సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్ తర్వాత డిగ్రీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు పాపిరెడ్డితో సమావేశం అయ్యారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతోపాటు కాలేజీల యాజమాన్యాలకు కొన్ని సడలింపులు ఇస్తామని పాపిరెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిసింది. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ తర్వాత మిగిలే సీట్ల భర్తీ బాధ్యతను యాజమాన్యాలకే ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment