వచ్చే నెల 2న ఈసెట్‌ నోటిఫికేషన్‌  | Ecet notification announcement next month | Sakshi
Sakshi News home page

వచ్చే నెల 2న ఈసెట్‌ నోటిఫికేషన్‌ 

Published Tue, Feb 27 2018 3:32 AM | Last Updated on Tue, Feb 27 2018 3:32 AM

Ecet notification announcement next month - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ల్యాటరల్‌ ఎంట్రీ ద్వారా బీఈ/బీటెక్‌/బీఫార్మసీలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఈసెట్‌ –2018 పూర్తి స్థాయి షెడ్యూలు ఖరారైంది. అలాగే ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీజీఈసెట్‌–2018 పూర్తిస్థాయి షెడ్యూల్‌ను సెట్‌ కమిటీ ఖరారు చేసింది. సోమవారం జేఎన్‌టీయూలో ఆయా సెట్స్‌ కమిటీల సమావేశాలు జరిగాయి. అనంతరం ఆయా షెడ్యూళ్లను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, ఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్, పీజీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌బాబు ప్రకటించారు. ఈసెట్, పీజీఈసెట్‌తోపాటు ఇతర అన్ని సెట్స్‌ను ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈసెట్‌ నోటిఫికేషన్‌ను మార్చి 2న జారీ చేస్తామని, 5 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. పరీక్ష మే 9న ఉంటుందన్నారు. పరీక్ష ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ.400గా, ఇతరులకు రూ.800గా నిర్ణయించారు. 14 ప్రాంతీయ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అందులో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులోనూ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  

మే 28 నుంచి పీజీఈసెట్‌ పరీక్షలు  
ఇక పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌ను మార్చి 12న జారీ చేస్తామని, 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. పరీక్షలు మే 28 నుంచి 31 వరకు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఎంసెట్‌ కో–కన్వీనర్లు ప్రొఫెసర్‌ మంజూర్, ప్రొఫెసర్‌ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం 98 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఎంఈ/ఎంటెక్‌ కోర్సులు ఉన్నాయి. 116 కాలేజీల్లో ఎంఫార్మసీ కోర్సులు ఉన్నాయి. 4 కాలేజీల్లో ఎం.ఆర్క్‌ కోర్సులు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్ష కూడా ప్రతి రోజు రెండు సెషన్లు ఉంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మరో సెషన్‌ ఉంటుంది. 120 బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 30 మార్కులను కటాఫ్‌ మార్కులుగా (ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్‌ లేదు) నిర్ణయించారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1,000 (ఎస్సీ, ఎస్టీలకు రూ. 500)గా ఖరారు చేశారు. ఎంసెట్‌ కంటే ఎక్కువ ఫీజును దీనికి ఖరారు చేయడం గమనార్హం. 

పీజీఈసెట్‌ షెడ్యూలు..
12–3–2018: పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌ 
15–3–2018 నుంచి: ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, దరఖాస్తుల సబ్మిషన్‌ ప్రారంభం (pజ్ఛఛ్ఛ్టి.్టటఛిజ్ఛి.్చఛి.జీn లేదా ్టటఛిజ్ఛి.్చఛి.జీn) 
1–5–2018: ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ 
7–5–2018: రూ. 500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 
14–5–2018: రూ. 2 వేల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 
21–5–2018: రూ. 5 వేల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 
26–5–2018: రూ. 10 వేల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 
మే 22 నుంచి మే 27 వరకు: వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ 
మే 28 నుంచి మే 31 వరకు: పీజీఈసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు. 

ఈసెట్‌ షెడ్యూల్‌...
2–3–2018: ఈసెట్‌ నోటిఫికేషన్‌ జారీ 
5–3–2018: ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం 
6–4–2018: ఆలస్య రుముసు లేకుండా దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు. 
9–4–2018 నుంచి 16–4–2018 వరకు: ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం 
13–4–2018: రూ. 500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 
20–4–2018: రూ. 1000 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 
27–4–2018: రూ. 5 వేల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 
3–5–2018: రూ.10 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 
మే 2 నుంచి మే 7 వరకు: వెబ్‌సైట్‌ నుం చి దరఖాస్తుల స్వీకరణకు అవకాశం. 
మే 9: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement