ఇంజనీరింగ్ పీజీకి చక్కటి ప్రత్యామ్నాయం.. పీజీఈసెట్ | PGECET: Best way for Engineering PG | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ పీజీకి చక్కటి ప్రత్యామ్నాయం.. పీజీఈసెట్

Published Wed, Mar 12 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM

PGECET: Best way for Engineering PG

జి. రమణ,
డైరెక్టర్, సాయిమేధ
విద్యా సంస్థలు, హైదరాబాద్.

ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ తర్వాత పయన మెటు.. ప్రతి విద్యార్థికి ఎదురయ్యే ప్రశ్న?  ఉన్నత విద్య, ఉద్యోగం రెండింటిలో దేన్ని ఎంచుకోవాలి? ఎటు వైపు అడుగులు వేస్తే..  కెరీర్ అనే మ్యాచ్‌లో విన్నింగ్ స్ట్రోక్ సంధించడం సాధ్యమవుతుంది?  ప్రస్తుత పోటీ పరిస్థితులను, జాబ్ మార్కెట్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే  బీఈ/ బీటెక్ తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నత విద్య వైపు దృష్టి సారించడం మేలు..  ఇందుకు అందుబాటులో ఉన్న మార్గాల్లో ప్రధానమైనవి గేట్, పీజీఈసెట్. జాతీయ స్థాయిలో నిర్వహించే గేట్ తర్వాత మన రాష్ట్ర విద్యార్థులు ఇంజనీరింగ్ పీజీ చేయడానికి ఎంచుకుంటున్న మార్గం.. పీజీఈసెట్. 2014 సంవత్సరానికి పీజీఈసెట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు..

 గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) తర్వాత పీజీ చేయడానికి మన రాష్ర్ట విద్యార్థులకు ముందున్న చక్కటి ప్రత్యామ్నాయం.. ీపీజీఈసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్). గతేడాది మాదిరిగానే పీజీఈసెట్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
 
 ప్రవేశం పొందే కోర్సులు:
 ఎంటెక్, ఎంఈ, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్, ఫార్మ్-డి (పోస్ట్ బ్యాకులరేట్)
 700    70
 కాలేజీలు పైగా    వేలకుపైగా సీట్లు (దాదాపుగా)
 
 17 పేపర్లు:
 పీజీఈసెట్‌ను మొత్తం 17 పేపర్లు (సబ్జెక్ట్‌లు)గా నిర్వహిస్తారు. అవి.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, జియో ఇంజనీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జీ, ఫార్మసీ, నానోటెక్నాలజీ.
 
 కొత్త స్పెషలై జేషన్లు:
 రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో, బ్రాంచ్‌ల్లో 122 వరకు స్పెషలైజేషన్లు ఉన్నాయి. కొత్తగా కొన్ని స్పెషలైజేషన్లను ప్రవేశపెట్టారు. వాటిలో కొన్ని.. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో.. సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ; సివిల్ ఇంజనీరింగ్‌లో.. కంప్యూటర్ ఎంబడెడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎర్త్ క్వేక్స్; ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో.. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్.
 
 ఆబ్జెక్టివ్‌గా:
 పీజీఈసెట్‌ను ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 120 మార్కులు. సిలబస్ విషయానికొస్తే.. గేట్ మాదిరిగానే ఉంటుంది. ప్రశ్నల క్లిష్టత మాత్రం గేట్ కంటే కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. వీటిలో 70 శాతం ప్రశ్నలు థియరీ బేస్డ్‌గా, 30 శాతం ప్రశ్నలు ప్రాబ్లమేటిక్ (ఫార్ములా బేస్డ్)గా ఉంటాయి. ఇంజనీరింగ్ అన్ని బ్రాంచ్‌లకు మ్యాథమెటిక్స్ ఉమ్మడిగా ఉంటుంది. ఈ అంశం నుంచి దాదాపు 15 మార్కులకు ప్రశ్నలు రావొచ్చు. ఫార్మసీ విద్యార్థులకు మాత్రం ఫార్మసీ సబ్జెక్టుపై మాత్రమే ప్రశ్నలు వస్తాయి.
 
 ప్రిపరేషన్:
 పీజీఈసెట్ ప్రధానంగా అభ్యర్థిలోని ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంది. కాబట్టి సబ్జెక్ట్‌లోని బేసిక్స్, ఫండమెంటల్స్, ముఖ్యమైన నిర్వచనాలు, ఫార్ములాలపై పట్టు సాధించాలి. అప్పుడే అనుకున్న విధంగా స్కోర్ సాధించడం సాధ్యమవుతుంది. విద్యార్థులు గమనించాల్సిన మరో విషయం.. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం, మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్ సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వీటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అంతేకాకుండా ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా కొన్ని అంశాలను పాటించాలి. అవి.. సంబంధిత బ్రాంచ్‌లో సబ్జెక్ట్‌లో కాన్సెప్ట్స్ తెలుసుకుని..వాటి నుంచి ఎన్ని విధాలుగా ప్రశ్నలు అడగొచ్చో అవగాహన చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ప్రాబ్లమ్‌ను కాన్సెప్ట్, ఫార్ములాను ఆధారం చేసుకొని వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
 
 ఆబ్జెక్టివ్ ఓరియెంటేషన్‌లో:
 పరీక్ష ఆబ్జెక్టివ్‌గా ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్టివ్ ఓరియెంటేషన్‌లో ప్రిపరేషన్ సాగించడం ఉపయుక్తంగా ఉంటుంది. ఈ క్రమంలో పీజీఈసెట్, గేట్ ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. ముఖ్యంగా గేట్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షలలోని ఒక మార్కు ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.  మరోకీలాకంశం.. మన ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవడం. ఇందుకు చక్కని మార్గం మాక్ టెస్ట్‌లు. కాబట్టి అందుబాటులో ఉన్న అన్ని రకాల నమూనా పరీక్షలకు హాజరు కావాలి. దీని వల్ల ఎగ్జామ్ ప్యాట్రన్, ఏ విధమైన ప్రశ్నలు అడుగుతున్నారు.. అనే దానిపై అవగాహన వస్తుంది. అంతేకాకుండా ప్రిపరేషన్ పరంగా మన బలాలు- బలహీనతలు తెలుస్తాయి. మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ద్వారా టైమ్ మేనేజ్‌మెంట్ కూడా అలవడుతుంది. ఎంత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం గుర్తించగలుగుతున్నారో తెలుస్తుంది. తద్వారా మరింత వేగంగా సమాధానం ఇచ్చే విధంగా ప్రిపరేషన్ సాగించవచ్చు.
 
 ప్రయోజనాలు:
-     ఏదైనా ఒక అంశంలో పరిపూర్ణత సాధించేందుకు పీజీ కోర్సులు దోహదం చేస్తాయి.
 ప్రతి సంవత్సరం లక్షలాది మంది బీటెక్ విద్యార్థులు బయటికి వస్తున్నారు. కాబట్టి జాబ్ మార్కెట్లో పీజీ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత లభిస్తుంది. బీటెక్‌తో పోల్చితే హై పే-ప్యాకేజ్ ఆఫర్ వస్తుంది.
-     ప్రస్తుతం అధిక శాతం ఇంజనీరింగ్ కాలేజ్‌ల్లో ఎంటెక్ అర్హత ఉన్న ఫ్యాకల్టీలు లేరు. కాబట్టి ఎంటెక్ డిగ్రీ ఉంటే ఆకర్షణీయమైన పే ప్యాకేజ్‌తో ఫ్యాకల్టీగా కెరీర్ ప్రారంభించే అవకాశం లభిస్తుంది.
-     పరిశోధన సంస్థలు/ఆర్ అండ్ డీ సెంటర్లలో రీసెర్చ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
-     తమ స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లో సులువుగా ఉద్యోగావకాశాలను దక్కించుకోవచ్చు (ఉదాహరణకు ఈసీఈ, ఈఈఈ అభ్యర్థులకు వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడ్ సిస్టమ్స్ వంటివి). స్పెషలైజేషన్ ఎంచుకునేటప్పుడు.. ప్రస్తుతం ఆ బ్రాంచ్‌కు ఉన్న డిమాండ్, రెండేళ్ల తర్వాత అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
-     ఉన్నత కెరీర్ దిశగా.. పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంటుంది. గేట్ స్థాయి ప్రిపరేషన్‌తో.. తర్వాత చేరే ఎంటెక్ కోర్సులో కాన్సెప్ట్స్‌ను సులువుగా అవగాహన చేసుకోవచ్చు.
-     పీజీఈసెట్ ప్రిపరేషన్.. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, ఏపీపీఎస్సీ (ఏఈఈ), బీఎస్‌ఎన్‌ఎల్ (జేటీఓ), డీఆర్‌డీఓ వంటి ఉద్యోగ నియామక పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది.
 
 పీజీఈసెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆరు రీజియన్లలో 40 నుంచి 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. గతేడాది లక్ష మంది పీజీఈసెట్‌కు హాజరయ్యారు. ఈసారి ఆ సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నాం. మొత్తం 17 సబ్జెక్ట్‌లలో పీజీఈసెట్ జరుగుతుంది. ఈఏడాది కొత్తగా ఫుడ్ టెక్నాలజీ సబ్జెక్ట్‌ను ప్రవేశపెట్టాం. అంతేకాకుండా ఈ ఏడాది నుంచి అభ్యర్థులు నింపిన ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో ఉంచనున్నాం. దరఖాస్తు సమయంలో నిబంధనలను క్షుణ్నంగా చదవి నింపితే ఎటువంటి ఇబ్బందులుండవు. ఒకవేళ ఫొటో, పేరు విషయంలో సవరణలు ఉంటే ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు. ఈ-మెయిల్ ద్వారా కూడా ఫోటో విషయంలో దొర్లిన తప్పులను సవరించుకునే అవకాశం ఉంది. పరీక్ష పూర్తయిన రెండు రోజులకు ప్రాథమిక ‘కీ’, ఆ తర్వాత రెండుమూడ్రోజుల్లో తుది కీ విడుదల చేస్తాం. ఫలితాలను జూన్ 17న ప్రకటిస్తాం.
 - ప్రొఫెసర్ ఎ.వేణుగోపాలరెడ్డి,
 కన్వీనర్, పీజీఈసెట్-2014.

 
 పీజీఈసెట్-2014 సమాచారం
 అర్హత: 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఆర్క్/ బీఫార్మసీ/బీప్లాన్/ఫార్మ్-డి లేదా తత్సమానం. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:    ఏప్రిల్ 20, 2014
రూ. 500 లేట్ ఫీజుతో:    మే 6, 2014
రూ. 2000 లేట్ ఫీజుతో:    మే 14, 2014
రూ. 5000 లేట్ ఫీజుతో:    మే 20, 2014
రూ. 10 వేల లేట్ ఫీజుతో:    మే 24, 2014
పరీక్ష తేదీలు:    2014, మే 26 నుంచి 29 వరకు
ఈమెయిల్:    info@appgecet.org
వివరాలకు:    www.appgecet.org

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement