ఈ నెల 29 నుంచి 31 వరకు ఉంటాయని తెలిపారు. నవంబర్ 3వ తేదీన తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుందని, 4 నుంచి 12వ తేదీ వరకూ అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని స్పష్టం చేశారు. వచ్చే నెల 15 నుంచి క్లాసులు మొదలవుతాయని పేర్కొన్నారు. ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి బాలికల ప్రవేశాలకు నోటిఫికేషన్ డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి బాలికల ప్రవేశాలకు టీఎస్పీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2009 జూలై2 నుంచి 2011 జనవరి 1 మధ్య జన్మించిన బాలికలు మాత్రమే ఈ పరీక్షకు అర్హులని పేర్కొంది. దరఖాస్తులను నవంబర్15లోగా సమర్పించాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 18న హైదరాబాద్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రాంచంద్రన్ తెలిపారు. (చదవండి: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తనయుడి నిర్వాకం.. పెళ్లి పేరుతో!) -
తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మా ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదలయింది. ఈ మేరకు మార్చి 3న పీజీ ఈసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. అప్లికేషన్‌ను ఆన్లైన్లోనే దరఖాస్తూ చేసుకోవాల్సిందిగా అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. పీజీ ఈసెట్ నోటిఫికేషన్ జారీ : మార్చి 3, 2020 ఆన్లైన్లో అప్లికేషన్ ప్రారంభ తేది : మార్చి 12.2020 అప్లికేషన్ గడువుకు చివరి తేది : ఏప్రిల్ 30, 2020 ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణ గడువు : మే 26,2020 హాల్ టికెట్ల డౌన్లోడ్ : మే 20 నుంచి 27 మే వరకు పరీక్ష తేదీలు : మే 28 నుంచి 31మే వరకు పరీక్షా ఫలితాలు : జూన్ 15, 2020 -
పీజీఈసెట్‌లో 88.27% అర్హత
సాక్షి, హైదరాబాద్: ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఎంప్లానింగ్, ఫార్మ్–డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఈ ఫలితాలను చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. 19 రకాల సబ్జెక్టుల్లో పీజీ ప్రవేశాలకు ఈ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. సబ్జెక్టుల వారీగా టాపర్ల వివరాలను వెల్లడించారు. ఈ ఫలితాలను https://pgecet.tsche.ac.in వెబ్సైట్లో పొందవచ్చని తెలిపారు. గత నెల 28 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు రాష్ట్రవ్యాప్తంగా 20,415 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 17,722 మంది హాజరయ్యారని చెప్పారు. వారిలో 15,644 మంది (88.27 శాతం) అర్హత సాధించారని తెలిపారు. ఇంజనీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల ప్రవేశా ల్లో ముందుగా గేట్, జీప్యాట్‌లో అర్హ త సాధించిన వారికి ప్రవేశాలు కల్పిస్తామని, ఆ తర్వాత పీజీఈసెట్ వారి కి ప్రవేశాలుంటాయని ఉస్మానియా వర్సిటీ వీసీ రామచంద్రం తెలిపారు. జూలైలో ప్రవేశాల కౌన్సెలింగ్.. ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ జూలైలో ఉంటుందని పీజీఈసెట్ కన్వీనర్ కుమార్ తెలిపారు. ఈ నెలాఖరుకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక ప్రవేశాల కమిటీ సమావేశమై కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆర్.లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ : ఏపీ పీజీ ఈసెట్-2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు విడుదల చేశారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 24,248మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫలితాల్లో 20,986 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ నెల 20 నుంచి ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని విజయరాజు తెలిపారు. 12 ఇంజినీరింగ్ పీజీ కోర్సులు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలోనే కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్రంలో వివిద కాలేజీలలో ఉన్న 21,941 ఎంటెక్, 5495 ఎంఫార్మసీ సీట్లను మెరిట్ ప్రకారం కేటాయించనున్నారు. సబ్జెక్టుల వారిగా మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు బయోటెక్ - పి.షామారజిత, ఈస్ట్ గోదావరి కెమికల్ ఇంజనీరింగ్ - ఏ వేదశ్రీ, నెల్లూరు జిల్లా సివిల్ ఇంజనీరింగ్ - మహంతి అంజనీబాయ్, గుంటూరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ - కెహెచ్ఎన్ సీతారాగిని, గుంటూరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - ఎం.జ్యోష్న, కడప ఎలక్ట్రానిక్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్ - టి.మహేంద్ర, ప్రకాశం ఫుడ్ టెక్నాలజీ - పి.రవళి, వెస్ట్ గోదావరి జియో ఇంజనీరింగ్ - ఎ.రవితేజ, కృష్ణా ఇనుస్టుమెంటేషన్ ఇంజనీరింగ్ - ఎస్ఎన్.సింధూరీ, కృష్ణా మెకానికల్ ఇంజనీరింగ్ - ఎ.సాయిచరణ్, కర్నూలు మెటాలజికల్ ఇంజనీరింగ్ - ఎ.సాయిప్రకాష్, వెస్ట్ గోదావరి నానో టెక్నాలజీ - పి.మంత్రునాయక్, ప్రకాశం ఫార్మసీ - పి.పృధ్వీ, కృష్ణా -
మార్చి 13 నుంచి పీజీఈసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎంఈ/ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీజీఈసెట్‌కు ఆన్లైన్లో దరఖాస్తులను మార్చి 13 నుంచి స్వీకరించాలని టెస్టు కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మే 28 నుంచి 31 వరకు ప్రతి రోజూ రెండు దఫాలుగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఉదయం 10 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు హైదరాబాద్, వరంగల్ ప్రాంతీయ కేంద్రాల పరిధిలో పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 129 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంఈ/ఎంటెక్ కోర్సుల్లో, 96 కాలేజీల్లో ఎంఫార్మసీ కోర్సులో, 14 కాలేజీల్లో ఫార్మ్–బీ (పీబీ) కోర్సులో, 3 కాలేజీల్లో మాస్టర్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ఫీజును రూ. 1000గా (ఎస్సీ, ఎస్టీలకు రూ. 500) నిర్ణయించారు. 120 ప్రశ్నలతో 2 గంటల పాటు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మార్చి 6న జారీ చేయనున్నారు. పూర్తి వివరాలను http://pgecet.tsche.ac.in, http:// www.tsche.ac.in వెబ్సైట్లలో పొందవచ్చు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, టెస్టు కమిటీ చైర్మన్ ఎస్.రామచంద్రం, మండలి కార్యదర్శి శ్రీనివాసరావు, సెట్ కన్వీనర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. షెడ్యూలు వివరాలు.. 13–3–2019 నుంచి దరఖాస్తుల స్వీకరణ 30–4–2019 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 25–5–2019 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేదీ 22–5–2019 నుంచి 27–5–2019 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్. -
వచ్చే నెల 2న ఈసెట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ల్యాటరల్ ఎంట్రీ ద్వారా బీఈ/బీటెక్/బీఫార్మసీలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఈసెట్ –2018 పూర్తి స్థాయి షెడ్యూలు ఖరారైంది. అలాగే ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీజీఈసెట్–2018 పూర్తిస్థాయి షెడ్యూల్‌ను సెట్ కమిటీ ఖరారు చేసింది. సోమవారం జేఎన్టీయూలో ఆయా సెట్స్ కమిటీల సమావేశాలు జరిగాయి. అనంతరం ఆయా షెడ్యూళ్లను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్, పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు ప్రకటించారు. ఈసెట్, పీజీఈసెట్తోపాటు ఇతర అన్ని సెట్స్‌ను ఈసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈసెట్ నోటిఫికేషన్‌ను మార్చి 2న జారీ చేస్తామని, 5 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. పరీక్ష మే 9న ఉంటుందన్నారు. పరీక్ష ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ.400గా, ఇతరులకు రూ.800గా నిర్ణయించారు. 14 ప్రాంతీయ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అందులో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులోనూ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే 28 నుంచి పీజీఈసెట్ పరీక్షలు ఇక పీజీఈసెట్ నోటిఫికేషన్‌ను మార్చి 12న జారీ చేస్తామని, 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. పరీక్షలు మే 28 నుంచి 31 వరకు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఎంసెట్ కో–కన్వీనర్లు ప్రొఫెసర్ మంజూర్, ప్రొఫెసర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం 98 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంఈ/ఎంటెక్ కోర్సులు ఉన్నాయి. 116 కాలేజీల్లో ఎంఫార్మసీ కోర్సులు ఉన్నాయి. 4 కాలేజీల్లో ఎం.ఆర్క్ కోర్సులు ఉన్నాయి. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్ష కూడా ప్రతి రోజు రెండు సెషన్లు ఉంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. 120 బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 30 మార్కులను కటాఫ్ మార్కులుగా (ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ లేదు) నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000 (ఎస్సీ, ఎస్టీలకు రూ. 500)గా ఖరారు చేశారు. ఎంసెట్ కంటే ఎక్కువ ఫీజును దీనికి ఖరారు చేయడం గమనార్హం. పీజీఈసెట్ షెడ్యూలు.. 12–3–2018: పీజీఈసెట్ నోటిఫికేషన్ 15–3–2018 నుంచి: ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, దరఖాస్తుల సబ్మిషన్ ప్రారంభం (pజ్ఛఛ్ఛ్టి.్టటఛిజ్ఛి.్చఛి.జీn లేదా ్టటఛిజ్ఛి.్చఛి.జీn) 1–5–2018: ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ 7–5–2018: రూ. 500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 14–5–2018: రూ. 2 వేల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 21–5–2018: రూ. 5 వేల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 26–5–2018: రూ. 10 వేల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. మే 22 నుంచి మే 27 వరకు: వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ మే 28 నుంచి మే 31 వరకు: పీజీఈసెట్ ఆన్లైన్ పరీక్షలు. ఈసెట్ షెడ్యూల్... 2–3–2018: ఈసెట్ నోటిఫికేషన్ జారీ 5–3–2018: ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం 6–4–2018: ఆలస్య రుముసు లేకుండా దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు. 9–4–2018 నుంచి 16–4–2018 వరకు: ఆన్లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం 13–4–2018: రూ. 500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 20–4–2018: రూ. 1000 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 27–4–2018: రూ. 5 వేల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 3–5–2018: రూ.10 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. మే 2 నుంచి మే 7 వరకు: వెబ్సైట్ నుం చి దరఖాస్తుల స్వీకరణకు అవకాశం. మే 9: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష. -
పీజీఈసెట్ ఇక ఆన్లైన్లోనే..
హైదరాబాద్ : పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీఈసెట్‌ను ఈ ఏడాది నుంచే ఆన్లైన్లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. ఏటా పీజీఈసెట్‌కు 40 వేల మంది అభ్యర్థులు హాజరవుతుండగా ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహణకు సుమారు 50 పరీక్షా కేంద్రాలు సరిపోయేవి. ప్రస్తుతం ఉన్న పరీక్షాకేంద్రాల్లో ఆన్లైన్లో పరీక్ష నిర్వహణకు సరిపడా కంప్యూటర్లు అందుబాట్లో లేనందున పరీక్షాకేంద్రాల సంఖ్యను రెట్టింపు చేయాలని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే అధికంగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నందున 80శాతం మంది పీజీఈసెట్ అభ్యర్థులను ఈ రెండు జిల్లాల్లోనే సర్దుబాటు చేయాలని, మిగిలిన 20శాతం మంది అభ్యర్థులకు ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ నెల 9న పీజీఈసెట్ కమిటీ సమావేశం జరగనున్నందున, ఆన్లైన్లో పీజీఈసెట్ నిర్వహించే విషయమై సమావేశం అనంతరం తుదినిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
పీజీఈసెట్ వెబ్ఆప్షన్స్ గడువు పొడిగింపు
హైదరాబాద్: పీజీఈసెట్-2015 వెబ్ఆప్షన్స్ గడువు సెప్టెబంర్ 2 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్‌బాబు సోమవారం తెలిపారు. మొత్తం 22 వేల సీట్లకు ఇంత వరకు 18,500 పైగా అభ్యర్థులు వెబ్ఆప్షన్స్ ఇచ్చినట్లు వివరించారు. సీట్లు సాధించిన అభ్యర్థుల తొలి జాబితాను సెప్టెంబర్ 7న ప్రకటించనున్నట్లు, 14 నుంచి ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల తరగతులు ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ తెలిపారు. -
నేటి నుంచి పీజీఈసెట్
సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌లో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర పీజీ ఈసెట్-2015 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు హైదరాబాద్, వరంగల్ ప్రాంతీయ సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని టీఎస్ పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 18 విభాగాల్లో దాదాపు 49 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వివరించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అభ్యర్థులను అనుమతించమన్నారు. హెల్ప్‌డెస్క్ (040-27097124, 9160815762) కూడా ఏర్పాటు చేశామన్నారు. -
పిజీ ఈ సెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు లైన్ క్లియర్
-
పాసైనా.. పై చదువులకెళ్ళలేక..!
-
బంద్ కారణంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా
-
నేటి నుంచి కేయూ పీజీ సెట్
కేయూ క్యాంపస్(వరంగల్), న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న కేయూ పీజీ సెట్ శనివారం నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతుందని కేయూ ఇన్చార్జ్ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ నర్సింహచారి తెలిపారు. పీజీ సెట్లో భాగంగా 37 కోర్సులకు 32,321 దరఖాస్తులు వచ్చాయని, ఈ మేరకు కోర్సుల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు. కేయూ పీజీ సెట్ రాసే అభ్యర్థులకు హాల్‌టికెట్లను పోస్టు ద్వారా పంపించామని, అందని వారు ఆన్లైన్లో డౌన్‌లోన్ చేసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ఆయన పీజీ సెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. పీజీ సెట్ షెడ్యూల్ ఇదే.. కోర్సుల వారీగా పీజీ సెట్ నిర్వహించే తేదీల వివరాలిలా ఉన్నాయి. ఈనెల 24న ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12-30గంటల వరకు ఎమ్మెస్సీ బాటనీ, మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎంఎల్ఐఎస్సీ, ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్‌డబ్ల్యూ ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. 25వ తేదీన ఉదయం ఎంఈడీ, మధ్యాహ్నం ఎమ్మెస్సీ ఫిజిక్, ఫిజిక్స్(ఇంట్రుమేషన్), ఎంఏ సోషియాలజీ, పీజీ డిప్లోమా ఇన్ సెరికల్చర్, 26న ఉదయం ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంటీఎం, మధ్యాహ్నం ఎంఏ ఇంగ్లిష్, 27న ఉదయం ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంపీఈడీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులైన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, మధ్యాహ్నం ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పరీక్షలు జరుగుతాయి. 28న ఉదయం ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జువాలజీ, మధ్యాహ్నం ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అప్లెడ్ మ్యాథమెటిక్స్, ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 29న ఉదయం ఎంసీజే, మధ్యాహ్నం ఎమ్మెస్సీ సైకాలజీ, 31న ఉదయం ఎంహెచ్ఆర్ఎం, మధ్యాహ్నం ఎంఏ హిస్టరీ, ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులో ప్రవేశాలకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. అలాగే, జూన్ 1వతేదీన ఉదయం ఎంకాం, ఎంకాం(ఫైనాన్సియల్ అకౌంటింగ్), ఎంకాం బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ ఎంకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మధ్యాహ్నం ఎంఏ తెలుగు, ఎంఏ జెండర్ స్టడీస్, ఎమ్మెస్సీ నానోసైన్స్ అండ్ నానోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు పరీక్షలు జరుగతాయి. -
వచ్చే ఏడది కూడా ఉమ్మడి 'సెట్స్'
-
ఇంజనీరింగ్ పీజీకి చక్కటి ప్రత్యామ్నాయం.. పీజీఈసెట్
జి. రమణ, డైరెక్టర్, సాయిమేధ విద్యా సంస్థలు, హైదరాబాద్. ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ తర్వాత పయన మెటు.. ప్రతి విద్యార్థికి ఎదురయ్యే ప్రశ్న? ఉన్నత విద్య, ఉద్యోగం రెండింటిలో దేన్ని ఎంచుకోవాలి? ఎటు వైపు అడుగులు వేస్తే.. కెరీర్ అనే మ్యాచ్‌లో విన్నింగ్ స్ట్రోక్ సంధించడం సాధ్యమవుతుంది? ప్రస్తుత పోటీ పరిస్థితులను, జాబ్ మార్కెట్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే బీఈ/ బీటెక్ తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నత విద్య వైపు దృష్టి సారించడం మేలు.. ఇందుకు అందుబాటులో ఉన్న మార్గాల్లో ప్రధానమైనవి గేట్, పీజీఈసెట్. జాతీయ స్థాయిలో నిర్వహించే గేట్ తర్వాత మన రాష్ట్ర విద్యార్థులు ఇంజనీరింగ్ పీజీ చేయడానికి ఎంచుకుంటున్న మార్గం.. పీజీఈసెట్. 2014 సంవత్సరానికి పీజీఈసెట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) తర్వాత పీజీ చేయడానికి మన రాష్ర్ట విద్యార్థులకు ముందున్న చక్కటి ప్రత్యామ్నాయం.. ీపీజీఈసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్). గతేడాది మాదిరిగానే పీజీఈసెట్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ప్రవేశం పొందే కోర్సులు: ఎంటెక్, ఎంఈ, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్, ఫార్మ్-డి (పోస్ట్ బ్యాకులరేట్) 700 70 కాలేజీలు పైగా వేలకుపైగా సీట్లు (దాదాపుగా) 17 పేపర్లు: పీజీఈసెట్‌ను మొత్తం 17 పేపర్లు (సబ్జెక్ట్‌లు)గా నిర్వహిస్తారు. అవి.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, జియో ఇంజనీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జీ, ఫార్మసీ, నానోటెక్నాలజీ. కొత్త స్పెషలై జేషన్లు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో, బ్రాంచ్‌ల్లో 122 వరకు స్పెషలైజేషన్లు ఉన్నాయి. కొత్తగా కొన్ని స్పెషలైజేషన్లను ప్రవేశపెట్టారు. వాటిలో కొన్ని.. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో.. సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ; సివిల్ ఇంజనీరింగ్‌లో.. కంప్యూటర్ ఎంబడెడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎర్త్ క్వేక్స్; ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో.. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. ఆబ్జెక్టివ్‌గా: పీజీఈసెట్‌ను ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 120 మార్కులు. సిలబస్ విషయానికొస్తే.. గేట్ మాదిరిగానే ఉంటుంది. ప్రశ్నల క్లిష్టత మాత్రం గేట్ కంటే కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. వీటిలో 70 శాతం ప్రశ్నలు థియరీ బేస్డ్గా, 30 శాతం ప్రశ్నలు ప్రాబ్లమేటిక్ (ఫార్ములా బేస్డ్)గా ఉంటాయి. ఇంజనీరింగ్ అన్ని బ్రాంచ్‌లకు మ్యాథమెటిక్స్ ఉమ్మడిగా ఉంటుంది. ఈ అంశం నుంచి దాదాపు 15 మార్కులకు ప్రశ్నలు రావొచ్చు. ఫార్మసీ విద్యార్థులకు మాత్రం ఫార్మసీ సబ్జెక్టుపై మాత్రమే ప్రశ్నలు వస్తాయి. ప్రిపరేషన్: పీజీఈసెట్ ప్రధానంగా అభ్యర్థిలోని ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంది. కాబట్టి సబ్జెక్ట్‌లోని బేసిక్స్, ఫండమెంటల్స్, ముఖ్యమైన నిర్వచనాలు, ఫార్ములాలపై పట్టు సాధించాలి. అప్పుడే అనుకున్న విధంగా స్కోర్ సాధించడం సాధ్యమవుతుంది. విద్యార్థులు గమనించాల్సిన మరో విషయం.. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం, మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్ సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వీటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అంతేకాకుండా ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా కొన్ని అంశాలను పాటించాలి. అవి.. సంబంధిత బ్రాంచ్‌లో సబ్జెక్ట్‌లో కాన్సెప్ట్స్ తెలుసుకుని..వాటి నుంచి ఎన్ని విధాలుగా ప్రశ్నలు అడగొచ్చో అవగాహన చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ప్రాబ్లమ్‌ను కాన్సెప్ట్, ఫార్ములాను ఆధారం చేసుకొని వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఆబ్జెక్టివ్ ఓరియెంటేషన్‌లో: పరీక్ష ఆబ్జెక్టివ్‌గా ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్టివ్ ఓరియెంటేషన్‌లో ప్రిపరేషన్ సాగించడం ఉపయుక్తంగా ఉంటుంది. ఈ క్రమంలో పీజీఈసెట్, గేట్ ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. ముఖ్యంగా గేట్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షలలోని ఒక మార్కు ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. మరోకీలాకంశం.. మన ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవడం. ఇందుకు చక్కని మార్గం మాక్ టెస్ట్‌లు. కాబట్టి అందుబాటులో ఉన్న అన్ని రకాల నమూనా పరీక్షలకు హాజరు కావాలి. దీని వల్ల ఎగ్జామ్ ప్యాట్రన్, ఏ విధమైన ప్రశ్నలు అడుగుతున్నారు.. అనే దానిపై అవగాహన వస్తుంది. అంతేకాకుండా ప్రిపరేషన్ పరంగా మన బలాలు- బలహీనతలు తెలుస్తాయి. మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ద్వారా టైమ్ మేనేజ్మెంట్ కూడా అలవడుతుంది. ఎంత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం గుర్తించగలుగుతున్నారో తెలుస్తుంది. తద్వారా మరింత వేగంగా సమాధానం ఇచ్చే విధంగా ప్రిపరేషన్ సాగించవచ్చు. ప్రయోజనాలు: - ఏదైనా ఒక అంశంలో పరిపూర్ణత సాధించేందుకు పీజీ కోర్సులు దోహదం చేస్తాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది బీటెక్ విద్యార్థులు బయటికి వస్తున్నారు. కాబట్టి జాబ్ మార్కెట్లో పీజీ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత లభిస్తుంది. బీటెక్‌తో పోల్చితే హై పే-ప్యాకేజ్ ఆఫర్ వస్తుంది. - ప్రస్తుతం అధిక శాతం ఇంజనీరింగ్ కాలేజ్‌ల్లో ఎంటెక్ అర్హత ఉన్న ఫ్యాకల్టీలు లేరు. కాబట్టి ఎంటెక్ డిగ్రీ ఉంటే ఆకర్షణీయమైన పే ప్యాకేజ్‌తో ఫ్యాకల్టీగా కెరీర్ ప్రారంభించే అవకాశం లభిస్తుంది. - పరిశోధన సంస్థలు/ఆర్ అండ్ డీ సెంటర్లలో రీసెర్చ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు - తమ స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లో సులువుగా ఉద్యోగావకాశాలను దక్కించుకోవచ్చు (ఉదాహరణకు ఈసీఈ, ఈఈఈ అభ్యర్థులకు వీఎల్ఎస్ఐ, ఎంబెడ్ సిస్టమ్స్ వంటివి). స్పెషలైజేషన్ ఎంచుకునేటప్పుడు.. ప్రస్తుతం ఆ బ్రాంచ్‌కు ఉన్న డిమాండ్, రెండేళ్ల తర్వాత అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. - ఉన్నత కెరీర్ దిశగా.. పీహెచ్డీ చేసే అవకాశం కూడా ఉంటుంది. గేట్ స్థాయి ప్రిపరేషన్‌తో.. తర్వాత చేరే ఎంటెక్ కోర్సులో కాన్సెప్ట్స్‌ను సులువుగా అవగాహన చేసుకోవచ్చు. - పీజీఈసెట్ ప్రిపరేషన్.. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కో, ఏపీపీఎస్సీ (ఏఈఈ), బీఎస్ఎన్ఎల్ (జేటీఓ), డీఆర్డీఓ వంటి ఉద్యోగ నియామక పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. పీజీఈసెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆరు రీజియన్లలో 40 నుంచి 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. గతేడాది లక్ష మంది పీజీఈసెట్‌కు హాజరయ్యారు. ఈసారి ఆ సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నాం. మొత్తం 17 సబ్జెక్ట్‌లలో పీజీఈసెట్ జరుగుతుంది. ఈఏడాది కొత్తగా ఫుడ్ టెక్నాలజీ సబ్జెక్ట్‌ను ప్రవేశపెట్టాం. అంతేకాకుండా ఈ ఏడాది నుంచి అభ్యర్థులు నింపిన ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో ఉంచనున్నాం. దరఖాస్తు సమయంలో నిబంధనలను క్షుణ్నంగా చదవి నింపితే ఎటువంటి ఇబ్బందులుండవు. ఒకవేళ ఫొటో, పేరు విషయంలో సవరణలు ఉంటే ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు. ఈ-మెయిల్ ద్వారా కూడా ఫోటో విషయంలో దొర్లిన తప్పులను సవరించుకునే అవకాశం ఉంది. పరీక్ష పూర్తయిన రెండు రోజులకు ప్రాథమిక ‘కీ’, ఆ తర్వాత రెండుమూడ్రోజుల్లో తుది కీ విడుదల చేస్తాం. ఫలితాలను జూన్ 17న ప్రకటిస్తాం. - ప్రొఫెసర్ ఎ.వేణుగోపాలరెడ్డి, కన్వీనర్, పీజీఈసెట్-2014. పీజీఈసెట్-2014 సమాచారం అర్హత: 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఆర్క్/ బీఫార్మసీ/బీప్లాన్/ఫార్మ్-డి లేదా తత్సమానం. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2014 రూ. 500 లేట్ ఫీజుతో: మే 6, 2014 రూ. 2000 లేట్ ఫీజుతో: మే 14, 2014 రూ. 5000 లేట్ ఫీజుతో: మే 20, 2014 రూ. 10 వేల లేట్ ఫీజుతో: మే 24, 2014 పరీక్ష తేదీలు: 2014, మే 26 నుంచి 29 వరకు ఈమెయిల్: info@appgecet.org వివరాలకు: www.appgecet.org