Tummala papireddy
-
తెలంగాణ కాంగ్రెస్‌కు జోష్.. హస్తం గూటికి ఫ్రొపెసర్ పాపిరెడ్డి
సాక్షి, వరంగల్: తెలంగాణలో పొలిటికల్ సమీకరణాలు మారుతున్నాయి. మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీల్లోకి చేరికలు ఎక్కువయ్యాయి. ఇక, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు అనంతరం.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. దీంతో, రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే చేరికలపై కూడా ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తొలి ఛైర్మన్‌గా పనిచేసిన ఫ్రొపెసర్ తుమ్మల పాపిరెడ్డి రాజకీయ ప్రవేశం చేయనున్నారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాగా, నిన్న(గురువారం) కాంగ్రెస్ చేపట్టిన దశాబ్ధి దగా కార్యక్రమంలో పాపిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ పాలనకు ముగింపు పలకడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే భావనతోనే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. ఇక, ఆదిలాబాద్‌కు చెందిన పాపిరెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం ఫ్రొపెసర్‌గా పనిచేసి వరంగల్‌లో స్థిరపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో వరంగల్ జిల్లా తెలంగాణ రాజకీయ ఐకాస కన్వీనర్‌గా పనిచేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ 2014 ఆగస్టు 5న పాపిరెడ్డిని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా నియమించారు. ఆ పదవిలో ఏడేళ్లకుపైగా పనిచేసిన పాపిరెడ్డి 2021 ఆగస్టులో వైదొలిగారు. ఇది కూడా చదవండి: డీకేతో కోమటిరెడ్డి భేటీ.. కీలక చర్చ -
డిగ్రీలో మిగులు సీట్ల భర్తీ బాధ్యత యాజమాన్యాలకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ తర్వాత డిగ్రీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు పాపిరెడ్డితో సమావేశం అయ్యారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతోపాటు కాలేజీల యాజమాన్యాలకు కొన్ని సడలింపులు ఇస్తామని పాపిరెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిసింది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ఆధ్వర్యంలో ఆన్లైన్ ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ తర్వాత మిగిలే సీట్ల భర్తీ బాధ్యతను యాజమాన్యాలకే ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. -
ఇవే ప్రిపరేషన్ సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ తరువాత పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడతామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. కరోనా అదుపులోకి వచ్చి లాక్డౌన్ ఎత్తివేయగానే వీలైనంత త్వరగా ప్రవేశ, వార్షిక పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అంశాలపై ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. విద్యార్థులు ఇళ్లల్లోనే ఉండి ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత ప్రత్యేకంగా శిక్షణ పొందే అవకాశం ఉండకపోవచ్చని, ఈ సమయాన్నే ప్రిపరేషన్ సెలవులుగా వినియోగించుకోవాలని సూచించారు. వచ్చే నెల 7నాటికి పరిస్థితి అదుపులోకి వస్తే మే చివరి నాటికి ఎంసెట్ పరీక్షలను ప్రారంభించే అవకాశం ఉంటుందన్నారు. దీనిపై ఆన్లైన్ పరీక్షల నిర్వహణ సంస్థతోనూ మాట్లాడతామన్నారు. ఎంసెట్ తరువాత వీలును బట్టి జూన్‌లో ఇతర ప్రవేశ పరీక్షలైన ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్‌ను నిర్వహించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ, బీటెక్, పీజీ కోర్సులకు సంబంధించిన ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను కూడా లాక్డౌన్ ముగియగానే నిర్వహించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు జూన్‌లో నిర్వహించాల్సి వచ్చినా ప్రవేశాల విషయంలో సమస్య ఉండబోదన్నారు. జూన్ నెలాఖరు నాటికి ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. -
మార్చి 6న ఐసెట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఐసెట్–2020) నోటిఫికేషన్‌ను మార్చి 6వ తేదీన జారీ చేయాలని ఐసెట్ కమిటీ నిర్ణయించింది. దరఖాస్తులను వచ్చే నెల 9 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు ఐసెట్ కన్వీనర్ కె.రాజిరెడ్డి వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ తేదీలతోపాటు నిబంధనలను, అర్హతలను కమిటీ ఖరారు చేసింది. ముఖ్యంగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) జాయింట్ కమిటీ, ఏఐసీటీఈ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (డీఈసీ)/డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు (డీఈబీ) గుర్తింపు కలిగిన యూనివర్సిటీల పరిధిలో దూర విద్య ద్వారా డిగ్రీ పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే రెగ్యులర్ డిగ్రీ చేసిన వారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఎంబీఏలో ప్రవేశాల కోసం ఐసెట్ ప్రవేశ పరీక్ష రాసేందుకు డిగ్రీ ఉత్తీర్ణులైæన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. ఎంసీఏలో ప్రవేశాల కోసం ఐసెట్ రాసేందుకు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలో మ్యాథమెటిక్స్ సబ్జెక్టు కలిగి బీసీఏ/బీఎస్సీ/బీకాం/బీఏ ఉత్తీర్ణులైనవారు అర్హులని స్పష్టంచేసింది. 25 శాతం మార్కులొస్తేనే అర్హులు ఐసెట్‌లో 25 శాతం మార్కులు సాధిస్తే అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటామని, ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులేవీ లేవని ఐసెట్ కమిటీ వెల్లడించింది. పరీక్ష ఫీజును రూ.650లుగా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఈసారి వికలాంగులకు ఫీజును తగ్గించింది. వారంతా రూ. 450 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. విద్యార్థులు టీఎస్ ఆన్లైన్, సిటిజన్ సర్వీస్ సెంటర్లు, ఈసేవ కేంద్రాల్లో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చని నిర్ణయించింది. విద్యార్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చని పేర్కొంది. ఆన్లైన్లో ఫీజు చెల్లింపు, ఇతర నిబంధనలు, అర్హతలకు సంబంధించిన సమగ్ర వివరాలు, సిలబస్ అంశాలను తమ వెబ్సైట్లో (http://icet.trche.ac.in,www.kakati ya.ac.in,www.trche.ac.in) పొందవచ్చని పేర్కొంది. ఈ పరీక్ష కోసం ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, కోదాడ, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్, కర్నూల్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రాల పరిధిలో ఐసెట్ పరీక్షలను మే 20, 21 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 21వ తేదీన ఉదయం సెషన్ మాత్రమే పరీక్ష నిర్వహించాలని నిర్ణ్ణయించింది. సమావేశంలో కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి, రిజిస్ట్రార్ పురుషోత్తం, ఉన్నత విద్యా మండలి అధికారులు, సెట్ కమిటీ ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇదీ షెడ్యూల్ 6–3–2020: నోటిఫికేషన్ 9–3–2020 నుంచి 30–4–2020 వరకు: ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ 6–5–2020 వరకు: రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు అవకాశం 11–5–2020 వరకు: రూ.2 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తులకు అవకాశం 16–5–2020 వరకు: రూ.5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తులకు అవకాశం 14–5–2020 నుంచి: హాల్‌టికెట్ల డౌన్లోడ్ మే 20, 21 తేదీల్లో: ఐసెట్ ఆన్లైన్ పరీక్షలు 27–5–2020: ప్రాథమిక కీ విడుదల 1–6–2020 వరకు: ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ 12–6–2020: ఫైనల్ కీ, ఫలితాలు విడుదల. -
ఎంసెట్ వెబ్ ఆప్షన్లు వాయిదా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సజావుగా జరిగేనా? షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందా? అంటే ఉన్నతాధికారుల నుంచి ఏమోనన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఫీజుల వ్యవహారంలో తలెత్తిన గందరగోళం ప్రవేశాల కౌన్సెలింగ్‌కు అడ్డంకిగా మారింది. కాలేజీలవారీగా ఫీజులను తేల్చకుండా వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించే అవకాశం లేకపోవడంతో ఈనెల 27 నుంచి జరగాల్సిన వెబ్ ఆప్షన్లు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఎంసెట్ అర్హత సాధించి ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న లక్ష మందికిపైగా విద్యార్థులకు ఎదురుచూపులు తప్పేలా లేవు. ఫీజులు ఖరారు కాకపోవడం వల్లే... రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గత నెలలో నిర్వహించిన ఎంసెట్ ఫలితాలను ఎంసెట్ కమిటీ ఈ నెల 9న ప్రకటించింది. దానికి అనుగుణంగా ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ ప్రవేశాల కమిటీని ఏర్పాటు చేసి ఈ నెల 22న ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశాయి. అయితే వచ్చే మూడేళ్లలో ఏటా వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేయకుండా ఆరు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. అయితే ప్రభుత్వం తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)కి చైర్మన్‌ను నియమించకుండా జాప్యం చేసినందున యాజమాన్యాలు టీఏఎఫ్ఆర్సీకి ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలని, చైర్మన్‌ను నియమించి ఫీజులు ఖరారు చేశాక ఎక్కువ తక్కువలు ఉంటే సర్దుబాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఉన్నత విద్యాశాఖ వర్గాలు చెబుతు న్నాయి. అయితే ఆ తీర్పు కాపీ ఇంతవరకు ప్రభుత్వానికే అందలేదని అధికారులు పేర్కొంటున్నారు. కోర్టు తీర్పు కాపీ అందగానే అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అంటే ఈ నెల 27 నాటికి తీర్పు కాపీ అందుతుందా? అప్పీల్‌కు వెళతారా? లేదా? అన్న గందరగోళం నెలకొంది. మరోవైపు ఆరు కాలేజీలే కాకుండా మరో 75 కాలేజీలు కూడా అవే ఉత్తర్వులను తమకు వర్తింపజేయాలంటూ కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో కోర్టు తీర్పును అమలు చేస్తే యాజమాన్య ప్రతిపాదిత ఫీజును 81 కాలేజీల్లో అమలు చేయాల్సి వస్తుంది. అదే జరిగితే తల్లిదండ్రులపై అధిక భారం పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో టీఏఎఫ్ఆర్సీకి చైర్మన్ నియామకం, వచ్చే మూడేళ్లపాటు వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారు వ్యవహారం, హైకోర్టు ఉత్తర్వులు తదితర అంశాలేవీ ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి మంగళవారం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో ఈ వ్యవహారంపై చర్చించినట్లు తెలిసింది. మంత్రి కూడా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని, సమస్యను త్వరగా పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. రేపటికల్లా స్పష్టత వచ్చేనా? ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్, విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభించేలా ప్రవేశాల కమిటీ ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది. ఇప్పటివరకు 37,909 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. 27వ తేదీన వెరిఫికేషన్ చేయించుకున్న వారు అదే రోజు నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఫీజుల వ్యవహారమే తేలలేదు. ఫీజుల వ్యవహారంలో కోర్టు తీర్పు కాపీనే అందలేదంటున్న అధికారులు దానిపై అప్పీల్‌కు వెళ్లడం ఈ రెండు రోజుల్లో సాధ్యం కాకపోవచ్చన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వాయిదా వేయకుండా 27వ తేదీ నుంచి వెబ్ఆప్షన్లు ప్రారంభించాలంటే కోర్టు ఉత్తర్వుల అమలుతోనే ముందుకు వెళ్లాల్సి వస్తుంది. లేదంటే ఇప్పటివరకు కోర్టు తీర్పు కాపీ అధికారికంగా అందలేదని చెబుతున్నారు కాబట్టి కొత్త ఫీజులు ఖరారు చేసే వరకు పాత ఫీజులే అన్న ఆప్షన్‌ను పెట్టి వెబ్ ఆప్షన్లను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోర్టు తీర్పు వ్యవహారం అయినందున ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుందా? లేదా? అన్నది బుధవారం తేలనుంది. మరోవైపు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేయకుండా ఏమేం ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. -
ఏప్రిల్ 30లోగా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి ఏప్రిల్ 30వ తేదీలోగా డిగ్రీ మూడో సంవత్సర పరీక్షలు పూర్తయ్యేలా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అన్ని రకాల చర్యలు చేపడతామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. జూన్ నెలాఖరు వచ్చినా కొన్ని యూనివర్సిటీల్లో ఇంకా డిగ్రీ వార్షిక పరీక్షలు జరుగుతున్నాయని, జూలైలోనూ కొన్ని యూనివర్సిటీల్లో వార్షిక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. కొత్త విద్యా సంవత్సర ప్రారంభంలో గందరగోళం నెలకొందని ‘సీబీసీఎస్ అమలులో గందరగోళం’శీర్షికన సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పదించిన పాపిరెడ్డి.. పాలనాపరమైన అంశాల వల్ల కొన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ వార్షిక పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అన్ని యూనివర్సిటీల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) పక్కాగా అమలు చేసేలా, సెమిస్టర్ పరీక్షలను సకాలంలో నిర్వహించేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఈమేరకు కామన్ అకడమిక్ కేలండర్ అమలుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. తద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు ఉండకుండా చర్యలు చేపట్టామని, పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని ఆయన స్పష్టంచేశారు. -
రాష్ట్రమంతా పీజీకి ఒకే ఎంట్రన్స్ టెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యు యేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీజీఈటీ) నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన వైస్ చాన్స్లర్ల (వీసీలు) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రం లోని 6 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు వేర్వేరుగా పీజీ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తున్నాయి. కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల్లో ప్రవేశాలకు కేయూ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుండగా..తెలంగాణ, మహాత్మాగాంధీ, ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఉస్మానియా వర్సిటీయే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. దీంతో విద్యార్థులకు ఆర్థిక భారంతోపాటు ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. రెండు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోంది. పైగా రెండు యూనివర్సిటీలపైనా నిర్వహణ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ఒకే పీజీ ఎంట్రెన్స్ నిర్వహించాలన్న ఆలోచనన ఎప్పటినుంచో ఉన్నత విద్యామండలి మదిలో ఉంది. గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి అన్ని వర్సిటీల వీసీల ఆమోదముద్ర పడింది. రానున్న విద్యా సంవత్సరంలో (2019–20) ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే పరీక్షను నిర్వహించే బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఉమ్మడి పీజీ ప్రవేశపరీక్షకు చైర్మన్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రంను నియమించారు. కమిటీలో మిగతా వర్సిటీల వైస్ ఛాన్స్లర్లు, ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణను నియమించారు. ఎంట్రెన్స్ టెస్టు కన్వీనర్‌ను నియమించే బాధ్యతను ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రంకు అప్పగించారు. -
పీఈసెట్‌లో బాలికల ముందంజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈసెట్– 2018 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడు దల చేశారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే టాప్ గా నిలిచారు. టాప్–10లో అత్యధికంగా బాలికలే ఉన్నారు. అందులోనూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఫిజిక ల్ టెస్టుల్లో ప్రతిభ కనబరిచి టాప్ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. డీపీఈడీ టాప్–10లో 9 మంది, బీపీఈడీ టాప్–10లో 8 మంది బాలికలు ఉన్నారు. ఇద్దరు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న వారు, 36 మంది జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు ఈ సారి పీఈసెట్‌కు హాజరైనట్లు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ చెప్పారు. ఫలితాలను www.pecet.tsche.ac.in లో పొందవచ్చని, తమ ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాలేజీల అఫిలియేషన్ ప్రక్రి య పూర్తయ్యాక ప్రవేశాల షెడ్యూల్‌ను జారీ చేస్తామన్నారు. గతేడాది డీపీఈడీలో 350 సీట్లు, బీపీఈడీలో 1,900 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈసారి అంతే సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉందని పీఈసెట్ చైర్మన్ ప్రొ. అల్తాఫ్ హుస్సేన్ పేర్కొన్నారు. 128 మంది ఫెయిల్ పీఈసెట్‌లో భాగంగా బీపీఈడీ పరీక్షలో 86 మంది ఫెయిలయ్యారు. డీపీఈడీ పరీక్షలో 42 మంది ఫెయిలయ్యారు. మొత్తంగా పీఈసెట్‌లో 128 మంది ఫెయిలయ్యారు. -
నేడు ఎంసెట్ నోటిఫికేషన్
-
వచ్చే నెల 2న ఈసెట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ల్యాటరల్ ఎంట్రీ ద్వారా బీఈ/బీటెక్/బీఫార్మసీలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఈసెట్ –2018 పూర్తి స్థాయి షెడ్యూలు ఖరారైంది. అలాగే ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీజీఈసెట్–2018 పూర్తిస్థాయి షెడ్యూల్‌ను సెట్ కమిటీ ఖరారు చేసింది. సోమవారం జేఎన్టీయూలో ఆయా సెట్స్ కమిటీల సమావేశాలు జరిగాయి. అనంతరం ఆయా షెడ్యూళ్లను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్, పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు ప్రకటించారు. ఈసెట్, పీజీఈసెట్తోపాటు ఇతర అన్ని సెట్స్‌ను ఈసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈసెట్ నోటిఫికేషన్‌ను మార్చి 2న జారీ చేస్తామని, 5 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. పరీక్ష మే 9న ఉంటుందన్నారు. పరీక్ష ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ.400గా, ఇతరులకు రూ.800గా నిర్ణయించారు. 14 ప్రాంతీయ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అందులో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులోనూ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే 28 నుంచి పీజీఈసెట్ పరీక్షలు ఇక పీజీఈసెట్ నోటిఫికేషన్‌ను మార్చి 12న జారీ చేస్తామని, 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. పరీక్షలు మే 28 నుంచి 31 వరకు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఎంసెట్ కో–కన్వీనర్లు ప్రొఫెసర్ మంజూర్, ప్రొఫెసర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం 98 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంఈ/ఎంటెక్ కోర్సులు ఉన్నాయి. 116 కాలేజీల్లో ఎంఫార్మసీ కోర్సులు ఉన్నాయి. 4 కాలేజీల్లో ఎం.ఆర్క్ కోర్సులు ఉన్నాయి. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్ష కూడా ప్రతి రోజు రెండు సెషన్లు ఉంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. 120 బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 30 మార్కులను కటాఫ్ మార్కులుగా (ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ లేదు) నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000 (ఎస్సీ, ఎస్టీలకు రూ. 500)గా ఖరారు చేశారు. ఎంసెట్ కంటే ఎక్కువ ఫీజును దీనికి ఖరారు చేయడం గమనార్హం. పీజీఈసెట్ షెడ్యూలు.. 12–3–2018: పీజీఈసెట్ నోటిఫికేషన్ 15–3–2018 నుంచి: ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, దరఖాస్తుల సబ్మిషన్ ప్రారంభం (pజ్ఛఛ్ఛ్టి.్టటఛిజ్ఛి.్చఛి.జీn లేదా ్టటఛిజ్ఛి.్చఛి.జీn) 1–5–2018: ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ 7–5–2018: రూ. 500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 14–5–2018: రూ. 2 వేల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 21–5–2018: రూ. 5 వేల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 26–5–2018: రూ. 10 వేల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. మే 22 నుంచి మే 27 వరకు: వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ మే 28 నుంచి మే 31 వరకు: పీజీఈసెట్ ఆన్లైన్ పరీక్షలు. ఈసెట్ షెడ్యూల్... 2–3–2018: ఈసెట్ నోటిఫికేషన్ జారీ 5–3–2018: ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం 6–4–2018: ఆలస్య రుముసు లేకుండా దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు. 9–4–2018 నుంచి 16–4–2018 వరకు: ఆన్లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం 13–4–2018: రూ. 500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 20–4–2018: రూ. 1000 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 27–4–2018: రూ. 5 వేల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. 3–5–2018: రూ.10 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసేందుకు చివరి గడువు. మే 2 నుంచి మే 7 వరకు: వెబ్సైట్ నుం చి దరఖాస్తుల స్వీకరణకు అవకాశం. మే 9: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష. -
నేడు ఎంసెట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం ఎంసెట్ పూర్తిస్థాయి షెడ్యూల్ ఖరారైంది. దీనిపై మంగళవారం నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 2 నుంచి 7వ తేదీ వరకు (6వ తేదీ మినహా.. ఆరోజున నీట్ పరీక్ష ఉంది) ఆన్లైన్ విధానంలో పరీక్షలను నిర్వహిస్తారు. ఈ మేరకు సోమవారం జేఎన్టీయూలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నా రు. సమావేశం అనంతరం పాపిరెడ్డితోపాటు ఎంసెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ యాదయ్య వివరాలను వెల్లడించారు. తొలిసారిగా ఆన్లైన్లో.. బీఈ/బీటెక్, బయోటెక్, బీటెక్ డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, బీఫార్మసీ, బీఎస్సీ హానర్స్, అగ్రికల్చర్/బీఎస్సీ (హానర్స్), హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, ఫార్మ్–డి కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్–2018ను నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని.. రోజూ రెండు సెషన్లలో, ఒక్కో సెషన్లో 25 వేల మందికి పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక్కో సెషన్‌కు ఇచ్చే ప్రశ్నలు వేర్వేరుగా ఉం టాయి కనుక విద్యార్థుల మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ చేపడతామన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ నేతృత్వంలో దానిని ఖరారు చేశామని, అవగాహన కోసం దానిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈసారి తెలుగు, ఇంగ్లిషుతోపాటు ఉర్దూ మీడియంలోనూ ప్రశ్నలు ఇస్తామని, వారికి ఇచ్చే ప్రశ్నలు ఉర్దూ, ఇంగ్లిషు రెండు భాషల్లో ఉంటాయని చెప్పారు. మెయిల్ ఐడీ తప్పనిసరి ఆన్లైన్ పరీక్షల నిర్వహణలో సమస్యలు రాకుండా పక్కా చర్యలు చేపడుతున్నామని, పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. ఈసారి దరఖాస్తుకు మెయిల్ఐడీ తప్పనిసరి చేశామని, ఏ సమాచారమైనా మెయిల్‌కే పంపిస్తామని వెల్లడించారు. మే 9న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, అదేరోజున ఆన్లైన్ పరీక్ష జవాబు పత్రం (రెస్పాన్స్ షీట్) మెయిల్ ఐడీకే పంపుతామని చెప్పారు. ఆన్లైన్ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఐదు జోన్లతోపాటు కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, నిజమాబాద్, వరంగల్, ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులో ప్రాంతీయ కేంద్రాలు ఉంటాయని తెలిపారు. ఆన్లైన్ పరీక్షలకు ప్రాక్టీస్ కోసం ్ఛ్చఝఛ్ఛ్టి. ్టటఛిజ్ఛి.్చఛి.జీn వెబ్సైట్లో మాక్ టెస్టుల లింకులను అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా ఈసారి ఆన్లైన్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష ఫీజులు పెంచుతున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. గతేడాది ఎస్సీ, ఎస్టీలకు రూ.250గా ఉన్న ఫీజు ఈసారి రూ.400కు.. బీసీ, జనరల్ విద్యార్థులకు రూ.500 నుంచి రూ.800కు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇదీ షెడ్యూల్ 27–2–2018: ఎంసెట్ నోటిఫికేషన్ 4–3–2018 నుంచి 4–4–2018 వరకు: ఆన్లైన్లో దరఖాస్తులు 6–4–2018 నుంచి 9–4–2018 వరకు: దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం 11–4–2018 వరకు: రూ.500 ఆలస్య రుసుముతో; 18వ తేదీ వరకు రూ.1,000; 24వ తేదీ వరకు రూ.5 వేలు; 28వ తేదీ వరకు రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తులు 20–4–2018 నుంచి 1–5–2018 వరకు: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం 2–5–2018, 3–5–2018: అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు (ఉదయం సెషన్ 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి 6 గంటల వరకు) 4–5–2018, 5–5–2018, 7–5–2018: ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్ష -
ఫిబ్రవరిలో సెట్స్ నోటిఫికేషన్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్)కు వచ్చేనెల తొలి వారంలో నోటిఫికేషన్లు జారీ చేయాలని ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం వివిధ సెట్స్ కన్వీనర్లు, టీఎస్టీఎస్–టీసీఎస్ ప్రతినిధులతో ఆన్లైన్ పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. అనంతరం వివరాలను పాపిరెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్లను సెట్స్ కన్వీనర్లు జారీ చేస్తారని వెల్లడించారు. విద్యామండలి వెబ్‌సైట్‌తోపాటు ఆయా సెట్స్ వెబ్సైట్లను అందుబాటులోకి తేవాలని, వాటిల్లో ఆన్లైన్ మాక్ టెస్టుల లింకులను అందుబాటులో ఉంటా యని చెప్పారు. వెబ్సైట్లతో ఆరేడు పరీక్షల నమూనా పేపర్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇంటర్మీడియెట్ బోర్డు గ్రామీణ, ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం ఆన్లైన్ మాక్టెస్టుల నిర్వహణకు చర్యలు చేపడుతోందన్నారు. ఈసారి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నందున ఫీజులు స్వల్పంగా పెరుగుతాయన్నారు. సెట్ కమిటీల సమావేశాల్లో ఫీజులు నిర్ణయిస్తారని, నోటిఫికేషన్లలో వాటి వివరాలుంటాయని పేర్కొన్నారు. పరీక్షాకేంద్రాలను అన్ని పాత జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సెట్స్ కన్వీనర్లు కేంద్రాలను పరిశీలించాలని, అన్ని సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆన్లైన్లో తలెత్తే సాంకేతిక సమస్యలు, పరిష్కారాలపైనా చర్చించినట్లు తెలిపారు. 25 వేల కంటే ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే పరీక్షలను రోజూ 2 సెషన్లుగా నిర్వహిస్తామని, వీటిల్లో ఎంసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, ఈసెట్ పరీక్షలు ఉంటాయన్నారు. ఎంసెట్ పరీక్షలను 5 రోజులపాటు నిర్వహిస్తామని, రోజు ఉదయం 10 నుంచి 1 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయని వివరించారు. ఇంగ్లిషు, తెలుగుల్లో ఆన్లైన్ పరీక్ష పేపర్లు ఉంటాయని, గతంలో ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసే విద్యార్థులు ఆన్లైన్లో టిక్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. -
మారిన ఎంసెట్-2 షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 9న నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ఎంసెట్-2కు హాజరుకావాలనుకునే అభ్యర్థుల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువును (ఆలస్య రుసుము లేకుండా) ఈనెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. వాస్తవానికి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల గడువు మంగళవారం రాత్రితో ముగిసింది. అయితే, విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించినట్లు వెల్లడించారు. దీంతో ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఇతర షెడ్యూలులోనూ మార్పులు చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి మంగళవారం రాత్రి 7 గంటల వరకు 51,009 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని తెలంగాణ జిల్లాల నుంచి 33163 మంది, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో నుంచి 9678 మంది, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని జిల్లాల నుంచి 6691 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 1477 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో అధికారులు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచారు. -
ఈ నెల 27లోగానే ఎంసెట్ ర్యాంకులు
* జూన్ మొదటి వారంలో కౌన్సెలింగ్ * జూలై 1 నుంచి తరగతులు, జూలైలోనే స్లైడింగ్‌కు అవకాశం * ఉన్నత విద్యా మండలి చైర్మన్ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 15న జరిగే ఎంసెట్‌కు హాజరు కానున్న విద్యార్థులకు ర్యాంకులను ఈ నెల 27న ఇస్తామని ప్రకటించామని, వీలైతే అంతకంటే ముందుగానే ర్యాంకులను ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఎంసెట్ ఏర్పాట్లలో భాగంగా శనివారం మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. జూన్ మొదటి వారంలోనే ప్రవేశాలకు కౌన్సెలింగ్ చేపడతామని, జూన్ 20 నాటికి మొదటి, రెండో దశ కౌన్సెలింగ్‌లను పూర్తి చేసేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జూలై 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో తరగతులను ప్రారంభిస్తామని, అలాగే సీట్లు పొందిన విద్యార్థులు తమ కాలేజీలు, ఆప్షన్లు మార్పు చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నామని, జూలై మొదటి వారంలోనే విద్యార్థులకు స్లైడింగ్‌కు అవకాశం కల్పిస్తామన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని వసతులు కల్పించామని, అన్నీ పరిశీలించాకే ఎంసెట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడిం చారు. వేసవి దృష్ట్యా కొన్ని కేంద్రాల్లో తాగునీటి సమస్య ఉన్నందున అన్ని కేంద్రాల్లో విద్యార్థులకు అర లీటర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రైవేటు కాలేజీల మెడ్‌సెట్ పరీక్షపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని పాపిరెడ్డి తెలిపారు. సీబీఎస్ఈ విద్యార్థులకు పాయింట్ ర్యాంకులు సీబీఎస్ఈ సిలబస్‌లో చదివే విద్యార్థుల 12వ తరగతి ఫలితాలు.. ఎంసెట్ ర్యాంకులు ఇచ్చేనాటికి అందకపోతే ఆ తర్వాత వారికి పాయింట్ ర్యాంకులు ఇస్తామని ఎంసెట్ కమిటీ ప్రకటించింది. మే 30న సీబీఎస్ఈ విద్యార్థుల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే అంతకంటే ముందే విద్యార్థుల ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకులను ప్రకటించేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ విద్యార్థుల ఫలితాలు అప్పటికి రావు కాబట్టి వారికి పాయింట్ ర్యాంకులను ఇవ్వాలని నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆ ఫలితాలు వచ్చాక సప్లిమెంటరీ ర్యాంకులను ఇస్తామని కమిటీ వెల్లడించింది. ఇంజనీరింగ్ కాలేజీలకు గ్రేడింగ్‌లు వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకు గ్రేడింగ్‌లు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ శైలజా రామయ్యార్ పేర్కొన్నారు. అయితే కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలపైనే ప్రధానంగా దృష్టి సారించామని, కాలేజీల వారీగా వసతులు, ఫ్యాకల్టీ వివరాలన్నీ విద్యార్థులు చూసుకునేలా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు.