సాక్షి, హైదరాబాద్: ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఎంప్లానింగ్, ఫార్మ్–డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఈ ఫలితాలను చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. 19 రకాల సబ్జెక్టుల్లో పీజీ ప్రవేశాలకు ఈ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. సబ్జెక్టుల వారీగా టాపర్ల వివరాలను వెల్లడించారు. ఈ ఫలితాలను https://pgecet.tsche.ac.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు.
గత నెల 28 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు రాష్ట్రవ్యాప్తంగా 20,415 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 17,722 మంది హాజరయ్యారని చెప్పారు. వారిలో 15,644 మంది (88.27 శాతం) అర్హత సాధించారని తెలిపారు. ఇంజనీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల ప్రవేశా ల్లో ముందుగా గేట్, జీప్యాట్‌లో అర్హ త సాధించిన వారికి ప్రవేశాలు కల్పిస్తామని, ఆ తర్వాత పీజీఈసెట్ వారి కి ప్రవేశాలుంటాయని ఉస్మానియా వర్సిటీ వీసీ రామచంద్రం తెలిపారు.
జూలైలో ప్రవేశాల కౌన్సెలింగ్..
ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ జూలైలో ఉంటుందని పీజీఈసెట్ కన్వీనర్ కుమార్ తెలిపారు. ఈ నెలాఖరుకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక ప్రవేశాల కమిటీ సమావేశమై కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆర్.లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పీజీఈసెట్‌లో 88.27% అర్హత
Published Fri, Jun 21 2019 1:34 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment