సాక్షి, వరంగల్: తెలంగాణలో పొలిటికల్ సమీకరణాలు మారుతున్నాయి. మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీల్లోకి చేరికలు ఎక్కువయ్యాయి. ఇక, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు అనంతరం.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. దీంతో, రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే చేరికలపై కూడా ఫోకస్ పెట్టారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తొలి ఛైర్మన్‌గా పనిచేసిన ఫ్రొపెసర్ తుమ్మల పాపిరెడ్డి రాజకీయ ప్రవేశం చేయనున్నారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాగా, నిన్న(గురువారం) కాంగ్రెస్ చేపట్టిన దశాబ్ధి దగా కార్యక్రమంలో పాపిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా అధికార బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ పాలనకు ముగింపు పలకడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అనే భావనతోనే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు స్పష్టం చేశారు.
ఇక, ఆదిలాబాద్‌కు చెందిన పాపిరెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం ఫ్రొపెసర్‌గా పనిచేసి వరంగల్‌లో స్థిరపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో వరంగల్ జిల్లా తెలంగాణ రాజకీయ ఐకాస కన్వీనర్‌గా పనిచేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ 2014 ఆగస్టు 5న పాపిరెడ్డిని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా నియమించారు. ఆ పదవిలో ఏడేళ్లకుపైగా పనిచేసిన పాపిరెడ్డి 2021 ఆగస్టులో వైదొలిగారు.
ఇది కూడా చదవండి: డీకేతో కోమటిరెడ్డి భేటీ.. కీలక చర్చ
Comments
Please login to add a commentAdd a comment