హైదరాబాద్ : పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీఈసెట్‌ను ఈ ఏడాది నుంచే ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. ఏటా పీజీఈసెట్‌కు 40 వేల మంది అభ్యర్థులు హాజరవుతుండగా ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహణకు సుమారు 50 పరీక్షా కేంద్రాలు సరిపోయేవి. ప్రస్తుతం ఉన్న పరీక్షాకేంద్రాల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహణకు సరిపడా కంప్యూటర్లు అందుబాట్లో లేనందున పరీక్షాకేంద్రాల సంఖ్యను రెట్టింపు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే అధికంగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నందున 80శాతం మంది పీజీఈసెట్ అభ్యర్థులను ఈ రెండు జిల్లాల్లోనే సర్దుబాటు చేయాలని, మిగిలిన 20శాతం మంది అభ్యర్థులకు ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ నెల 9న పీజీఈసెట్ కమిటీ సమావేశం జరగనున్నందున, ఆన్‌లైన్‌లో పీజీఈసెట్ నిర్వహించే విషయమై సమావేశం అనంతరం తుదినిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
పీజీఈసెట్ ఇక ఆన్‌లైన్‌లోనే..
Published Sat, Mar 5 2016 8:15 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement